Second Hand Car Buying Guide 2025: టయోటా గ్లాంజా అంటే సాదాసీదా కారు కాదు, ఇది ఒరిజినల్ "Maruti Suzuki Baleno” కి కాపీ క్యాట్. అయినా, టయోటా బ్రాండ్‌తో మరింత నమ్మకం కలిగించే కారు. అందుకే, వాడిన/సెకండ్ హ్యాండ్ గ్లాంజా కొనాలా అని ఆలోచిస్తున్నవారికి ఇది ఒక సూపర్ చాయిస్.
గ్లాంజా ఎందుకు ప్రత్యేకం?మారుతి సుజుకి బాలెనో ఆధారంగా తయారైన టయోటా గ్లాంజా ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇందులో పెద్ద స్పేస్, మంచి ఫీచర్లు, మైలేజ్, కంఫర్ట్ అన్నీ ఉన్నాయి. కొత్త జనరేషన్ గ్లాంజా 2022 మార్చిలో లాంచ్ అయ్యింది. ముందు ఉన్న మోడల్‌తో పోలిస్తే ఇది మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. కెమ్రీ లాంటి గ్రిల్, స్పోర్టీ బంపర్, కొత్త అలాయ్స్, LED హెడ్‌ల్యాంప్స్ ఇవన్నీ దీని లుక్‌ను షార్ప్‌గా మార్చాయి. లోపల బ్లాక్ అండ్ బీజ్ టోన్ కాంబినేషన్‌తో ఉన్న కేబిన్ ఫ్యామిలీ యూజ్‌కి బాగుంటుంది.
ఇంజిన్ & మైలేజ్‌గ్లాంజాలో 1.2 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 90హెచ్‌పీ పవర్, 113ఎన్‌ఎం టార్క్ ఇస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. CNG వెర్షన్ కూడా ఉంది, అది 77హెచ్‌పీ పవర్ ఇస్తుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 22 కి.మీ.ల మైలేజ్ ఇస్తే, CNG వెర్షన్ కిలోకు 30.61 కి.మీ. ఇస్తుంది. రోజూ ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్లు CNG వెర్షన్ తీసుకోవచ్చు కానీ బూట్ స్పేస్ కొంత తగ్గుతుంది.
వేరియంట్లు & ఫీచర్లుగ్లాంజాలో E, S, G, V అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి. V అనేది టాప్ మోడల్, దీనిలో 360° కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, 9 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో LED హెడ్‌ల్యాంప్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. మధ్య వేరియంట్ G కూడా అవసరాలకు సరిపోతుంది. మీది బడ్జెట్ తక్కువ అయితే S మోడల్ కూడా బేసిక్ అవసరాలు నెరవేరుస్తుంది.
టయోటా వారంటీ అదనపు ప్రయోజనంగ్లాంజా తీసుకోవడానికి ఒక పెద్ద కారణం దాని వారంటీ. టయోటా, 3 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీ. (ఏది ముందయితే అది) వారంటీ ఇస్తుంది. ఈ వారంటీని 5 సంవత్సరాలు/2,20,000 కి.మీ. వరకూ పొడిగించుకోవచ్చు. బాలెనోలో మాత్రం కేవలం 2 సంవత్సరాలు/40,000 కి.మీ. మాత్రమే ఉంది. అంటే మీరు సెకండ్ హ్యాండ్ గ్లాంజా కారు తీసుకున్నా, దాని వారంటీ ఇంకా మిగిలుండే అవకాశం ఉంది.
కొనుగోలు ముందు గమనించాల్సినవి
AMT గేర్‌బాక్స్ చెక్ చేయండి - టెస్ట్ డ్రైవ్‌లో కారు సాఫీగా నడుస్తుందా, షిఫ్ట్స్ స్మూత్‌గా ఉన్నాయా అని చూసుకోండి.
టచ్‌స్క్రీన్ పని చేస్తుందా చూడండి - ల్యాగ్, ఫ్రీజ్, మొబైల్ కనెక్ట్ సమస్యలు ఉన్నాయా అన్నది పరిశీలించండి.
రీకాల్ హిస్టరీ చెక్ చేయండి - 2022 డిసెంబర్ 8 నుంచి 2023 జనవరి 12 వరకు తయారైన కొన్ని కార్లలో ఎయిర్‌బ్యాగ్ ఇష్యూలు వచ్చాయి. ఆ రీప్లేస్ జరిగిందో, లేదో సర్వీస్ రికార్డులు చూడండి.
ధర & రీసేల్ విలువవాడిన గ్లాంజా ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఇది ఇంకా సేల్స్‌లో ఉంది. మార్కెట్లో ₹6.5 లక్షల నుంచి ₹8 లక్షల వరకు దొరుకుతుంది. కానీ ₹8 లక్షలకు మించి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొత్త గ్లాంజా దాదాపు అదే ధరలో లభిస్తుంది.
కండిషన్‌లో ఉన్న యూజ్డ్ టయోటా గ్లాంజా కారు తీసుకోవడం ఒక తెలివైన నిర్ణయం అవుతుంది - మంచి మైలేజ్, స్మూత్ డ్రైవ్, శక్తిమంతమైన ఇంజిన్ & టయోటా వారంటీ కలసి మీకు మంచి విలువ ఇస్తాయి. కొనుగోలు ముందు ఈ చెక్‌లిస్ట్ పాటిస్తే, సేఫ్ డీల్ ఖాయం!.