BMW India New Outlets: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (Bavarian Motor Works AG) భారత్‌లో తన మొట్టమొదటి రీటైల్ నెక్ట్స్ సేల్స్ అవుట్ లెట్‌ను ప్రారంభించింది. ఈ తరహా తొలి స్టోర్ గుర్‌గావ్‌లో ప్రారంభించారు. దేశంలోనే ప్రధాన నగరాల్లో మరిన్ని ఇలాంటి షోరూంలను ప్రారంభిస్తున్నట్లుగా కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ అవుట్ లెట్ సాధారణ షోరూంల మాదిరిగా కాకుండా విభిన్నతను చాటుకుంటోంది. రిటైల్ నెక్స్ట్ షోరూమ్ కాన్సెప్ట్ గురించి బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, అండ్ సీఈవో విక్రమ్ పవా వివరించారు. 




ఈ అవుట్ లెట్‌లలో పెద్ద మార్పు ఏంటంటే, సాధారణ షోరూంల మాదిరిగా లే అవుట్‌తో కూడిన స్పేస్, రిసెప్షన్ లాంటివి ఏమీ ఉండవు. వాటికి బదులుగా డెలివరీ ప్రాసెస్ కోసం డిఫరెంట్‌గా, డెడికేటెడ్ ఏరియాలు కలిగి ఉన్నాయి. 'వెల్‌కమ్ స్టాండ్' కూడా కలిగి ఉంటుంది. ఈ అవుట్ లెట్‌లోకి ఉన్న కస్టమర్ వాక్‌వే ద్వారా పై అంతస్తుకు కూడా వెళ్లొచ్చు. ఇక్కడ ఎం డివిజన్ కు చెందిన కార్లు ఇంకా బీఎండబ్ల్యూ మినీ కార్లను ప్రదర్శించారు. 




ఈ రిటైల్ నెక్స్ట్ షోరూమ్‌లు వన్ ఫ్లోర్ కాన్సెప్ట్‌ను కలిగి ఉంటాయి. ఇక్కడ బీఎండబ్ల్యూ, మినీ, మోటోరాడ్ వంటి కార్లు అన్నీ ఒకే రూఫ్‌లో ఉంటాయి. ఇంకా గెస్ట్‌ల ఆతిథ్యం కోసం ఈ అవుట్‌లెట్ లో ప్రత్యేక స్పేస్ కూడా ఏర్పాటు చేశారు. సీఈవో విక్రమ్ పవా మాట్లాడుతూ.. ట్రెడిషనల్ షోరూంలతో పోల్చితే వీటిని కొత్త బోటిక్ షోరూమ్‌లుగా అభివర్ణించారు. సంప్రదాయ కాన్సెప్ట్ ల షోరూం లుక్స్‌తో కాకుండా.. ఈ అవుట్ లెట్ ఒక లివింగ్ రూమ్ లాంటి రూపాన్ని కలిగి ఉంటుంది. నిజానికి, M డివిజన్, మినీతో సహా ప్రతి బ్రాండ్‌కు స్క్రీన్‌లు, పర్సనలైజేషన్ ఏరియాలు ఉన్నాయి. ఈ షోరూమ్‌లు దేశంలోని ప్రస్తుత షోరూమ్‌లతో పోల్చితే విభిన్న థీమ్‌తో, వైవిధ్యమైన లుక్‌తో ఉంటాయి. 




ఇక ప్రొడక్షన్ గురించి విక్రమ్ పవా మాట్లాడుతూ.. ప్రస్తుతం 5 సిరీస్‌కు మంచి డిమాండ్ ఉందని, SAVలతో పాటు EV ప్రొడక్షన్ రేంజ్ కూడా మరింత ఊపందుకుంటాయని వివరించారు. తాము భవిష్యత్తులో X3 లాంటి కొత్త కార్లను ఆశిస్తున్నామని అన్నారు. 3 Gran Limousine, 5 సిరీస్ LWB వంటి లాంగ్ వీల్‌బేస్ సెడాన్‌లతో పాటు 7 సిరీస్‌లు కూడా BMW లైనప్‌కు ప్రధానమైనవని విక్రమ్ పవా తెలిపారు. బీఎండబ్ల్యూ ఇండియా ఇంతకుముందు LWB కాన్ఫిగరేషన్‌తో కొత్త 5 సిరీస్‌ను ప్రారంభించిందని.. కొత్త కూపర్ Sతో పాటు ఇటీవల ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్‌ను కూడా పరిచయం చేసిందని విక్రమ పవా తెలిపారు.