Citroen Basalt X Review: సిట్రోయెన్‌ భారత మార్కెట్లో తన కొత్త కూపే-స్టైల్‌ క్రాస్‌ఓవర్‌ Citroen Basalt X ను అధికారికంగా లాంచ్‌ చేసింది. ఎంట్రీ-లెవల్‌ వేరియంట్‌ ధరను ₹7.95 లక్షలు ఎక్స్‌-షోరూమ్‌గా ప్రకటించింది. ఈ కారు లుక్‌, డ్రైవ్‌ క్వాలిటీ, శక్తిమంతమైన ఇంజిన్‌ & లగ్జరీ ఫీచర్లతో మార్కెట్‌కు కొత్త హంగులు తెచ్చిందనడంలో సందేహం లేదు. ప్రత్యేకంగా, SUV స్పూర్తితో రూపొందించిన కూపే డిజైన్‌ యువ కొనుగోలుదారులకు బాగానే నచ్చే అవకాశం ఉంది.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ధరలు ఎలా ఉంటాయి?

ఎక్స్‌-షోరూమ్‌ ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉన్నప్పటికీ, సాధారణంగా, ఆన్‌-రోడ్‌ ధరల్లో నగరాన్ని బట్టి కొంత తేడా ఉంటుంది. అంచనా ప్రకారం,

Continues below advertisement

హైదరాబాద్‌లో లో Basalt X ఆన్‌-రోడ్‌ ధర ₹9.55 లక్షల నుంచి ₹16.30 లక్షల వరకు ఉండొచ్చు.

విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర ₹9.54 లక్షల నుంచి ₹16.16 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

ఈ అంచనాలు బీమా, రిజిస్ట్రేషన్‌, ఎంపిక చేసుకునే వేరియంట్‌ ఆధారంగా మారవచ్చు.

ఇంజిన్‌ & పవర్‌ - డైలీ డ్రైవ్‌కి సరైన సెటప్‌

Citroen Basalt X లో 1.2 లీటర్ల శక్తిమంతమైన టర్బో-పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 110PS పవర్‌, 205Nm టార్క్‌ అందిస్తుంది. రోజువారీ సిటీ రైడ్స్‌లోనూ, వీకెండ్‌ ట్రిప్స్‌లోనూ ఈ ఇంజిన్‌ వెంటనే రెస్పాండ్‌ అయ్యే విధంగా ఉంటుంది.

ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు

6-స్పీడ్‌ మాన్యువల్‌ & 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆటోమేటిక్‌ వెర్షన్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ట్రాఫిక్‌ పరిస్థితుల్లో చాలా సౌకర్యంగా ఉంటుంది.

డిజైన్‌ - SUV స్టాన్స్‌తో కూపే స్టైల్‌

బసాల్ట్‌ ఎక్స్‌ డిజైన్‌ సంపూర్ణంగా యంగ్‌ జనరేషన్‌ను టార్గెట్‌ చేస్తుంది. ఫ్రంట్‌లో ఉండే షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌, అగ్రెసివ్‌ గ్రిల్‌, బాడీ మొత్తం మీద మస్కులర్‌ క్లాడింగ్‌... ఇవన్నీ SUV లుక్‌ ఇస్తాయి. అదే సమయంలో రియర్‌లో కూపే తరహా స్లోపింగ్‌ రూఫ్‌లైన్‌ కారుని మరింత స్పోర్టీగా చూపిస్తుంది. ఎత్తుగా ఉండే రైడ్‌ హైట్‌ & వెడల్పైన టైర్లు మన రోడ్ల పరిస్థితులకు బాగా సరిపోతాయి.

ఇంటీరియర్‌ - లగ్జరీ ఫీల్‌తో కంఫర్ట్‌ ప్రాధాన్యం

కారులోకి అడుగుపెట్టగానే ఒక ప్రీమియం ఫినిష్‌ కనిపిస్తుంది. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, సాఫ్ట్‌-టచ్‌ మెటీరియల్స్‌ ఉపయోగించడం వల్ల కేబిన్‌ కంఫర్ట్‌ స్థాయి మరింత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో, దీర్ఘ ప్రయాణాలు ఎక్కువగా చేసేవాళ్లకు ఫ్రంట్‌ & రియర్‌ సీట్ల కంఫర్ట్‌, ప్రత్యేకంగా లంబార్‌ సపోర్ట్‌ బాగున్నాయి. ఎయిర్‌ కండిషనింగ్‌ (AC) పనితీరు కూడా ఈ క్లాస్‌లో చాలా బాగుంది.

ఫీచర్లు - క్లాస్‌లో బెస్ట్‌ అనిపించే పాయింట్లు

Basalt X అందించే ముఖ్య ఫీచర్లు:

10.1 ఇంచుల టచ్‌ స్క్రీన్‌

వైర్‌లెస్‌ Android Auto & Apple CarPlay

6 ఎయిర్‌బ్యాగ్స్‌

రివర్స్‌ కెమెరా

ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్స్‌

క్రూయిజ్‌ కంట్రోల్‌

ఎలక్ట్రిక్‌ ORVMలు

ప్రీమియం క్లాస్‌లో కనిపించే ఈ ఫీచర్లను ఈ కారులో అందించడం పెద్ద ప్లస్‌ పాయింట్‌.

మైలేజ్‌ - డైలీ యూజ్‌కి సరిపోయే సంఖ్యలు

1.2 లీటర్ల టర్బో ఇంజిన్‌ మంచి పనితీరు ఇస్తూనే మైలేజ్‌ను కూడా మెయింటైన్‌ చేస్తుంది. కంపెనీ డేటా ప్రకారం... మాన్యువల్‌ వెర్షన్‌ లీటకుకు సుమారు 18km, ఆటోమేటిక్‌ వెర్షన్‌ లీటరుకు 17km వరకు మైలేజ్‌ ఇస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో లీటరుకు 15-16km మైలేజ్‌ వచ్చే అవకాశం ఉంది.

AP & TS బయ్యర్లలో ఎవరికి బాగా సరిపోతుంది?

సిటీ + హైవే మిక్స్‌ డ్రైవింగ్‌ చేసేవాళ్లకు

కొత్త లుక్‌ ఉన్న కూపే-స్టైల్‌ కారు కావాలని చూసేవాళ్లకు

లగ్జరీ ఫీల్‌ ఉన్న ఇంటీరియర్‌ కావాలని భావించేవాళ్లకు

SUV స్టాన్స్‌తోనే కాంపాక్ట్‌ సైజ్‌ కావాలనుకునేవాళ్లకు 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.