గత కొన్నేళ్లుగా భారతదేశంలో సూపర్ బైక్‌లపై ఆసక్తి పెరుగుతోంది. గతంలో పెద్ద, ఖరీదైన బైక్‌లు కొందరికి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు యంగ్ రైడర్లు, బైక్ లవర్స్ సూపర్ బైక్స్‌తో రోడ్లపై దూసుకెళ్లాలని ఆశ పడుతున్నారు. దాంతో వీటి క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో Ducati భారతదేశంలో తమ అత్యంత ప్రత్యేకమైన, శక్తివంతమైన సూపర్ బైక్ Panigale V4 R ను విడుదల చేసింది. దీని ధర, పనితీరు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Continues below advertisement

డుకాటి Panigale V4 R ధర 

భారతదేశంలో Ducati Panigale V4 R ఎక్స్-షోరూమ్ ధర రూ. 84.99 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న Ducati డీలర్‌షిప్‌లలో బుకింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. దీని మొదటి డెలివరీ జనవరి 1, 2026న Ducati చెన్నై డీలర్‌షిప్ ద్వారా పూర్తయింది. ఇది తమ అత్యంత ప్రత్యేకమైన, పరిమిత ఉత్పత్తి స్పోర్ట్స్ బైక్ అని డుకాటి కంపెనీ పేర్కొంది.

రేసింగ్ మోడల్

2001లో 996R మోడల్‌తో ప్రారంభమైన Ducati సంప్రదాయాన్ని డుకాటి Panigale V4 R కొనసాగిస్తోంది. ఈ బైక్‌లు వరల్డ్ సూపర్ బైక్ ఛాంపియన్‌షిప్ కోసం తయారు అవుతున్నాయి. ప్రతి బైక్ ఒక నంబర్ సిరీస్‌లో వస్తుంది. బైక్ స్టీరింగ్ ప్లేట్‌పై దాని మోడల్ పేరు, సీరియల్ నంబర్ రాసి ఉంటుంది. ఇది మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

Continues below advertisement

డుకాటి ఇంజిన్, అద్భుతమైన పనితీరు

ఈ సూపర్ బైక్‌లో 998cc Desmosedici Stradale R ఇంజిన్ అమర్చారు. ఇది 15,500 rpm వద్ద 218 హార్స్‌పవర్ శక్తిని అందిస్తుంది. 6వ గేర్‌లో ఈ ఇంజిన్ 16,500 rpm వరకు వర్క్ చేస్తుంది. ఇందులో MotoGP నుండి తీసుకున్న టెక్నాలజీని ఉపయోగించారు. రేసింగ్ ఎగ్జాస్ట్ అమర్చినట్లయితే, పవర్ 235 hp వరకు చేరుతుంది. ప్రత్యేక ఆయిల్‌తో ఇది 239 hp వరకు కూడా వెళ్ళగలదు. రేసింగ్ సెటప్‌లో ఈ బైక్ గంటకు 330 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది.

ఫీచర్లు, డిజైన్

డుకాటి Panigale V4 R అనేది Corner Sidepods తో వచ్చిన మొదటి ప్రొడక్షన్ బైక్. ఇది వేగవంతమైన మలుపులలో రైడర్లకు మెరుగైన గ్రిప్‌ను సైతం అందిస్తుంది. కొత్త వింగ్స్ అధిక వేగంతో ఎక్కువ డౌన్‌ఫోర్స్‌ను కలిగిస్తాయి. దీనివల్ల బైక్ మరింత స్థిరంగా ఉంటుంది. ఇంధనం లేకుండా దీని బరువు 186.5 కిలోలు కాగా, ఇది Ducati Red రంగులో వస్తుంది. ఇందులో 17 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, తేలికపాటి లిథియం బ్యాటరీ అమర్చారు.

డుకాటి (Ducati) అనేది కేవలం ఒక మోటార్‌సైకిల్ బ్రాండ్ మాత్రమే కాదు. ఆ బైక్స్ వేగం, లగ్జరీ, అత్యాధునిక సాంకేతికతకు మారుపేరుగా ఉంది. ఇటలీలోని బోలోగ్నాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా బైక్స్ డ్రీమ్ బ్రాండ్‌గా ఎదిగింది. 1926లో స్థాపించిన డుకాటి, ప్రారంభంలో రేడియో విడిభాగాలను తయారు చేసేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మోటార్‌సైకిల్ రంగంలోకి ప్రవేశించింది. ఇటాలియన్ డిజైన్, సిగ్నేచర్ రెడ్ (ఎరుపు రంగు) తో ప్రపంచాన్ని ఆకర్షించింది. Panigale Series ప్యూర్ స్పోర్ట్స్ బైక్‌లు, రేసింగ్ ట్రాక్‌లపై వీటికి సాటిలేదు.