MG Comet EV Finance Latest News: ప్రస్తుత ఈవీ మార్కెట్లో అత్యంత చౌకగా లభ్యమయ్యే కార్లలో ఎంజీ కామెట్ ఈవీ ఒకటి. కేవలం ఏడు లక్షల పైబడి ధరతో అందరికీ అందుబాటులో ఉంది. నగరాలలో నడిపేందుకు పర్ఫెక్టుగా సూటయ్యే ఈ కారుని కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత సులభమైంది. ఈఎంఐ ద్వారా ఎలా కొనుగోలు చేయవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇండియాలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారైన MG Comet EV తాజాగా కొత్త అప్డేట్ తో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు ఈ కార్ మునుపటి కంటే మరింత కట్టుదిట్టమైన భద్రతతో , ఫీచర్లతో దీనిని రూపొందించారు. ₹7 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈ ఎలక్ట్రిక్ కార్ తక్కువ బడ్జెట్‌లో EV కొనాలని అనుకుంటున్న వారికి ఒక అద్భుతమైన ఎంపిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంజీ కంపెనీ ప్రీమియం అనుభూతిని కలిగించేలా ఈ కారును డిజైన్ చేసింది.
30వేల జీతం ఉంటే చాలు..మీ నెల జీతం ₹30,000 వరకు ఉంటే, మీరు సులభంగా EMI ద్వారా MG Comet EV కొనవచ్చు. ఈ కార్ ఆన్-రోడ్ ధర సుమారు ₹7.30 లక్షల నుంచి మొదలవుతుంది. ₹1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే ₹6.30 లక్షల రుణం తీసుకోవాలి, దీనికి 9.8% వడ్డీ రేటు 5 సంవత్సరాల రీపేమెంట్ కాలం ఉంటుంది. దీంతో, మీరు ప్రతి నెల రూ. 13,400 EMI చెల్లించాల్సి ఉంటుంది, 5 సంవత్సరాలలో మొత్తం ₹8 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. MG Comet EVని నగరాల్లో డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. దీని 17.3 kWh లిథియం-ఇయోన్ బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 230 కి.మీ. వరకు రన్ చేస్తుంది, మరియు AC ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా ఇందులో పొందుపరిచారు. భద్రతా ఫీచర్లు కూడా చాలా బాగున్నాయి, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ కెమెరా, పవర్-ఫోల్డింగ్ ORVMs, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ,ABS + EBD డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, ఇవి కార్‌ను మరింత కట్టుదిట్టమైని సెక్యూరిటీ ఉన్న వాహనంగా మలిచింది.
బ్యాటరీ వారంటీ..కంపెనీ 8 సంవత్సరాలు లేదా 1 లక్ష 20 వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని కూడా అందిస్తోంది. ఎంజీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ను కూడా జోడించింది. ఇందులో క్రెప్ మోడ్ కూడా ఉంది. అంటే, డ్రైవర్ తన కాలును బ్రేక్ నుండి తీసిన వెంటనే కారు కదలడం ప్రారంభిస్తుంది. ఇంతకు ముందు, కామెట్ ఈవీ కదలడానికి డ్రైవర్ యాక్సిలరేటర్ ను ట్యాప్ చేయాల్సి వచ్చేది. కామెట్ ఈవీ లో ప్రత్యేక ఇ-షీల్డ్ ఉంటుంది. ఇది 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీ + 3 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్ + 3 ఉచిత లేబర్ సర్వీసెస్ + 8 సంవత్సరాలు లేదా బ్యాటరీ ప్యాక్ పై 1.2 లక్షల కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. 2025 కామెట్ ఈవీ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ ఫాస్ట్ ఛార్జ్, ఎక్స్క్లూజివ్, ఎక్స్క్లూజివ్ ఫాస్ట్ ఛార్జ్. బ్లాక్స్ టోమ్ ఎడిషన్ కూడా ఉంది.