డాట్సన్ కార్ల బ్రాండ్‌కు నిస్సాన్ గుడ్ బై చెప్పేసింది. టాటా నానో లాగానే వినియోగదారులను ఆకర్షించడంతో డాట్సన్ కూడా విఫలం అయింది. దీంతో ఈ బ్రాండ్‌ను డిస్‌కంటిన్యూ చేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరల్లో కార్లను లాంచ్ చేసి మాస్ మార్కెట్‌ను ఆకట్టుకోవాలనే ఆలోచనతో డాట్సన్‌ను నిస్సాన్ లాంచ్ చేసింది.


మారుతి ఆల్టోతో పోటీ పడి... మార్కెట్లో నిస్సాన్ వాటా పెంచడమే లక్ష్యంగా డాట్సన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే నానో లాగానే డాట్సన్ కూడా ఫెయిల్ అయింది. కేవలం తక్కువ ఖర్చులో అందించాలనే ఆలోచనే తప్ప అది వినియోగదారులకు నచ్చుతుందా లేదా అనే విషయంపై కంపెనీ దృష్టి పెట్టలేదు.


సక్సెస్ అవుతుందనుకున్న డాట్సన్ గో కూడా కూడా దారుణంగా విఫలం అయింది. కాస్ట్ కటింగ్, ఫీచర్లు తక్కువగా ఉండటం, ప్యాకేజింగ్ కూడా బాగోకపోవడంతో మారుతికి పోటీని ఇవ్వాలన్న నిస్సాన్ కలలు నెరవేరలేదు. డాట్సన్ గో మనదేశంలో 2014లో లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో కార్లు కొనుగోలు చేయాలనుకునేవారి కోసం దీన్ని ప్రత్యేకంగా లాంచ్ చేశారు.


అయితే ఇంటీరియర్ సరిగ్గా లేకపోవడం, క్వాలిటీ అంతంత మాత్రం కావడంతో ఇది విఫలం అయింది. ఆ తర్వాత మూడు వరుసలతో డాట్సన్ గో ప్లస్‌ను లాంచ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత రెడిగో పేరుతో చివరి ప్రయత్నం చేసినా అది కూడా ఫెయిల్ అయింది.


రెడిగో విషయంలో కూడా డాట్సన్ అదే తప్పులు చేసింది. ఈ కారులో కూడా క్వాలిటీ ఆశించినంతగా లేదు. ఇప్పుడు డాట్సన్ బ్రాండ్‌ను పూర్తిగా డిస్‌కంటిన్యూ చేశారు కాబట్టి దృష్టంతా నిస్సాన్ మీదనే పెట్టనున్నారు. ప్రస్తుతం డాట్సన్ కార్లను ఉపయోగిస్తున్న వారికి సర్వీస్ సపోర్ట్‌ను అందించనున్నారు.


స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఆసక్తికరంగా ప్రస్తుతం విజయవంతం అయిన మాగ్నైట్‌ను మొదట్లో డాట్సన్ కాన్సెప్ట్‌గా ప్రదర్శించారు. అయితే మాగ్నైట్ విజయవంతం కావడంతో దాన్ని ప్రీమియం విభాగంలో చేర్చారు.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?