Fastag Toll Double Charge From November 15: ఇకపై, ఫాస్టాగ్‌ లేకుండా టోల్‌ గేట్ల వద్ద క్యాష్‌తో చెల్లించాలంటే రెట్టింపు ఫీజు కట్టాల్సిందే. నవంబర్‌ 15, 2025 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ట్రాఫిక్‌ జామ్‌లు తగ్గించి, డిజిటల్‌ పేమెంట్స్‌ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర రవాణా శాఖ (MoRTH) ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Continues below advertisement

ఫాస్టాగ్‌ లేకుంటే భారీ ఫీజుఇప్పటి వరకు ఫాస్టాగ్‌తో టోల్‌ చెల్లించడం తప్పనిసరి. కానీ ఇక నుంచి ఫాస్టాగ్‌ లేకుండా టోల్‌ వద్ద క్యాష్‌తో (Toll payment through cash) చెల్లిస్తే డబుల్‌ ఫీజు, UPI తో చెల్లిస్తే ‍‌(Toll payment through UPI) 1.25 రెట్లు ఫీజు చెల్లించాలి. ఉదాహరణకు, ₹100 టోల్‌కు.. ఫాస్టాగ్‌ లేకుండా క్యాష్‌తో ₹200, యూపీఐతో ₹125 చెల్లించాలి. అంటే, ఫాస్టాగ్‌ లేనప్పుడు క్యాష్‌లో చెల్లించకుండా UPI ద్వారా చెల్లిస్తే మీకు చాలా డబ్బు సేవ్‌ అవుతుంది.

డిజిటల్‌ పేమెంట్స్‌కు ప్రోత్సాహంకేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్‌ National Highways Fee (Determination of Rates and Collection) Rules, 2008 సవరణలో భాగం. దీని లక్ష్యం - పూర్తిగా క్యాష్‌ లావాదేవీలను తగ్గించి, డిజిటల్‌ ట్రాన్సాక్షన్‌లను ప్రోత్సహించడం.

Continues below advertisement

“ఫాస్టాగ్‌ లేకుండా టోల్‌ ప్లాజాలోకి వచ్చిన వాహనాలకు క్యాష్‌ చెల్లింపు చేస్తే రెండు రెట్లు ఫీజు వసూలు చేస్తాం. ఇది డిజిటల్‌ ట్రాఫిక్‌ మార్గంలో ముఖ్యమైన అడుగు” - కేంద్ర రవాణా శాఖ ప్రకటన

యూపీఐతో చెల్లిస్తే సౌకర్యం ఎక్కువఫాస్టాగ్‌ సిస్టమ్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా 98% వాహనాల్లో ఉంది. చాలా కొంతమంది మాత్రమే టెక్నికల్‌ కారణాలతో లేదా అరుదుగా హైవే ప్రయాణం చేసే కారణంతో క్యాష్‌ వాడుతున్నారు. ఇప్పుడు వారికి UPI సిస్టమ్‌ రూపంలో సులభమైన ప్రత్యామ్నాయం దొరికింది. యూపీఐ ద్వారా టోల్‌ చెల్లించడం వేగంగా పూర్తవుతుంది, క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పుతుంది.

ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ కూడా అందుబాటులోగత నెలలో, కేంద్ర ప్రభుత్వం, ఫాస్టాగ్‌ యూజర్ల కోసం ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్రైవేటు కార్లు, జీపులు, వాన్లు వంటి వాహనాలకు ఇది వర్తిస్తుంది. వార్షిక టోల్‌ పాస్‌ ధర ₹3,000 మాత్రమే. ఏడాది కాలం లేదా 200 టోల్‌ ప్లాజాల క్రాసింగ్‌లకు ఇది చెల్లుతుంది. దేశవ్యాప్తంగా సుమారు 1,150 ప్లాజాలకు ఈ పాస్‌ వర్తిస్తుంది. ఈ పాస్‌ను Rajmarg Yatra యాప్‌ లేదా NHAI వెబ్‌సైట్‌ ద్వారా రెండు గంటల్లో యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

క్యాష్‌ వాడకానికి గుడ్‌బై చెప్పేద్దాంప్రస్తుతం దేశంలో సుమారు 45,000 కి.మీ. నేషనల్‌ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల్లో 1,200కి పైగా టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. 2021 ఫిబ్రవరి నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేశారు. ఇప్పుడు, క్యాష్‌ వాడేవారికి 100% జరిమానా విధించబోతున్నారు. ఇక నుంచి హైవేపై ప్రయాణించేటప్పుడు “ఫాస్టాగ్‌ లేదు, క్యాష్‌ కట్టేస్తాం” అనడం మీకే పెద్ద ఖర్చుగా మారుతుంది. UPI లేదా Fastag వాడితేనే డబ్బు, సమయం రెండూ సేవ్‌ అవుతాయి.

గుర్తుంచుకోండి, ఫాస్టాగ్‌ లేని వాహనాలకు నవంబర్‌ 15 నుంచి ముందు రెండే ఆప్షన్లు: క్యాష్‌తో డబుల్‌ ఫీజు కట్టాలా?, యూపీఐతో డబ్బు స్మార్ట్‌గా చెల్లించాలా?. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిని సిగ్నల్‌ మాత్రం ఇక్కడ క్లియర్‌గా ఉంది - డిజిటల్‌ పేమెంట్స్‌ మాత్రమే స్మార్ట్‌ ఛాయిస్‌!.