Citroen Basalt X Launch Price Features: సిట్రోయెన్‌, తన కొత్త కూపే SUV Basalt X ని ఇండియాలో లాంచ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.95 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. కేవలం ₹11,000 టోకెన్ అమౌంట్‌తో August 22 నుంచే ప్రీ-బుకింగ్స్‌  ప్రారంభమయ్యాయి. ఈ కొత్త వెర్షన్‌లో ధర తగ్గింపుతో పాటు, ఎక్కువగా కస్టమర్లు కోరుకున్న ఫీచర్లు కూడా యాడ్‌ చేశారు.

ధరలు & వేరియంట్లు (ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ -  ఎక్స్‌-షోరూమ్‌)

2025 బసాల్ట్ X లైనప్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి, అవి - You, Plus, Max

You ట్రిమ్ - రూ. 7.95 లక్షలు

Plus ట్రిమ్ - రూ. 9.42 లక్షల నుంచి రూ. 12.07 లక్షల వరకు

Max ట్రిమ్ - రూ. 11.63 నుంచి రూ. 12.90 లక్షల వరకు

మాక్స్ వేరియంట్‌ ధర గత ఏడాది రూ. 13.87 లక్షల నుంచి తగ్గి ఇప్పుడు రూ. 12.90 లక్షలకు వచ్చింది. అంటే దాదాపు ఒక లక్ష రూపాయలు తక్కువ. డ్యూయల్‌టోన్‌ రూఫ్‌ కోసం రూ. 21,000, 360-డిగ్రీ కెమెరా కోసం రూ. 25,000 ఎక్స్‌ట్రా చెల్లించాలి.

ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్కారు బయటి భాగంలో పెద్దగా మార్పులు లేవు. అయితే ‘X’ బ్యాడ్జ్‌ టెయిల్‌గేట్‌ పై కొత్తగా కనిపిస్తుంది. ఇది బసాల్ట్‌కి కొత్త ఐడెంటిటీ ఇస్తుంది.

ఇంటీరియర్ & ఫీచర్లుఅసలు హైలైట్ ఇంటీరియర్‌లోనే ఉంది. కొత్త Max వేరియంట్‌లో బ్రాన్జ్ ట్రిమ్, టాన్-బ్లాక్ కలర్ అప్‌హోల్స్‌టరీ, లెదరేట్ ఫినిష్ డ్యాష్‌బోర్డ్ వాడారు. దీంతో, ఈ కారులోకి ఎక్కి కూర్చోగానే లగ్జరీ కారులో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది.

ఫీచర్లలో కనిపించే పెద్ద మార్పు Cara డిజిటల్ అసిస్టెంట్. ఇది రియల్‌ టైమ్ ఫ్లైట్ స్టేటస్, ట్రాఫిక్ రూట్ ఆప్టిమైజేషన్, వెహికల్ హెల్త్ అప్‌డేట్స్, SOS కాలింగ్, రిమైండర్స్ వంటి ఫీచర్లను ఇస్తుంది. అయితే, ఇది Max ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అదనంగా చేర్చిన ఫీచర్లు:

  • కూల్డ్ సీట్లు 
  • వైట్ ఆంబియంట్ లైటింగ్
  • క్రూయిజ్ కంట్రోల్
  • కీ లెస్ ఎంట్రీ
  • పుష్ బటన్ స్టార్ట్/స్టాప్
  • LED ఫాగ్ ల్యాంప్స్
  • ఆటో డిమ్మింగ్ IRVM

ఇంజిన్ & గేర్‌బాక్స్

ఇంజిన్‌లో మార్పులేమీ లేవు. 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ 110hp పవర్‌, 148Nm టార్క్ ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఎంట్రీ లెవల్ మోడల్స్‌లో 1.2 లీటర్‌ నార్మల్ పెట్రోల్ ఇంజిన్‌ 82hp పవర్‌తో, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వస్తుంది.

సారాంశం చెప్పాలంటే, Citroen Basalt X ఇప్పుడు మరింత అందుబాటు ధర SUV గా తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చింది. కొత్త ఫీచర్లతో పాటు, Max వేరియంట్‌ ధర తగ్గడంతో ఈ బ్రాండ్‌ కార్ల కాంపిటీషన్‌లో బలంగా నిలుస్తుంది.