Car Dashboard Lights: కారు నడుపుతున్నట్టు డ్యాష్‌బోర్డుపై రకరకాల లైట్లు కనిపిస్తాయి. అయితే వాటి గురించి చాలా మందికి తెలియదు. ఈ లైట్లు కేవలం ప్రదర్శనకు మాత్రమే అనుకుంటే పొరపాటు చేసినట్టే. ఒక్కో రంగు లైటు ఒక్కో విధమైన సమాచారాన్ని అందిస్తాయి. అందుకే కచ్చితంగా వాటి గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవాలి. డ్యాష్‌బోర్డు లైటు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి వివిధ రంగుల్లో ఉంటాయి. ఎరుపు లైట్ వెలిగితే వెంటనే అటెన్ష్ అవసరం అని అర్థం. పసుపు లైట్ వెలిగితే ఏదో సమస్య ఉందని హెచ్చరిస్తోంది. ఆకుపచ్చ, లేదా నీలం లైట్ సాధారణంగా సమాచారం కోసం ఉంటుంది. అందుకే వల్ల వాహనం నడిపే ప్రతి ఒక్కరూ వీటి గురించి తెలుసుకోవాలి. 

Continues below advertisement

ఇంజిన్, ఆయిల్, ఉష్ణోగ్రత లైట్లు

కారులోని అత్యంత ముఖ్యమై లైట్లు ఇంజిన్, ఆయిల్‌కు సంబంధించినవి. చెక్ ఇంజిన్ లైట్ వెలిగితే ఇంజిన్‌లో ఏదో సమస్య ఉందని సంకేతాలు ఇస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇది చిన్నదైనా, పెద్దదైనా కావచ్చు. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయొద్దు. అయితే ప్రెజర్‌ లైట్‌ వెలిగితే, ఇంజిన్‌లో ఆయిల్ తక్కువగా ఉందని లేదా ప్రెజర్‌ సరిగా లేదని అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో, వెంటనే కారును ఆపి, దానిని చెక్ చేయించడం ముఖ్యం. ఇంజిన్ టెంపరేచ్‌ లైట్ వెలిగితే, ఇంజిన్ బాగా వేడెక్కిందని సూచిస్తుంది. ఇలా జరిగితే, కారును ఆపి ఇంజిన్‌ను చల్లారనివ్వండి, లేకపోతే ఇంజిన్ దెబ్బతింటుంది. బ్యాటరీ లైట్‌ వెలిగితే బ్యాటరి సరిగా ఛార్జ్ అవ్వడం లేదని అర్థం, దీని వల్ల ప్రయాణం మధ్యలో కారు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. 

బ్రేక్‌, సెక్యూరిటీ సిస్టమ్‌ లైట్లు 

బ్రేక్ లైట్ చాలా ముఖ్యమైంది. అది వెలిగితే, హ్యాండ్‌బ్రేక్‌ వేసి ఉందని లేదా బ్రేక్ ఫ్లూయిడ్‌ తక్కువగా ఉందని సంకేతాలు ఇస్తుంది. దానిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ఏబీస్‌ లైట్ యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్‌లో సమస్యను సూచిస్తుంది. దీని వల్ల అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు వాహనం జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎయిర్‌బ్యాగ్‌లైట్‌ కూడా చాలా ముఖ్యమైంది. అది వెలిగితే ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు సరిగగ్గా తెరుచుకోవని అర్థం చేసుకోవాలి. టైర్ ప్రెజర్ లైట్ టైర్‌లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా సెక్యూరిటీని కూడా ప్రభావితం చేస్తుంది. 

Continues below advertisement

మీ కారులో సురక్షితమైన డ్రైవింగ్ నిర్దారించడంలో సహాయపడే ఇతర లైట్లు కూడా ఉన్నాయి. ప్లూయల్‌ లైట్ మీ కారులో పెట్రోల్‌ లేదా డీజిల్‌ తక్కవగా ఉందని సూచిస్తుంది. కాబట్టి సమయానికి ఇంధనం నింపడం ముఖ్యం. ట్రాక్షన్ కంట్రోల్‌ లైట్ మీ కారు వీల్స్‌ పట్టు కోల్పుతున్నాయని లేదా సిస్టమ్‌లో లోపం ఉందని సూచిస్తుంది. ట్రాన్స్‌మిషన్ లైట్ గేర్‌బాక్స్‌లో సమస్యను సూచిస్తుంది. ఈ లైట్ వెలిగితే వీలైనంత త్వరగా మీ కారును చెక్ చేయండి. సురక్షితమైన డ్రైవింగ్ కోసం ఈ లైట్ల గురించి అర్థం చేసుకోవడం చాలా అవసరం. అలా తెలుసుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకుంటే కారు ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.