Buying Tata Tiago on Discount: భారత మార్కెట్లో టాటా మోటార్స్ కార్లకు చాలా డిమాండ్ ఉంది. గత కొంతకాలంగా, కాలానికి తగ్గట్లు అద్భుతమైన ఫీచర్లతో ఫోర్ వీలర్లు లాంచ్ చేస్తున్న టాటా కంపెనీ, క్రమంగా సేల్స్ పెంచుకుంటూ మారుతి షేర్ లాగేసుకుంటోంది. అమ్మకాలు పెంచుకునే పథకంలో భాగంగా, ఇప్పుడు, ఈ కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ కూడా ప్రకటించింది. టాటా పోర్ట్‌ఫోలియోలోని చవకైన కారు 'టాటా టియాగో' మీద, ఈ నెలలో (జూన్ 2025) గొప్ప తగ్గింపును అందిస్తోంది. సాధారణ ప్రజలు కూడా కొనగలిగే ధరలోనే బలమైన భద్రత & అద్భుతమైన మైలేజీని ఈ కారు అందించగలదు.
డిస్కౌంట్ ఆఫర్ వివరాలుఈ నెలలో (జూన్ 2025) టాటా టియాగో కొనుగోలుపై గరిష్టంగా రూ. 35,000 వరకు ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్ టియాగో MY24 మోడల్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ & కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి కలిసి ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే. నగరాన్ని, డీలర్‌షిప్‌ను బట్టి రాయితీ మారవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో టాటా టియాగో ధరటాటా టియాగో బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Tata Tiago ex-showroom price) రూ. 5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 8.45 లక్షల వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర (Tata Tiago on-road price) రూ. 6.04 లక్షల నుంచి ప్రారంభమై, టాప్-ఎండ్ వేరియంట్‌కు రూ. 10.10 లక్షల వరకు ఉంటుంది.
ఇంజిన్ ఆప్షన్లుటాటా టియాగో మొత్తం 12 వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది, మీకు ఇష్టమైన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఈ బండి పెట్రోల్ & CNG ఆప్షన్లలో లభిస్తుంది. టాటా టియాగో 1199 cc 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ 6,000 rpm వద్ద 86 PS పవర్‌ను & 3,300 rpm వద్ద 113 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. టియాగో CNG వెర్షన్‌లో, ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 75.5 PS పవర్‌ను & 3,500 rpm వద్ద 96.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 242 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. టాటా టియాగో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా స్పీడ్ బ్రేకర్లు & గుంతల రోడ్లలోనూ ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఈ టాటా కారు ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు బిగించారు, బ్రేకింగ్ సిస్టమ్ ఈజీగా ఉంటుంది.
టాటా టియాగో ఎంత మైలేజ్ ఇస్తుంది? ARAI (Automotive Research Association of India) సర్టిఫై చేసిన ప్రకారం, టాటా టియాగో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 20.09 km మైలేజీ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఈ టాటా కారు లీటర్‌కు 19 km మైలేజీ ఇవ్వగలదు. CNG మోడ్‌లో, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 26.49 km/kg & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 28.06 km/kg మైలేజీని ఇస్తుంది. ఈ మైలేజ్ ప్రకారం, మీరు పెట్రోల్ & CNG రెండు ట్యాంక్‌లను పూర్తిగా నింపితే సులభంగా 900 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.