Custom Painted Helmet By Eimor Customs, Hyderabad: హైదరాబాద్‌లోని Eimor Customs పేరు గురించి బైక్ ప్రేమికులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే, బైక్‌లను అద్భుతంగా కస్టమైజ్ చేస్తున్న ఈ టీమ్, ఇప్పుడు హెల్మెట్ డిజైన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. చేతితో పెయింట్ చేసిన ఈ కస్టమ్ హెల్మెట్‌లు ఇప్పుడు యువతలో కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి.
ఐడియా ఎలా మొదలైంది?కొన్నాళ్ల క్రితం, రైడర్ రిషాద్ మోడీ తన హెల్మెట్‌ను Eimor Customs టీమ్‌కు ఇచ్చారు. అప్పుడు ఆయనకు హెల్మెట్ డిజైనింగ్‌పై ఎలాంటి స్పష్టమైన ఆలోచన లేదు. కానీ, ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేసిన జాయ్ (Joy), రిషాద్ మోడీతో వాట్సాప్ గ్రూప్ ద్వారా చర్చలు జరిపారు. ఆయనకు ఇష్టమైన రంగులు, థీమ్, ఫీల్ అన్నింటినీ కలిపి ఒక ‘మెరైన్ లైఫ్’ థీమ్ హెల్మెట్ రూపుదిద్దారు. సముద్ర జీవుల నుంచి స్ఫూర్తి పొందిన ఈ హెల్మెట్‌లో ఆంగ్లర్ ఫిష్, మోరే ఈల్, హ్యామర్‌హెడ్ షార్క్ వంటి ఆర్ట్‌వర్క్‌లు ఉన్నాయి.
డిజైన్‌లో క్రియేటివిటీజాయ్ ప్రతీ స్టేజ్‌లో కొత్తగా ఆలోచించారు. సాధారణ లోగో ప్లేస్ చేయకుండా, హ్యామర్‌హెడ్ షార్క్ ఈ యునిక్ పెయింట్‌ను స్ప్రే పెయింట్ చేస్తున్నట్లు చూపించారు. అంతేకాదు, యజమాని పేరు, బ్లడ్ గ్రూప్‌ను డైవర్ ఆకారంలో చూపించడం కూడా సూపర్ ఇన్నోవేటివ్ ఐడియా. రంగుల ఎంపికలో కూడా జాయ్ ప్రత్యేక దృష్టి పెట్టి, వెర్మిలియన్ షేడ్ అనే స్పెషల్ రెడ్ టోన్‌ను ఎంచుకున్నారు.
పెయింటింగ్ ప్రాసెస్‌ఈ హెల్మెట్ పూర్తిగా చేతితో తయారైంది. ఐదు దశల్లో పెయింటింగ్ జరిగింది. మొదట బ్లాక్ బేస్ కోట్, తరువాత ఒక్కో డిజైన్ భాగాన్ని ఎయిర్ బ్రష్ లేదా ఫైన్ బ్రష్‌తో ఖచ్చితత్వంతో పూత వేశారు. ప్రతి కోణంలో ఉన్న స్పాయిలర్, వెంట్స్ వదిలి పెట్టకుండా, వాటి మధ్య గ్యాప్‌లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఫినిషింగ్ & క్వాలిటీతయారీ పూర్తయిన తర్వాత వచ్చిన ఫలితం నిజంగా అద్భుతంగా కనిపించింది. ఈ డిజైన్ హెల్మెట్ ఆకారానికి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. అయితే కొన్ని చోట్ల ఫినిషింగ్‌లో చిన్న లోపాలు కనిపించవచ్చు, అది పూర్తిగా చేతితో చేసినది కావడంతో అది సహజమే. Eimor ఆటోమోటివ్ గ్రేడ్ పెయింట్స్ వాడుతుంది, ఇవి FIA హెల్మెట్ పెయింటింగ్ గైడ్‌లైన్ ప్రకారం సేఫ్.
ఖర్చు & ఎక్స్‌క్లూజివిటీఇలాంటి హెల్మెట్ తయారీకి సుమారు ₹25,000–₹30,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది ఎక్కువగా అనిపించినా, పూర్తిగా మీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒకే ఒక్క డిజైన్ కావడం దీని ప్రత్యేకత. సాధారణ మార్కెట్‌లో దొరికే హెల్మెట్‌లతో పోలిస్తే ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
Eimor Customs కేవలం పెయింట్ కాదు - ఇది ఆర్ట్ & పర్సనాలిటీ కలయిక. మీ బైక్ ప్యాషన్‌ను హెల్మెట్‌లో చూపించాలనుకుంటే, ఈ టీమ్‌తో కాంటాక్ట్ అయితే సరిపోతుంది. మీకు నచ్చిన థీమ్, మీ కోసమే ఉన్న యునిక్ డిజైన్ - ఇదే Eimor స్టైల్. హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా యువ రైడర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ హెల్మెట్ డిజైన్‌లు, మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఇతరుల కళ్లను తిప్పుకోనివ్వవు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.