Citroen C3 Sport Edition Price And Features In Telugu: సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్ డ్రైవింగ్ చాలా ఫన్ ఇస్తుందన్నది యూజర్ల మాట. ఈ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది, నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్‌ను కూడా పొందవచ్చు. ఈ హ్యాచ్‌బ్యాక్ లుక్స్‌లో మరింత స్పైసీ యాడ్ చేయడానికి, ఈ కంపెనీ, కొత్త స్పోర్ట్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ స్పోర్ట్ వెర్షన్ చూపులకు చాలా బాగుంది. బంపర్, బోనెట్ & రూఫ్ మీద డెకాల్ వంటి మార్పులు ఉన్నాయి. ర్యాలీ కార్ తరహా వైబ్స్‌ను ఈ స్పోర్ట్ వెర్షన్ ఇస్తుంది, కొత్త గార్నెట్ రెడ్ కలర్‌లోనూ ఈ కారు లాంచ్ అయింది.
స్పోర్టీ ఇంటీరియర్ లుక్‌సిట్రోయెన్ C3 స్పోర్ట్ వెర్షన్ బయటి రూపంలోనే (ఎక్స్‌టీరయర్) కాదు, లోపలి భాగంలోనూ (ఇంటీరియర్) కంపెనీ ఆకట్టుకునే మార్పులు చేసింది. యాంబియంట్ లైటింగ్, స్పోర్ట్ సీట్ కవర్, స్పోర్టియర్ పెడల్స్ & డిఫరెంట్ కార్పెట్, సీట్‌బెల్ట్ కుషన్స్‌ను యాడ్ చేసింది. దీంతో, ఈ మోడల్ ఇంటీరియర్ చాలా మెరుగ్గా & అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. మీకు కావాలనుకుంటే, డాష్‌క్యామ్ & వైర్‌లెస్ ఛార్జర్‌ను ఆప్షనల్ ఇంటీయర్‌గా తీసుకోవచ్చు.
లిమిటెడ్ ఎడిషన్C3 స్పోర్ట్ వెర్షన్‌ను సిట్రోయెన్ లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకువచ్చింది, దీని రేటు రూ. 21,000 అదనంగా ఉంటుంది. మీకు టెక్ కిట్ కావాలనుకుంటే మరో రూ. 15,000 అదనంగా చెల్లించాలి.
పవర్‌ట్రెయిన్ & పవర్‌సిట్రోయెన్ C3 స్పోర్ట్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ బిగించారు, దీనిని 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌కు యాడ్ చేశారు. ఈ కారు యాక్సిలేటర్‌ను తొక్కిపడితే కేవలం 10 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది.
సిట్రోయెన్ C3 స్పోర్ట్ వెర్షన్ ధరసిట్రోయెన్ C3 స్పోర్ట్ టర్బో ఆటోమేటిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.36 లక్షలు. హైదరాబాద్, విజయవాడ లేదా మరేదైనా తెలుగు నగరంలో, పన్నులతో కలుపుకుని ఈ కారును దాదాపు రూ. 12.77 లక్షలకు కొనవచ్చు.
హైదరాబాద్‌లో C3 స్పోర్ట్ EMIఒకవేళ, మీరు ఈ కారును లోన్‌పై తీసుకోవాలనుకుంటే, రుణం ఇవ్వడానికి బ్యాంక్ రెడీగా ఉంటుంది. మీరు రూ. 3,44,267 డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన డబ్బును 10% వడ్డీ రేటుతో కార్ లోన్‌గా తీసుకుని, 5 సంవత్సరాల లోన్ కాల పరిమితి పెట్టుకుంటే, నెలకు 19,823 రూపాయలను EMIగా చెల్లిస్తే సరిపోతుంది.
డబ్బు పరంగా చూస్తే... ఇది యువతకు సరైన ఆటోమేటిక్ & మంచి పవర్‌తో కూడిన వేగవంతమైన హ్యాచ్‌బ్యాక్. అయితే ఈ ధర దగ్గర కొన్ని ఫీచర్లు మిస్ అయ్యాయి. అయినప్పటికీ, క్విక్ C3 టర్బో స్పోర్ట్ ఎడిషన్ కిట్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది & మంచి మొత్తంలో పవర్ ఇస్తుంది. దీంతో, యువత దీనిని హాట్ హ్యాచ్‌బ్యాక్‌గా పిలుస్తున్నారు. ప్రత్యర్థి కార్లతో పోలిస్తే, C3 టర్బో పనితీరు &ఆటోమేటిక్ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది.