Buy Kia Sonet On Bank Loan And EMI: కియా సోనెట్ భారతీయ మార్కెట్లో ఒక పాపులర్‌ కాంపాక్ట్ SUV, లాంచింగ్‌ నాటి నుంచి ఈ ఫోర్‌వీలర్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. రాకెట్‌ లాంటి కియా సోనెట్ రేటు విషయానికి వస్తే.. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర (Kia Sonet Ex-showroom price) రూ. 7 లక్షల 99 వేల నుంచి ప్రారంభం అవుతుంది & టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15 లక్షల 75 వేలు అవుతుంది. అమ్మో, అంత రేటా అనుకోవద్దు - మీ దగ్గర ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నా చాలు, కియా సోనెట్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. 

ఆర్థిక భారం లేకుండా కియా సోనెట్‌ను ఎలా దక్కించుకోవాలి?తెలుగు రాష్ట్రాల్లో, కియా సోనెట్ బేస్ మోడల్‌ ఆన్-రోడ్ ధర (Kia Sonet On-road price) రూ. 9.52 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్‌కు రూ. 19.20 లక్షల వరకు ఉంటుంది. మీరు ఈ కాంపాక్ట్ SUV బేస్ మోడల్‌ను హైదరాబాద్‌ లేదా విజయవాడలో కొనాలంటే, మీ దగ్గర ఉన్న లక్ష రూపాయలను డౌన్ పేమెంట్‌ చేయండి. మిగిలిన రూ. 8.52 లక్షలను బ్యాంక్‌ మీకు కార్‌ లోన్‌గా ఇస్తుంది. మీ క్రెడిట్‌ స్కోర్‌ సూపర్‌గా ఉంటే 9 శాతం వడ్డీ రేటుకే రుణం మంజూరు కావచ్చు. ఈ డబ్బును సులభమైన EMIల్లో తిరిగి చెల్లిస్తే చాలు. అంటే, మీపై పెద్దగా ఆర్థిక భారం కియా సోనెట్‌తో దర్జాగా దేశమంతా తిరిగిరావచ్చు.

EMI లెక్కింపుబ్యాంక్‌ లోన్‌ త్వరగా తీరాలంటే, రుణ కాలపరిమితి తక్కువగా పెట్టుకోవాలి. దీనివల్ల, నెలనెలా చెల్లించాల్సిన EMI మొత్తం పెరిగినప్పటికీ, రుణం నుంచి వేగంగా విముక్తులు అవుతారు, వడ్డీ మొత్తం కూడా తక్కువగా ఉంటుంది. లేదంటే, కాల పరిమితిని 7 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. దీనివల్ల EMI మొత్తం తగ్గుతుంది, అదే సమయంలో, చెల్లించాల్సిన వడ్డీ మొత్తం పెరుగుతుంది. 

4 సంవత్సరాల కాలపరిమితితో రూ.8.52 లక్షల కార్‌ లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ ప్రకారం, నెల EMI రూ. 21,202 అవుతుంది. ఈ నాలుగేళ్లలో (48 EMIs) మొత్తం రూ. 1,65,699 వడ్డీ చెల్లించాలి.

5 సంవత్సరాల టెన్యూర్‌తో లోన్‌ తీసుకుంటే, నెలనెలా రూ. 17,686 EMI చెల్లించాలి. ఈ ఐదేళ్లలో (60 EMIs) మొత్తం రూ. 2,09,167 వడ్డీ చెల్లించాలి.

6 సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే, నెలకు రూ. 15,358 బ్యాంక్‌లో జమ చేయాలి. ఈ ఆరేళ్లలో (72 EMIs) మొత్తం రూ. 2,53,759 వడ్డీ చెల్లించాలి.

7 సంవత్సరాల కాలపరిమితికి రుణం మంజూరు అయితే, EMI రూ. 13,708 అవుతుంది. ఈ ఏడేళ్లలో (84 EMIs) మొత్తం రూ. 2,99,463 వడ్డీ చెల్లించాలి.

మీ క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ, బ్యాంక్‌ పాలసీ ప్రకారం వడ్డీ రేటు, మంజూరయ్యే రుణ మొత్తం, కాల పరిమితి మారవచ్చు.

మీరు నెలకు రూ.50,000 జీతం/ఆదాయం సంపాదిస్తుంటే, 6 లేదా 7 సంవత్సరాల టెన్యూర్‌తో బ్యాంక్‌ లోన్‌ తీసుకోవచ్చు. 

కియా సోనెట్‌ ఫీచర్లుఫీచర్ల విషయంలో కియా సోనెట్‌ అదరహో అనిపిస్తుంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఇంకా, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందించారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ABS & EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా, ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్, లెవల్ 1 ADAS సహా మరెన్నో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత పరంగా, కియా సోనెట్ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తున్నారు, మీ ప్రయాణాన్ని సురక్షితం చేశారు.