Discount On SUVs In June 2025: ఈ నెలలో (జూన్ 2025) SUV కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌. జూన్‌లో, మారుతి సుజుకీ, జీప్, సిట్రోయెన్, నిస్సాన్, వోక్స్‌వ్యాగన్‌ & హోండా వంటి పెద్ద కార్‌ కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ ఆఫర్లు పరిమిత కాలానికి మాత్రమే & ముఖ్యంగా 2024 మోడల్ స్టాక్‌ను క్లియర్ చేసే లక్ష్యంతో అందిస్తున్నాయి.

మారుతి సుజుకి జిమ్నీ టాప్-ఎండ్ ఆల్ఫా వేరియంట్‌పై లక్ష రూపాయల తగ్గింపు లభిస్తోంది. దీని ధర రూ. 13.71 లక్షల నుంచి రూ. 14.80 లక్షల మధ్య ఉంటుంది. ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి ఇది విన్‌-విన్‌ డీల్‌ అవుతుంది.

టాప్ SUVలపై ఎంత తగ్గింపు లభిస్తుంది?

సిట్రోయెన్సిట్రోయెన్ ఇండియా, భారత్‌లో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది. C5 ఎయిర్‌క్రాస్‌పై రూ. 1.16 లక్షల వరకు, C3 ఎయిర్‌క్రాస్‌పై రూ. 2.55 లక్షల వరకు & C3 బసాల్ట్‌పై రూ. 2.8 లక్షల వరకు తగ్గించింది. ఈ SUVలు ప్రీమియం డిజైన్ & కంఫర్ట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాయి.

జీప్MY2024 స్టాక్ క్లియరెన్స్ సేల్ కింద జీప్ కూడా అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. జీప్ కంపాస్‌పై రూ. 1.7 లక్షల స్టాండర్డ్ డిస్కౌంట్ & ప్రొఫెషనల్స్‌పై రూ. 1.1 లక్షల అదనపు ప్రయోజనం లభిస్తుంది. మెరిడియన్‌ మీద రూ. 2.3 లక్షల డిస్కౌంట్‌తో పాటు రూ. 1.3 లక్షల అదనపు ప్రయోజనం కూడా ఉంది. జీప్ గ్రాండ్ చెరోకీపై రూ. 3 లక్షల డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది.

హ్యుందాయ్ టక్సన్హ్యుందాయ్ టక్సన్‌ కొనేవాళ్లకు లక్ష రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. దీని ధర రూ. 29.27 లక్షల నుంచి రూ. 36.04 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో ప్రీమియం ఇంటీరియర్స్, ADAS ఫీచర్లు & శక్తిమంతమైన ఇంజిన్‌ ఉన్నాయి. హోండా ఎలివేట్ మాన్యువల్ వేరియంట్లపై రూ. 1.2 లక్షల వరకు డిస్కౌంట్‌ ఉంది. ఈ SUV సిటీ & హైవే డ్రైవింగ్‌కు అద్భుతమైన ఆప్షన్‌.

నిస్సాన్ మాగ్నైట్నిస్సాన్ మాగ్నైట్ (Turbo Techna+ MY2024) వేరియంట్‌పై రూ. 1.25 లక్షల వరకు రాయితీ అందుబాటులో ఉన్నాయి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అయినప్పటికీ ఫీచర్‌-ప్యాక్‌డ్‌ టర్బో SUV. 

ఈ కంపెనీలు MY2024 స్టాక్‌ను క్లియర్ చేయడం కోసం, వార్షికోత్సవ అమ్మకాల నేపథ్యంలో రాయితీ ఆఫర్లు ప్రకటించాయి. కొత్త ఆర్థిక త్రైమాసికం ప్రారంభానికి ముందు అమ్మకాలు పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కొన్ని మోడళ్లను ఫేస్‌లిఫ్ట్ చేయడం లేదా నిలిపివేయడం కూడా చూడవచ్చు.

కంపెనీలు ప్రకటించిన ఈ ఆఫర్లన్నీ పరిమిత సమయం వరకు మాత్రమే. వివిధ నగరాలు & డీలర్‌షిప్‌లలో ఆఫర్ల విషయంలో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు. ప్రొఫెషనల్ గ్రూపులకు అదనపు ప్రయోజనాలు లభించవచ్చు.