Rolls Royce Phantom Tax In India: మోస్ట్ పవర్‌ఫుల్ & హై లగ్జరీ కార్ల కంపెనీల లిస్ట్‌లో 'రోల్స్ రాయిస్' పేరు కచ్చితంగా ఉంటుంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన 'ఫాంటమ్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కారుకు 6.7-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు యాడ్ అయి ఉంటుంది. ఈ ఇంజిన్ 563 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది, ఆక్సిలేటర్ తొక్కితే తుపాకీ తూటా వేగంతో దూసుకెళ్తుంది.
రోల్స్ రాయిస్ బ్రాండ్‌లో నాలుగు మోడళ్ల కార్లు భారతదేశంలోనూ అమ్ముడవుతున్నాయి. ఈ కార్లలో, భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్నది రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఆటోమేకర్ వెర్షన్. ఈ లగ్జరీ కారు కొనాలంటే సంపన్నులు కూడా ఒకటికి, రెండుసార్లు ఆలోచిస్తారు. ఈ కారు మీద భారత ప్రభుత్వం భారీగా కోట్ల రూపాయల పన్ను విధిస్తోంది. ఈ కారుపై విధించిన అన్ని పన్నులను తొలగిస్తే, ఈ కారు ధరలో చాలా పెద్ద తేడా కనిపిస్తుంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్‌పై ఎంత పన్ను విధిస్తున్నారు? హైదరాబాద్‌లో, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఎక్స్-షోరూమ్ ధర (Rolls Royce Phantom ex-showroom price) రూ. 9.50 కోట్లు. ఈ కారుపై విధించే పన్నుల్లో TCS, రోడ్ టాక్స్, రోడ్ సేఫ్టీ సెస్, ఇన్సూరెన్స్ & ఇతర ఛార్జీలను కలిపి కోట్లాది రూపాయలు అదనంగా (పన్నులు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నులన్నీ విధించిన తర్వాత, హైదరాబాద్‌లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఆన్-రోడ్ ధర (Rolls Royce Phantom on-road price) దాదాపు రూ. 11.21 కోట్లకు చేరుతుంది. పన్నులే లేకపోతే రోల్స్ రాయిస్ ఫాంటమ్ రేటు ఏకంగా 1 కోటి 71 లక్షల రూపాయలు తగ్గుతుంది, రూ. 9.50 కోట్లకు కొనవచ్చు.
ఏ పన్ను కోసం ఎంత చెల్లించాలి?రోల్స్ రాయిస్ ఫాంటమ్ కొనేవాళ్లు TCS కోసమే రూ. 9.50 లక్షలు చెల్లించాలి. ఈ లగ్జరీ కారుపై ప్రభుత్వం ఏకంగా 95 లక్షల రూపాయల రోడ్ టాక్స్ విధిస్తుంది. 1.71 లక్షల రూపాయల రోడ్ సేఫ్టీ సెస్ విధిస్తారు. ఈ కారు బీమా కోసమే దాదాపు 46.95 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. రిజిస్ట్రేషన్ & ఇతర ఖర్చులన్నీ కలిపి మొత్తం 1.24 కోట్ల రూపాయలు కట్టాలి.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రీమియం ఫీచర్లురోల్స్ రాయిస్ ఫాంటమ్‌లోని 6.7-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 563 bhp పవర్‌ను & 900 Nm టార్క్‌ను జనరేట్ చేయగలదు. ఈ కారు గరిష్టంగా 250 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. అంటే, ఒక గంటలో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్లిపోవచ్చు. ఈ సెడాన్‌లో చాలా విశాలమైన 460 లీటర్ల బూట్ స్పేస్ ఉంది, ఇంట్లో లివింగ్ రూమ్‌లో హ్యాపీగా కూర్చున్న ఫీల్ కలుగుతుంది. ఈ కారు పెట్రోల్ ట్యాంక్‌లో ఒకేసారి 100 లీటర్ల పెట్రోల్ నింపవచ్చు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ సేఫ్టీ ఫీచర్ల (Rolls-Royce Phantom Safety Features) విషయానికి వస్తే, ఈ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో పాటు 9 ఎయిర్‌బ్యాగ్‌లు, మరెన్నో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు ఉన్నాయి.