Fastest Charging Electric SUV India: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ కార్ల డిమాండ్‌ పెరుగుతున్న కొద్దీ, మిడ్‌సైజ్‌ ఎలక్ట్రిక్‌ SUV సెగ్మెంట్‌ కూడా బాగానే పుంజుకుంది. రేంజ్‌, పవర్‌, ఫీచర్లు, ప్రైస్‌.. ఇలా ఆల్‌ ఇన్‌ వన్‌ ప్యాకేజీ కావాలనుకునే ఫ్యామిలీలకు ఇవి సరైన ఆప్షన్‌గా మారాయి. అయితే ఎలక్ట్రిక్‌ కార్ల విషయంలో ఎక్కువ మంది కొనుగోలుదారులను వేధించే ప్రధాన సమస్య - ఛార్జింగ్‌. రేంజ్‌ ఎక్కువగా ఉన్నా, ఛార్జింగ్‌ వేగం తగ్గితే యూజర్‌కు అసౌకర్యం తప్పదు. అందుకే కంపెనీలు వేగంగా ఛార్జింగ్‌ అయ్యే బ్యాటరీ టెక్నాలజీలపై ఫోకస్‌ చేస్తున్నాయి.

Continues below advertisement

AC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టైమ్‌ను బేస్‌గా తీసుకుని, ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న మిడ్‌సైజ్‌ ఎలక్ట్రిక్‌ SUVల్లో ఏవి వేగంగా ఛార్జ్‌ అవుతాయో తెలుసుకుందాం.

5. Mahindra BE 6

Continues below advertisement

(0-100%: 8.7 గంటలు / 7.2kW AC ఛార్జర్‌)

ప్రైస్‌: ₹18.90-26.90 లక్షలు (ఛార్జర్‌ లేకుండా) (ఎక్స్‌-షోరూమ్‌)

మహీంద్రా లైనప్‌లో ఇప్పటివరకు చూసిన వాటిలో BE 6 నిజంగా అత్యంత అగ్రెసివ్‌గా, భిన్నంగా కనిపించే SUV. 59kWh & 79kWh బ్యాటరీలతో వస్తుంది. AC ఛార్జింగ్‌లో... 59kWh బ్యాటరీ 7.2kW ఛార్జర్‌తో 0 నుంచి 100% వరకు 8.7 గంటలు పడుతుంది. లిస్ట్‌లో ఇదే అత్యంత స్లో ఛార్జింగ్‌ SUV. అయితే పెద్ద బ్యాటరీలు ఉన్నందున టైమ్‌ ఎక్కువ కావడం సహజమే. 11.2kW ఆప్షనల్‌ ఛార్జర్‌ తీసుకుంటే టైమ్‌ 6 గంటలకు తగ్గుతుంది.

4. MG ZS EV

(0-100%: 8.5-9 గంటలు / 7.4kW)

ప్రైస్‌: ₹17.99-20.50 లక్షలు (లేదా, BaaS‌లో ₹13–15.51 లక్షలు) (ఎక్స్‌-షోరూమ్‌)

భారత మార్కెట్‌లోకి వచ్చిన తొలి మిడ్‌సైజ్‌ ఎలక్ట్రిక్‌ SUV- ZS EV. 50.3kWh బ్యాటరీతో వస్తుంది & 7.4kW స్టాండర్డ్‌ AC ఛార్జర్‌తో 8.5-9 గంటల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. ఈ ఛార్జర్‌ ఖర్చును MG కంపెనీనే భరించడం ఒక పెద్ద ప్లస్‌. మహీంద్రా BE 6 కంటే దీని బ్యాటరీ చిన్నదైనా, టైమ్‌లో పెద్ద తేడా లేకపోవడం MG ఆర్కిటెక్చర్‌ లిమిటేషన్స్‌ను చూపిస్తుంది.

3. MG Windsor EV

(10-100%: 7 గంటలు / 7.4kW)

ప్రైస్‌: ₹14-18.39 లక్షలు (BaaS: ₹9.99–13.99 లక్షలు) (ఎక్స్‌-షోరూమ్‌)

చూసేందుకు హ్యాచ్‌బ్యాక్‌ మాదిరిగా కనిపించినా, డెమెన్షన్ల పరంగా మిడ్‌సైజ్‌ SUV సెగ్మెంట్‌లోనే ఉంటుంది. 38kWh & 52.9kWh బ్యాటరీలతో అందుబాటులో ఉంది. 38kWh వెర్షన్‌ 7 గంటల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రారంభ వేరియంట్లలో 3.3kW ఛార్జింగ్‌ మాత్రమే ఉంటుంది, ఇది 13.5 గంటలు పడుతుంది. 7.4kW ఛార్జింగ్‌ మాత్రం హయ్యర్‌ వెర్షన్లలో మాత్రమే ఉంటుంది.

2. Tata Curvv EV

(10-100%: 6.5 గంటలు / 7.2kW)

ప్రైస్‌: ₹17.49–21.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

Tata Curvv EV AC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పరంగా ఈ లిస్ట్‌లో బెటర్‌ ప్లేస్‌లో ఉంది. 45kWh బ్యాటరీ 6.5 గంటల్లో ఫుల్‌ అవుతుంది. ఇదే బ్యాటరీ సైజు ఇస్తున్న Windsor కంటే 30 నిమిషాలు వేగంగా ఛార్జ్‌ అవడం గమనార్హం. 55kWh పెద్ద బ్యాటరీ కూడా ZS EV కంటే వేగంగా, 7.9 గంటల్లో ఫుల్‌ అవుతుంది. పైగా 7.2kW ఛార్జర్‌ అన్ని వేరియంట్లకు స్టాండర్డ్‌గా వస్తుంది.

1. Hyundai Creta Electric

(10-100%: 4 గంటలు / 11kW)

ప్రైస్‌: ₹18.02–23.67 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) (11kW ఛార్జర్‌ ఆప్షనల్‌)

లిస్ట్‌లో టాప్‌ స్పాట్‌ - Hyundai Creta Electric. ఈ కారు 11kW AC ఛార్జర్‌తో కేవలం 4 గంటల్లో 10-100% ఛార్జ్‌ అవుతుంది. అదే 11kW సపోర్ట్‌ ఉన్న మహీంద్రా BE 6 తో పోలిస్తే ఇది రెండు గంటలు వేగంగా ఛార్జ్‌ అవుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, Creta Electric రేంజ్‌ BE 6 కంటే 157-173 కిలోమీటర్ల వరకు తక్కువ. క్రెటా ఛార్జర్‌ను ఆప్షనల్‌గా, ₹73,000 అదనంగా కొనాలి.

ఫైనల్‌గా...AC ఛార్జింగ్‌ పరంగా Creta Electric స్పష్టంగా టాప్‌ పెర్ఫార్మెన్స్‌ చేస్తోంది. Curvv EV తన సెగ్మెంట్‌లో మంచి బ్యాలెన్స్‌ ఇస్తుంది. MG Windsor అత్యంత బడ్జెట్‌ ఫ్రెండ్లీ EV కాగా, BE 6 మాత్రం పెద్ద బ్యాటరీల వల్ల టైమ్‌ ఎక్కువ తీసుకుంటుంది.

EV కొనుగోలు చేసేవాళ్లు చార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, బ్యాటరీ సైజు, ఛార్జింగ్‌ వేగం అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడంలో కీలకం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.