Car Discounts 2025 India: 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుండటంతో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో డిస్కౌంట్ సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. 2026లో కొత్త ఫేస్‌లిఫ్ట్‌లు, అప్‌డేటెడ్ మోడళ్లను తీసుకురావడానికి తయారీదారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్లకు వెయిటింగ్ పీరియడ్ లేకపోవడం కొనుగోలుదారులకు పెద్ద ప్లస్‌గా మారింది.
ఇప్పుడు మార్కెట్‌లో రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త మోడల్ కోసం ఎదురు చూడాలా? లేక భారీ డిస్కౌంట్‌తో ఇప్పుడే కారు తీసుకోవాలా? అనే సందిగ్ధంలో ఉన్నవారికి ఈ వివరాలు స్పష్టత ఇస్తాయి.
Skoda Kushaq - డిస్కౌంట్: రూ.2.50 లక్షల వరకు
2026 జనవరిలో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అవుతుందనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కుషాక్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. డీలర్ లెవెల్‌లో సుమారు రూ.2.50 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ.50 వేల ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుంది.కొన్ని కార్పొరేట్, స్క్రాపేజ్ ఆఫర్లతో కలిపి రూ.3.25 లక్షల వరకు లాభం ఉంటుందని కంపెనీ అధికారికంగా చెబుతోంది.ప్రస్తుతం స్కోడా కుషాక్ ధరలు రూ.10.61 లక్షల నుంచి రూ.18.43 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉన్నాయి.
Outgoing Kia Seltos - డిస్కౌంట్: రూ.1.60 లక్షల వరకు
2026లో తొలి లాంచ్‌గా కొత్త జనరేషన్ కియా సెల్టోస్ రానుంది. జనవరి 2న లాంచ్ అయ్యే ఈ మోడల్ ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుత సెల్టోస్‌పై రూ.1.60 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇందులో రూ.40 వేల ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుంది.ప్రస్తుతం కియా సెల్టోస్ ధరలు రూ.10.79 లక్షల నుంచి రూ.19.81 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉన్నాయి.
Mahindra XUV700 - డిస్కౌంట్: రూ.80 వేల వరకు
మహీంద్రా తాజాగా XUV700 ఫేస్‌లిఫ్ట్‌ను టీజ్ చేసింది. ఇది XUV 7XO పేరుతో 2026 జనవరి 5న లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో కొంతమంది డీలర్లు ప్రస్తుత XUV700పై రూ.80 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.ఈ SUV ధరలు ప్రస్తుతం రూ.13.66 లక్షల నుంచి రూ.23.71 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉన్నాయి.
Tata Punch - డిస్కౌంట్: రూ.80 వేల వరకు
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ ఇప్పటికే రోడ్ టెస్టింగ్‌లో పెట్టింది. 2026లో మిడ్ సైకిల్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. దీనికంటే ముందు ప్రస్తుత పంచ్‌పై కూడా రూ.80 వేల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.టాటా పంచ్ ధరలు ప్రస్తుతం రూ.5.50 లక్షల నుంచి రూ.9.30 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉన్నాయి.
కొత్త మోడల్ కోసం ఎదురుచూడాలనుకునేవారికి 2026 మంచి సంవత్సరం. కానీ డబ్బుకు ఎక్కువ విలువ కావాలనుకునే వారికి ఈ డిస్కౌంట్లు అరుదైన అవకాశం. వెయిటింగ్ పీరియడ్ లేకుండా, తక్కువ ధరకు మంచి కారు తీసుకోవాలంటే ఇదే సరైన సమయం.
గమనిక: డిస్కౌంట్లు నగరం, డీలర్, స్టాక్ ఆధారంగా మారుతాయి. ఖచ్చితమైన ఆఫర్ల కోసం మీ సమీప డీలర్‌ను సంప్రదించాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.