Discount on Maruti vehicles | కస్టమర్‌లకు డిసెంబర్ 2025 చాలా ప్రయోజనకరంగా మారనుంది. టాటా మోటార్స్ (Tata Motors), మారుతి సుజుకి తమ కార్లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఈ ఆఫర్‌లలో నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనం, లాయల్టీ బోనస్ ఉన్నాయి. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా, అయితే ఈ ఆఫర్లు మీకు పెద్ద మొత్తంలో ఆదా చేసే అవకాశాన్ని అందిస్తాయి. ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. కొన్ని కార్లపై గరిష్టంగా లక్షకు పైగా ఆదా చేసే అవకాశం లభించింది.
టాటా హారియర్ (Tata Harrier), టాటా సఫారి
టాటా హారియర్, సఫారి వాహనాల కొనుగోలుపై మీకు భారీ తగ్గింపు లభిస్తుంది. వాటి 2025 హై-స్పెక్ వేరియంట్‌లపై ఏకంగా రూ.75,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే పాత మోడల్‌లపై ఈ తగ్గింపు ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది. టాటా హారియర్ ధర రూ.14 లక్షల నుండి రూ.25.24 లక్షల వరకు ఉంది. టాటా సఫారి ధర రూ.14.66 లక్షల నుండి టాప్ మోడల్ రూ.25.96 లక్షల వరకు ఉంది.
టాటా ఆల్ట్రోజ్
టాటా ఆల్ట్రోజ్ కొత్త మోడల్‌పై కస్టమర్‌లకు రూ.25,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో, పాత ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై ఏకంగా రూ.85,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రూ.6.30 లక్షల నుండి రూ.10.51 లక్షల ధరలో ఉంటుంది.
టాటా పంచ్ (Tata Punch)
టాటా పంచ్ అన్ని పెట్రోల్ వేరియంట్, CNG వేరియంట్‌లపై రూ.40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. పాత మోడళ్లపై ఏకంగా రూ.75,000 వరకు తగ్గింపు లభిస్తుంది. టాటా పంచ్ ధర రూ.5.50 లక్షలకు ప్రారంభం కాగా, టాప్ ఎండ్ రూ.9.24 లక్షల వరకు ఉంది.
టాటా టియాగో (Tata Tiago), టాటా టిగోర్ (Tata Tigor)
టాటా టియాగో, టాటా టిగోర్‌పై కూడా మంచిగా ఆదా చేయవచ్చు. ఈ మోడల్స్ 2024 మోడల్స్‌పై రూ.55,000 వరకు తగ్గింపు లభిస్తుంది. కొత్త 2025 మోడల్స్‌పై రూ.35,000 వరకు ఆఫర్‌లు ఉన్నాయి. టాటా టియాగో ధర రూ.4.57 లక్షల నుండి రూ.7.82 లక్షల వరకు ఉన్నాయి. టాటా టిగోర్ ధర రూ.5.49 లక్షలకు ప్రారంభం నుండి రూ.8.74 లక్షల వరకు ఉంది.
మారుతి ఇన్విక్టో (Maruti Invicto)
మారుతి ఇన్విక్టోపై రూ.2.15 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో రూ.1 లక్ష క్యాష్ డిస్కౌంట్, రూ.1.15 లక్షల వరకు స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ ప్రీమియం MPV రూ.24.97 లక్షల నుంచి 28.61 లక్షల రూపాయల వరకు లభిస్తుంది.
మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx)
మారుతి ఫ్రాంక్స్ టర్బో వేరియంట్‌పై రూ.88,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో రూ.43,000 విలువైన వెలాసిటీ యాక్సెసరీ ప్యాక్ ఉంది. ఫ్రాంక్స్ పెట్రోల్ మోడల్‌పై రూ.35,000, CNG వేరియంట్‌పై రూ.30,000 వరకు తగ్గింపు ఇచ్చారు. మారుతి ఫ్రాంక్స్ కారు ధర రూ.6.85 లక్షల నుండి రూ.11.98 లక్షల వరకు ఉంది.