Ayyannapatrudu controversy: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన మరిడమ్మ జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ శాసనసభ స్పీకర్ హోదాలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఒక సామాన్య కళాకారుడిపై చేయి చేసుకోవడం వివాదానికి దారితీసింది.  

Continues below advertisement

వివాదానికి కారణం -  డప్పు  మోత 

నర్సీపట్నంలో అత్యంత వైభవంగా జరిగే  మరిడమ్మ జాతర లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని వస్తున్న సమయంలో, అక్కడ డప్పు కొడుతున్న ఎత్తుల భాస్కరరావు  అనే కళాకారుడు అత్యుత్సాహంతో అయ్యన్నపాత్రుడు చెవికి అతి సమీపంలో చాలా గట్టిగా డప్పు వాయించాడు. ఆ భారీ శబ్దానికి ఒక్కసారిగా విసుగు చెందిన స్పీకర్, తన అసహనాన్ని ఆపుకోలేక భాస్కరరావు చెంపపై కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా చేయడమేంటని నెటిజన్లు విమర్శలు గుప్పించారు.  

Continues below advertisement

 అక్కడ ఏం జరిగింది? 

సాధారణంగా జాతరలో డప్పు కళాకారులు ప్రముఖులు వచ్చినప్పుడు ఉత్సాహంగా వాయిస్తుంటారు. అయితే, భాస్కరరావు డప్పును అయ్యన్నపాత్రుడు మొహానికి దాదాపు తాకేలా తీసుకెళ్లి వాయించడంతో, ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ క్షణంలో వచ్చిన కోపంతో ఆయన ఆ కళాకారుడిని కొట్టారు. ఆ తర్వాత స్పీకర్ గన్‌మెన్లు, అనుచరులు భాస్కరరావును పక్కకు నెట్టివేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పండగ వాతావరణంలో జరిగిన ఈ అనుహ్య పరిణామం అందరినీ ఆశ్చర్యపరిచింది.

భాస్కరరావు స్పందన 

ఈ ఘటనపై బాధితుడు భాస్కరరావు స్పందిస్తూ.. నేను అమ్మవారి జాతరలో ఉత్సాహంగా డప్పు కొట్టాను. అయ్యన్నపాత్రుడు గారు మా ఊరి పెద్దాయన. ఆయనకు మా మీద కోపం ఏమీ లేదు, ఆ శబ్దానికి ఆయన ఇబ్బంది పడి అలా చేసి ఉండవచ్చు. దీన్ని నేను పెద్ద వివాదంగా చూడటం లేదు అని  చెబుతున్నారు.  చేశారు. అయినప్పటికీ, ఒక కళాకారుడిపై చేయి చేసుకోవడాన్ని దళిత, ళాకారుల సంఘాలు ఖండిస్తున్నాయి. 

 రాజకీయ దుమారం 

ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవికి ఒక గౌరవం ఉంటుందని, ఇలా బహిరంగంగా సామాన్యులపై దాడి చేయడం తగదని విమర్శిస్తున్నాయి.