Discount Offer On Toyota Hyryder: భారతీయ రోడ్లపై మిడ్-సైజ్ SUVల గాలి వీస్తోందిప్పుడు. ప్రీమియం ఫీచర్లతో మధ్య తరగతి మనుషులకు అందుబాటు ధరల్లో ఉండడం వల్ల వీటికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ & మారుతి విటారా వంటివి మిడ్-సైజ్ SUVల సెగ్మెంట్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటితో టయోటా హైరైడర్ బలంగా పోటీ పడుతోంది. ఈ కార్‌లలో ఉన్న ఫీచర్లన్నీ దాదాపుగా టయోటా తన హైరైడర్‌లోనూ ఉన్నాయి.  టయోటా కంపెనీ, ఈ నెలలో (మే 2025), హైరైడర్‌ SUV మీద రూ. 68,000 వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. సాధారణంగా, ఈ అన్ని SUVల్లో గ్రాండ్ విటారా చవక. గ్రాండ్ విటారా ఎంట్రీ-లెవల్ ధర దాదాపు రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హైరైడర్‌ రూ. 11.34 లక్షల నుంచి స్టార్ట్‌ అవుతుంది. టయోటా ప్రకటించిన రూ. 68,000 డిస్కౌంట్‌ను పూర్తిగా యూజ్‌ చేసుకుంటే.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి విటారా కంటే తక్కువ రేటుకు టయోటా హైరైడర్‌ కొనవచ్చు. ఈ తగ్గింపు పరిమిత సమయం వరకు & పరిమిత స్టాక్‌కు మాత్రమే వర్తిస్తుంది. 

టయోటా హైరైడర్ ఫీచర్లు టయోటా హైరైడర్ ప్రీమియం & ఫీచర్-రిచ్ మిడ్-సైజ్ SUVగా డిజైన్‌ అయింది. క్యాబిన్‌లో 9-అంగుళాల పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో పని చేస్తుంది. కారుకు స్పష్టంగా దారి చూపించే ఫుల్‌ LED హెడ్‌ల్యాంప్‌లు, క్యాబిన్‌లో ఆకట్టుకునే యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్ & ప్రయాణీకుల భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి ఎంజాయ్‌ చేయవచ్చు. ఇంకా... టయోటా హైరైడర్ SUVలో ABS (యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌), EBD ‍‌(ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌) & ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) వంటి అత్యాధునిక భద్రతలను కూడా యాడ్‌ చేశారు. కారు లుక్స్‌తో పాటు డ్రైవ్‌ను మరింత స్టైలిష్‌గా మార్చడానికి 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ బిగించారు & టయోటా స్మార్ట్ ఐ-కనెక్ట్ సాఫ్ట్‌వేర్‌ అందించారు. ఇది యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగ్గా మారుస్తుంది. ఈ ప్రీమియం ఫీచర్లన్నీ కలిసి టయోటా హైరైడర్‌ను సురక్షితమైన, సౌకర్యవంతమైన & ఫీచర్‌-రిచ్‌ SUVగా నిలబెట్టాయి.

ఇంజిన్ & పనితీరు టయోటా హైరైడర్ 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది, ఇది 5500rpm వద్ద 86.63 bhp శక్తిని & 4200rpm వద్ద 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను యాడ్‌ చేశారు, ఇది మృదువైన & సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తుంది. టయోటా హైరైడర్‌లో CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే దొరుకుతుంది. కంపెనీ ప్రకారం, CNG వేరియంట్ క్లెయిమ్డ్‌డ్‌ మైలేజ్ 26.6 KM/KG వరకు ఉంటుంది. స్టైల్‌, పెర్ఫార్మెన్స్‌ చూపిస్తూనే ఫ్యూయల్‌ ఎఫిషియన్సీ ఇచ్చే కార్‌ చూస్తున్న కస్టమర్లకు టయోటా హైరైడర్ గొప్ప ఎంపిక కావచ్చు.

టయోటా హైరైడర్‌పై గరిష్టంగా రూ. 68,000 వరకు తగ్గింపును కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. మీ నగరం, ఎంచుకున్న వేరియంట్ & డీలర్‌షిప్‌పై ఆధారపడి ఈ డిస్కౌంట్‌ కొద్దిగా మారవచ్చు. కాబట్టి, ఈ SUV కొనే ముందే మీ సమీపంలోని టయోటా డీలర్‌షిప్‌నకు వెళ్లి డిస్కౌంట్లకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని పొందండి.