Cheapest Hybrid SUVs In India 2025: భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్ హైబ్రిడ్ టెక్నాలజీ వైపు స్టీరింగ్ తిప్పుతోంది. హైబ్రిడ్ విభాగం విస్తరిస్తున్న కొద్దీ, తెలివైన కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలు & సాంప్రదాయ పెట్రోల్ కార్ల మధ్య సమతుల్యతగా హైబ్రిడ్ SUVలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మన మార్కెట్‌లో, కేవలం ₹10.50 లక్షల నుంచి ప్రారంభమయ్యే అత్యంత అందుబాటు ధర హైబ్రిడ్ SUVలలో మూడుంటిని ఇక్కడ అన్వేషిద్దాం.
Maruti Victorisమారుతి విక్టోరిస్ దేశంలోనే అత్యంత బడ్జెట్ హైబ్రిడ్ SUV, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹10.49 లక్షలు. ఇది మారుతి బ్రెజ్జా & గ్రాండ్ విటారా మధ్య స్థాయిలో ఉంటుంది & ARENA డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతోంది. విక్టోరిస్, ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఈ ఇంజిన్ తక్కువ వేగంతో ఎలక్ట్రిక్ మోటారుతో పవర్ జనరేట్ చేస్తుంది, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది & అదే సమయంలో మైలేజీని కూడా పెంచుతుంది. మారుతి విక్టోరిస్ క్లెమ్‌డ్ మైలేజ్ 28.65 kmpl, ఇది భారతదేశంలో అత్యంత ఇంధన-సమర్థ హైబ్రిడ్ SUVగా నిలిచింది.
మారుతి విక్టోరిస్‌లో... LED హెడ్‌ల్యాంప్‌లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ & మోడ్రన్ లుక్స్‌తో ఉంటుంది. క్యాబిన్ లోపల, పెద్ద 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ & పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS-EBD, హిల్ హోల్డ్ అసిస్ట్ & ISOFIX మౌంట్స్ అమర్చారు. మీరు మొదటిసారి హైబ్రిడ్ SUVని కొనుగోలు చేస్తుంటే & మీ బడ్జెట్ ₹11 లక్షల వరకు ఉంటే, మారుతి విక్టోరిస్ ఒక మంచి ఎంపిక.
Toyota Urban Cruiser Hyryderటయోటా హైరైడర్, మన దేశంలో అత్యంత విశ్వసనీయ హైబ్రిడ్ SUV లలో ఒకటి. మారుతి గ్రాండ్ విటారా ఫ్లాట్‌ఫామ్‌పైనే దీనిని డిజైన్ చేశారు. టయోటా నాణ్యత & విశ్వసనీయ ఇంజినీరింగ్ దీనిని మరింత ప్రత్యేకత ఇచ్చాయి. ఈ కారు.. 1.5-లీటర్, 3-సిలిండర్ అట్కిన్సన్ పెట్రోల్ ఇంజిన్ & e-CVT గేర్‌బాక్స్‌తో జత చేసిన 79 bhp ఎలక్ట్రిక్ మోటారుతో శక్తినిస్తుంది. దీని మొత్తం పవర్ ఔట్‌పుట్ 116 bhp. ఈ SUV సుమారు 27.97 kmpl మైలేజ్ అందిస్తుంది.
ఇంటీరియర్‌లో... 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), 360-డిగ్రీ కెమెరా & యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. ADAS, ఆటో పార్కింగ్ గైడ్ సిస్టమ్, ESP & హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లను కూడా చూడవచ్చు. మీకు విలాసవంతమైన & అధునాతనమైన హైబ్రిడ్ SUV కావాలంటే, టయోటా హైరైడర్ ఓసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి.
Maruti Grand Vitaraమారుతి గ్రాండ్ విటారా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హైబ్రిడ్ SUV. ₹10.77 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో, ఈ SUV అద్భుతమైన ఫీచర్లు & ప్రీమియం ఫీల్ అందిస్తుంది. ఇది 1.5-లీటర్ అట్కిన్సన్ పెట్రోల్ ఇంజిన్ & 79 bhp ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది, e-CVT ట్రాన్స్‌మిషన్ దీనికి యాడ్ అయింది. మైలేజ్ 27.97 kmpl వరకు ఉంటుంది.
Grand Vitara SUV క్యాబిన్‌లో 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 8-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, PM 2.5 ఎయిర్ ప్యూరిఫైయర్ & క్లారియన్ సౌండ్ సిస్టమ్ వంటి లక్షణాలు ఉన్నాయి. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగులు, పూర్తి డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ & ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇచ్చారు. 2025 అప్‌డేషన్‌తో ఈ SUV E20 ఇంధనానికి అనుకూలంగా మారింది & కొత్త 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా జోడించారు. ఫీచర్-లోడెడ్, తక్కువ నిర్వహణ & టెక్-ఫ్రెండ్లీ SUV కోరుకుంటే, మారుతి గ్రాండ్ విటారా మీకు సరైన ఎంపిక.
మారుతి విక్టోరిస్ ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ కారు. టయోటా హైరైడర్ నమ్మదగినది & ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఫీచర్లు & టెక్నాలజీలో గ్రాండ్ విటారా ముందుంది.