E20 Petrol: ఈ ఏప్రిల్‌ నుంచి వచ్చిన చాలా రంగాల్లో కీలకమైన మార్పులు వచ్చాయి. అలాంటి మార్పులు పెట్రోలియం రంగంలో కూడా వచ్చాయి. దీని ప్రకారం అన్ని పెట్రోల్‌ పంపులు 20 శాతం ఇథనాల్‌తో కూడిన E20 పెట్రోల్‌ను విక్రయించాల్సి ఉంటుంది. దీని వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవాల్సి ఉండటమే కాకుండా పర్యావరణాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇది రైతులకు కూడా మేలు చేస్తుంది. ఈ లక్ష్యాలతో కచ్చితంగా E20 పెట్రోల్ కలపడాన్ని తప్పనిసరి చేసింది. 

Continues below advertisement

పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  అనుకున్నంత సరఫరా కూడా జరగడం లేదు. దీంతో పెట్రోల్ ప్రభావం పడుతోంది. దీనికి తోడు పెట్రోల్ వాడకంతో పర్యావరణానికి కలుగుతున్న ముప్పు గ్రహించిన ప్రభుత్వం ఈ ఏప్రిల్ నుంచి ఈ కీలకమైన మార్పు తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ప్రీమియం పెట్రోల్‌లో కూడా ఈ E20 పెట్రోల్ మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ వల్ల పాత వాహనంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. 

ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ ఉంటుందా?

ప్రస్తుత ప్రభుత్వ రూల్స్ ప్రకారం దేశవ్యాప్తంగా లభించే సాధారణ, ప్రీమియం పెట్రోల్‌ రెండింటిలోనూ ఇథనాల్ కలపడం తప్పనిసరి చేసింది. దీని అర్థం ప్రీమియం పెట్రోల్‌ కూడా పూర్తి ఇథనాల్‌రహితం కాదు. అయితే ఈ రెండింటి మధ్య అసలైన తేడా ఏంటంటే ఆక్టేన్ రేటింగ్‌ మాత్రమే. 

Continues below advertisement

ప్రీమియం పెట్రోల్‌ ఎందుకు  ప్రత్యేకమైంది?

ప్రీమియం పెట్రోల్‌కు సాధారణంగా 95 RON లేదా అంత కంటే ఎక్కువ అక్టేవ్‌ సంఖ్య ఉంటుంది. అధిక ఆక్టేవ్‌ స్థాయిలు ఇంధనం బాగా మండేలా చేసి ఇంజిన్ నాకింగ్‌, పింగింగ్‌ను తగ్గిస్తాయి. ఇంజిన్ భాగాలను క్లీన్‌గా ఉంచడానికి, కార్బన్‌ పేరుకుపోకుండా నిరోధించడానికి స్పెషల్ అడెటివ్స్‌, డిటర్జెంట్లు కలుపుతారు. అందుకే మెరుగైన పని తీరు, సున్నితమైన డ్రైవింగ్ అవసరమ్యే హై- కంప్రెషన్ ఇంజిన్లు ఉన్న వాహనాలకు ప్రీమియం పెట్రోల్‌ మరింత అనుకూలంగా పరిగణిస్తారు. మరోవైపు E20 పెట్రోల్‌లో 80 శాతం పెట్రోల్‌, 20 శాతం ఇథనాల్‌ ఉంటాయి. ఇథనాల్‌ అనేది చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి లభించే ఒకరకమైన ఇంధనం. దీన్ని మండించినప్పుడు తక్కువ కాలుష్యం వస్తుంది. పర్యావరణానికి మంచిదిగా చెబుతారు. 

పాత బండిపై ఎఫెక్ట్ ఉంటుందా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2023కి ముందు తయారైన వాహనాల్లో E20 పెట్రోల్‌ ప్రభావాలు భిన్నంగా ఉండొచ్చు. అటువంటి వాహనాల్లో మైలేజ్‌ 3 నుంచి 7 శాతం వరకు తగ్గవచ్చు. అంతేకాకుండా, ఇథనాల్‌ రసాయన స్వభావం పాత రబ్బరు పైపులు, సీల్స్‌, ప్లాస్టిక్‌ భాగాలను దెబ్బతీస్తుంది. ఇథనాల్‌ గాలి నుంచి తేమను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల ఇంధన ట్యాంక్‌లో నీరు చేరడం, తుప్పు పట్టే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఇంజిన్‌ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే పెట్రోల్ కొట్టించే సమయంలో జాగ్రత్తగా ఉండటం చాాల అవసరం.