Festive Season SUV Car Discounts Offers 2025: ఈ పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకుంటూ, ఆటోమొబైల్‌ కంపెనీలు తమ కస్టమర్లకు అద్భుతమైన డీల్స్‌ అందిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి కొత్త (తగ్గిన) GST రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత, కార్ల ధరలు గణనీయంగా దిగి వచ్చాయి. దీనికి అదనంగా, డీలర్‌షిప్‌లు కూడా దసరా & దీపావళి  నవరాత్రి ఆఫర్‌లను (Dasara Diwali Car Offers 2025) అందిస్తున్నాయి. కొత్త కారుపై రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.65 లక్షల మధ్య ఆదా అవుతోంది.

Continues below advertisement

Mahindra XUV 3XO Dieselమహీంద్రా సబ్-4 మీటర్ SUV అయిన XUV 3XO డీజిల్ వేరియంట్‌, కొత్త బయ్యర్లకు రూ. 2.65 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో... రూ. 1.56 లక్షల GST తగ్గింపు & రూ. 1.09 లక్షల వరకు పండుగ తగ్గింపు ఉన్నాయి. ఇది, కాంపాక్ట్ SUV విభాగంలోని కస్టమర్లకు బెస్ట్‌ డీల్‌ అవుతుంది.

Honda Amazeహోండా ప్రసిద్ధ కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కూడా, ఈ పండుగ సీజన్‌లో తనను వెదుక్కుంటూ వచ్చిన కస్టమర్లను నిరాశపరచడం లేదు, గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. దీని సెకండ్‌ & థర్డ్‌ జనరేషన్‌ మోడళ్లపై రూ. 2.52 లక్షల వరకు ఆదా అందుబాటులో ఉంది. కస్టమర్లకు రూ. 65,100 నుంచి రూ. 1.20 లక్షల వరకు GST తగ్గింపులు & రూ. 1.32 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ ఆఫర్ అమేజ్‌ను బడ్జెట్-ఫ్రెండ్లీ సెడాన్ విభాగంలో గొప్ప ఎంపికగా చేస్తుంది.

Continues below advertisement

Kia Sonet Dieselకియా సోనెట్ కాంపాక్ట్ డీజిల్ SUV విభాగంలో అత్యంత పాపులారిటీ ఉన్న కార్లలో ఒకటి. ఈ దసరాకు, దీని డీజిల్ వేరియంట్ ధర రూ. 2.04 లక్షల వరకు తగ్గింది. ఇందులో - రూ. 1.64 లక్షల GST తగ్గింపు & రూ. 40,000 వరకు పండుగ ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు, కియా సోనెట్ గతంలో కంటే మరింత అందుబాటులోకి వచ్చింది.

Maruti Suzuki S-Presso మీరు బడ్జెట్ సెగ్మెంట్లో మంచి కారు కోసం చూస్తున్నట్లయితే, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రస్తుతానికి ఉత్తమ ఎంపిక. కస్టమర్లు రూ. 1.90 లక్షల వరకు దీనిపై సేవ్‌ చేయవచ్చు. ఇందులో - రూ. 1.29 లక్షల GST తగ్గింపు & రూ. 61,000 వరకు పండుగ తగ్గింపు ఉంటుంది.

Tata Punch భారతదేశంలో అత్యంత ఎక్కువ ఆదరణ ఉన్న కాంపాక్ట్ SUVలలో ఒకటైన టాటా పంచ్ కూడా గొప్ప ఆఫర్‌ అందిస్తోంది. ఈ దసరా & దీపావళికి, ఈ కారు కొనేవాళ్లు రూ. 1.58 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో - రూ. 1.08 లక్షల GST తగ్గింపు & రూ. 50,000 వరకు పండుగ ప్రయోజనాలు ఉన్నాయి.

మీరు మీ డ్రీమ్‌ కార్‌ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. మహీంద్రా XUV 3XO, హోండా అమేజ్, కియా సోనెట్, మారుతి ఎస్-ప్రెస్సో & టాటా పంచ్‌లపై ఈ ఆఫర్‌లు మీకు లక్షల రూపాయలు ఆదా చేస్తాయి. GST తగ్గింపులు & పండుగ డిస్కౌంట్ల డబుల్ ప్రయోజనాన్ని పొందడం ద్వారా, మీరు మీ బడ్జెట్‌లోనే మీ కలల కారును ఇంటికి తీసుకువెళ్లవచ్చు.