లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ..  50 జహ్రే ఎమ్ ఎడిషన్ ను ఇవాళ(అక్టోబర్ 14న) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మేరకు BMW ఇండియా  ఓ ప్రకటన విడుదల చేసింది.  BMW M GmbH 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఈ లాంచ్‌ను ప్రకటించింది. 50 అనేది M బ్రాండ్ యొక్క 50 ఏళ్ల ప్రస్థానాన్ని సూచిస్తుంది. కొత్త స్పెషల్ ఎడిషన్ M5 కాంపిటీషన్ ధర రూ. 1.80 కోట్లుగా(ఎక్స్-షోరూమ్, ఇండియా) కంపెనీ నిర్ణయించింది. ఈ లేటెస్ట్ కారు కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్ (CBU)గా పరిచయం చేయబడింది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఆర్డర్ బుక్స్ ఓపెన్ చేసింది.  


ఇంజిన్, స్పీడ్ ప్రత్యేతలు


ఈ కారుని కేవలం 10 యూనిట్లు మాత్రమే విడుదల చేయనున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది. సబ్-బ్రాండ్‌ను M పనితీరును సెలబ్రేట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా వీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.  తాజా మోడల్ కూడా అదే లాంచ్ స్ప్రీలో భాగంగా వచ్చింది. M5 కాంపిటీషన్ ను  'గొర్రెల దుస్తుల్లోని తోడేలు'గా కంపెనీ భావిస్తుంది. దీనికి కారణం ఏంటంటే  ఇది ఒక సెలూన్‌గా పరిగణించబడుతుంది. 4.4l ట్విన్-టర్బో V8పై ప్రొపెల్లింగ్ చేస్తున్నప్పుడు చక్కటి సౌలభ్యంతో పాటు  లగ్జరీని అందిస్తుంది. ఈ  ఇంజిన్ 625 bhp గరిష్ట శక్తిని అందిస్తుంది. 750 Nm గరిష్ట టార్క్‌తో బ్యాకప్ చేయబడింది. కేవలం 3.3 సెకెన్లలో ఈ కారు 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది.   


Read Also: ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు వచ్చేసింది - ప్రయోగం సక్సెస్!


స్పెషల్ ఫీచర్స్


ఇంటీరియర్ విషయానికి వస్తే BMW M5 కాంపిటీషన్ '50 జహ్రే M ఎడిషన్స్' డ్రైవింగ్ సరైన వాతావరణాన్ని అందించే డ్రైవర్-సెంట్రిక్ కాక్‌పిట్‌ ఉంది. స్టీరింగ్ వీల్‌పై లెదర్ కవర్ అండ్ స్పెషల్ ట్రిమ్ స్ట్రిప్స్ కూడా వాహనం  స్పోర్టీ అనుభూతిని పెంచుతాయి. ఇక లోపలి భాగంలో BMW లైవ్ కాక్‌ పిట్ ప్రొఫెషనల్‌ BMW ఆపరేటింగ్ సిస్టమ్ 7.0, 3D నావిగేషన్, 12.3-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల కంట్రోల్ డిస్‌ప్లే అండ్ BMW వర్చువల్ అసిస్టెంట్ పొందుతుంది. ఈ కారు M- స్పెక్ అప్‌ డేట్‌ ల యొక్క ప్రత్యేక సెట్‌ ను కలిగి ఉంది.  M5 కాంపిటీషన్ '50 జహ్రే M ఎడిషన్స్' రీట్యూన్డ్ ఛాసిస్, సెంట్రల్ ఇంటెలిజెంట్ కంట్రోల్‌తో యాక్టివ్ M డిఫరెన్షియల్, కొత్త షాక్ అబ్జార్బర్‌లు, స్పెషల్ M స్పోర్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్, ట్రాక్ మోడెమ్, బెస్పోక్ ఇంజన్ మౌంటింగ్, M మల్టీఫంక్షన్ సీట్లను కలిగి ఉంటుంది. అటు సెటప్ బటన్‌ను మరింత మెరుగ్గా కలిగి ఉంది.