రేంజ్ రోవర్ 71వ వార్షికోత్సవం సందర్భంగా ఉచితంగా 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారును అందిస్తామంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు హల్ చల్ చేస్తుంది. ఆ పోస్టు కింద హ్యాపీ బర్త్‌డే అని కామెంట్ చేసి... ఆ పోస్ట్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే రేంజ్‌రోవర్‌ను గెలుచుకోవచ్చని ఆ పోస్టులో పేర్కొన్నారు. జులై 3వ తేదీన సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని అందులో తెలిపారు.
కానీ అది ఒక ఫేక్ లింక్. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే ఒక సెక్యూర్డ్ కాని వెబ్ సైట్ ఓపెన్ అయి అందులో మీ వ్యక్తిగత వివరాలను అడుగుతుంది. అక్కడ మీరు ఆ వివరాలను ఇస్తే అవి మోసగాళ్ల దగ్గరికి వెళ్తాయి. అంతేకాకుండా మీ డివైస్ హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంది.
కేవలం ఈ రేంజ్ రోవర్ కారుకు సంబంధించిన లింకు మాత్రమే కాకుండా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇటువంటి ప్రమాదకరమైన లింకులు చాలా ఉన్నాయి. వాటిపై క్లిక్ చేస్తే మీ డేటా హ్యాకర్ల చేతికి వెళ్తుంది. డేటా దొంగిలించడం ఇంటర్నెట్‌లో సాధారణంగా జరిగే నేరంగా మారింది. కాబట్టి మీ డేటా సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది.