Third Party vs Comprehensive Insurance Comparision: వాహన బీమా అనేది, గవర్నమెంట్‌ రూల్‌ పెట్టింది కాబట్టి తీసుకునే అంశం కాదు, అది ఆర్థికంగా రక్షణగా నిలిచే అవసరమైన నిర్ణయం. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, బీమా అనేది కారు యజమానికి మిత్రుడు, దానిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ముఖ్యంగా, కొత్తగా కారు కొనుగోలు చేసే వాళ్లు లేదా పాత వాహనాలకు కొత్త పాలసీ తీసుకునే వాళ్లు ఆలోచించే విషయం - "థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలా, లేక సమగ్ర బీమా పాలసీ తీసుకోవాలా?". ఈ రెండు ప్రధాన ప్లాన్లలో ఏది సరైనదో తెలీక చాలా మంది గందరగోళం ఫీల్ అవుతుంటారు.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ అంటే ఏమిటి?భారతీయ మోటారు వాహన చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. మీ వాహనం వల్ల మూడో వ్యక్తికి జరిగిన నష్టానికి (ఆస్తి నష్టం లేదా శారీరకంగా హాని) పరిహారం చెల్లించేందుకు దీనిని ఉద్దేశించారు. అంటే, మీ కారు వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే, ఆ బాధ్యతను ఈ పాలసీ తీసుకుంటుంది. మీ వాహనం కారణంగా జరిగిన ప్రమాదం వల్ల వేరే వ్యక్తికి (థర్డ్‌ పార్టీకి) నష్టం కలిగితే, ఆ నష్టాన్ని మీ జేబులోంచి భర్తీ చేయాల్సిన అవసరం లేదు, బీమా కంపెనీ భరిస్తుంది.

లాభాలు:తక్కువ ప్రీమియంన్యాయపరంగా తప్పనిసరిసాధారణ వాహన యజమానులకు సరిపోతుంది

గుర్తు పెట్టుకోవలసిన విషయాలు:మీ కారుకు జరిగిన నష్టం లేదా దొంగతనానికి ఇది కవరేజీ ఇవ్వదుమీరు గాయపడినా, మీ కారులోని ప్రయాణికులు గాయపడినా ఇక్కడ కవరేజీ ఉండదు

ఎవరికి సరిపోతుంది?పాత వాహనాలు కలిగినవారుతక్కువ డ్రైవింగ్ అవసరం ఉన్నవారుతక్కువ బడ్జెట్ ఉన్నవారు

కంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌ అంటే?సమగ్ర బీమా అనేది అన్ని వైపులా రక్షణను అందిస్తుంది. థర్డ్ పార్టీ పరిహారంతో పాటు, మీ వాహనానికి జరిగిన నష్టం, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం వంటి వాటిని కూడా కవర్ చేస్తుంది. కాంప్రెహన్సివ్‌ బీమా అనేది పూర్తి రక్షణ కలిగించే ప్లాన్. దీని ద్వారా థర్డ్‌ పార్టీ కవర్‌తో పాటు మీ వాహనానికి జరిగిన నష్టాన్ని కూడా బీమా పాలసీ కవర్ చేస్తుంది.

లాభాలు:మీ కారుకే కాదు, మీకు కూడా కవరేజీఆకస్మిక ప్రమాదాలు, వర్షాలు, నదీ ప్రవాహాలు వల్ల కలిగిన నష్టం, దొంగతనాలు వంటివన్నీ కవర్ అవుతాయిడ్యామేజ్‌ రిపేర్ ఖర్చులు కూడా కవర్‌ అవుతాయివ్యక్తిగత ప్రమాద (PA) కవరేజీ కూడా ఉంటుంది

ఫీచర్లు:మీ కారుకు జరిగిన ప్రమాదం, కారు దొంగతనం, అగ్ని ప్రమాదం, ప్రకృతి వల్ల జరిగిన నష్టం వంటి వాటికి కవరేజ్‌పర్సనల్ యాక్సిడెంట్ కవర్ (కొన్ని పాలసీల్లో ఉచితం)

ఎవరికి సరిపోతుంది?కొత్త కారు యజమానులుఎక్కువగా ప్రయాణించే వారుసిటీ ట్రాఫిక్ లేదా ప్రమాద భయాలున్న ప్రాంతాల్లో ఉండేవారు

నిర్ణయం ఎలా తీసుకోవాలి?

బడ్జెట్: మీరు తక్కువ ఖర్చుతో తప్పనిసరి ఇన్సూరెన్స్‌ కావాలనుకుంటే, థర్డ్ పార్టీ సరిపోతుంది. కానీ మీ కారు విలువ ఎక్కువైతే కంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌ పాలసీ బెస్ట్.

వాహనం వయసు: పాత వాహనాలకు థర్డ్ పార్టీ సరిపోవచ్చు. కొత్త కారు అయితే పూర్తి రక్షణ అవసరం.

ఎక్కువ ప్రయాణాలు చేస్తారా?: ఎక్కువగా ప్రయాణిస్తే ప్రమాదాల ముప్పు ఎక్కువ. కాబట్టి కంప్రహెన్సివ్ పాలసీ అవసరం.

ప్రాంత పరిస్థితులు: మీ నివాసానికి వరద ముప్పు ఉందా?, మీ ప్రాంతంలో దొంగతనాల రేటు ఎక్కువగా ఉందా?, భూకంపాల జోన్‌లో ఉందా?, అయితే సమగ్ర బీమా తీసుకోవడం ఉత్తమం.

ఇన్సూరెన్స్‌ ప్లాన్ ఎంపిక అనేది మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. తక్కువ ఖర్చుతో న్యాయపరమైన అవసరాలను తీర్చగలిగితే చాలు అనుకుంటే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ చాలు. మీ కలల వాహనానికి పూర్తి రక్షణ కావాలంటే తప్పకుండా కంప్రహెన్సివ్ పాలసీ తీసుకోవాలి. 

థర్డ్‌ పార్టీ పాలసీ చవకగా కనిపించినా, ప్రమాదం సంభవించినప్పుడు మీ కారుకి జరిగే నష్టాన్ని భరించదు. కాంప్రహెన్సివ్‌ పాలసీ కోసం కొంచెం ఖర్చు ఎక్కువైనా, సంపూర్ణ రక్షణను అందిస్తుంది. 

2025లో భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే, కంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌కి ఓటు వేయడం తెలివైన నిర్ణయం అవుతుంది.