ప్రపంచ వ్యాప్తంగా ఆటో మోటివ్ పరిశ్రమ చాలా పెద్దది. రకరకాల కార్లు, రకరకాల ప్రత్యేకతలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఆయా కార్ల బాడీ స్టైల్‌ ఆధారంలో పలు విబాగాలుగా విభజించారు. అలా మొత్తంగా ఆరు విభాగాలుగా కార్లను వేరు చేశారు. A, B, C, D, Eతోపాటు M సెగ్మెంట్ గా పేరు పెట్టారు. ఒక్కో సెగ్మెంట్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


A-సెగ్మెంట్ (మినీ హ్యాచ్బ్యాక్లు)


కొత్తగా ప్రారంభించిన మారుతి సుజుకి ఆల్టో K10, రెనాల్ట్ క్విడ్, డాట్సన్ గో మొదలైన కార్లు A-సెగ్మెంట్ క్రిందకు వస్తాయి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, చిన్న పరిమాణంలో ఉండే ఎంట్రీ-లెవల్ కార్లను సూచిస్తుంది. రిఫైన్డ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటాయి.  ఇవి ఎక్కువగా నగర అవసరాలకే పరిమితం అయి ఉంటాయి.   


B-సెగ్మెంట్ (హ్యాచ్బ్యాక్లు)


ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20,  హోండా జాజ్ వంటి హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి. A-సెగ్మెంట్ మినీ-హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఇంజన్ కొంచెం పెద్దది.  ఇది హైవే ట్రావెలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. B-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్‌లలోని హాల్‌మార్క్ ఫీచర్ ప్రకారం 4-మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు. నలుగురితో కూడిన మిడ్-సైజ్ ఫ్యామిలీకి తగినంత విశాలమైన క్యాబిన్ ఉండాలి.


C -సెగ్మెంట్ (సెడాన్స్)


C-విభాగాన్ని సాధారణంగా సెడాన్ విభాగంగా సూచిస్తారు.  C-సెగ్మెంట్ సెడాన్‌లు రెండు వర్గాలుగా విభజించబడ్డాయి. కాంపాక్ట్ సెడాన్‌లు,  చిన్న సెడాన్‌లు. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లు కాంపాక్ట్ సెడాన్‌ కిందకు వస్తాయి. ఇవి 4-మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండవు.  ఇక హోండా సిటీ, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మొదలైన మోడళ్లు చిన్న సెడాన్‌ ల కిందికి వస్తాయి. ఇవి కాంపాక్ట్ సెడాన్‌ల కంటే పొడవుగా ఉంటాయి. కానీ 5 మీటర్ల కంటే ఎక్కువ ఉండవు.


D-సెగ్మెంట్ (మధ్య-పరిమాణ లగ్జరీ సెడాన్లు)


 D-సెగ్మెంట్ లో  శక్తివంతమైన స్టాక్ ఇంజిన్‌ కలిగి ఉంటాయి. అల్ట్రా-లగ్జరీ బడ్జెట్‌లో కారు కావాలి అనుకునే వారు D-సెగ్మెంట్‌లోని కార్లు తీసుకోవచ్చు. మిడ్ రేంజ్ ధరతో ఈ కార్లు అందుబాటులో ఉంటాయి.  ఈ విభాగంలోని కార్లలో BMW 3 సిరీస్, స్కోడా ఆక్టావియా,  హ్యుందాయ్ ఎలంట్రా వంటివి ఉన్నాయి.


E-సెగ్మెంట్ (ఎగ్జిక్యూటివ్ సెడాన్లు)


 ఈ కార్లు చాలా విలాసవంతంగా ఉంటాయి.  ఈ సెగ్మెంట్‌లోని కార్లు పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటాయి.  వాటి ఇంటీరియర్ మార్కెట్లో లభించే కొన్ని ప్రీమియం మెటీరియల్‌లతో అమర్చబడి ఉంటుంది.   ఈ కార్లలో లభించే ఇంజన్లు కూడా చాలా శక్తివంతమైనవి.  రెండు వరుసలో లాంజ్ మసాజ్ సీట్లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది.  BMW 7 సిరీస్, ఆడి A6, A8తో పాటు మెర్సిడెస్ బెంజ్ 7 వంటి మోడల్‌లను కలిగి ఉంటాయి. రోల్స్ రాయిస్ ఫాంటమ్, 4-డోర్ బెంట్లీ కాంటినెంటల్ లాంటి  విలాసవంతమైన మోడల్‌లు కూడా ఈ విభాగంలోకి వస్తాయి.


M- సెగ్మెంట్ (మల్టీ పర్పస్ విభాగం)


M-విభాగం కూడా మూడు గ్రూపులుగా విభజించబడింది - చిన్న, మధ్య , పెద్ద తరగతి. భారతదేశంలో లభ్యమయ్యే ఈ సెగ్మెంట్లలోని వాహనాలలో రెనాల్ట్ ట్రైబర్ చిన్న తరగతి కాదు. , ఇన్నోవా - మిడ్-సైజ్ కారు. కియా కార్నివాల్  పెద్ద తరగతికి చెందినది.  M-సెగ్మెంట్ కార్లు 6-7 మంది వరకు సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. పెద్ద కుటుంబానికి అనువైన వాహనం, M-సెగ్మెంట్ కార్లు కార్పొరేట్ రవాణా వ్యాపారాలలో కూడా ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.   Mercedes Benz V-class వంటి ప్రీమియం లగ్జరీ MPVలకు వచ్చే సరికి  దీనిని మొబైల్ ఆఫీస్‌గా కూడా వాడుకునే అవకాశం ఉంది.


SUVలు


SUVలు B, C ,  D- విభాగాలలో అందుబాటులో ఉన్నాయి.  B-సెగ్మెంట్ SUVలు   4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటాయి. ఇందులో హ్యుందాయ్ వెన్యూ, టాటా పంచ్, కియా సోనెట్ మొదలైన SUVలు ఉన్నాయి.  C-సెగ్మెంట్   SUVలు B-సెగ్మెంట్ వాటి కంటే కొంచెం పొడవుగా ఉంటాయి. ఇందులో హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, విడబ్ల్యు టైగన్ మొదలైన మోడల్‌లు ఉన్నాయి. D-సెగ్మెంట్ SUVల్లో రేంజ్ రోవర్, BMW X7, Mercedes G-wagon లాంటి  లగ్జరీ కార్లు ఉన్నాయిఇందులో  శక్తివంతమైన ఇంజన్‌ ఉంటుంది. చక్కటి ఇంటీరియర్ ను కలిగి ఉంటాయి.