రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి సరైన టూవీలర్‌ను ఎంచుకోవడం ముఖ్యం. కారులో వెళ్లడం కష్టమైన పని. అయితే రోజూ ఎంత దూరం ప్రయాణించాలి, ఎంత ట్రాఫిక్ ఉంటుంది, పార్కింగ్ సౌకర్యం, లాంటి విషయాలు గమనించాలి. ప్రతి నెలా ట్రావెలింగ్ కోసం ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు అనే దానిపై క్లారిటీ ఉండాలి. పెట్రోల్ స్కూటర్, పెట్రోల్ బైక్, ఎలక్ట్రిక్ వాహనం (EV) మూడింటికీ వాటి ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి.

Continues below advertisement

ప్రభుత్వ నేషనల్ హౌస్‌హోల్డ్ ట్రావెల్ సర్వే ప్రకారం, 42.6 శాతం మంది ఉద్యోగులు రోజూ ఆఫీస్‌లకు చేరుకోవడానికి టూవీలర్‌ ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో సరైన టూ-వీలర్‌ను ఎంచుకోవడం ముఖ్యం. అది మీ రోజువారీ సమయం, ఖర్చు రెండింటిపై ప్రభావం చూపుతుంది. మీ పని ఎక్కువగా సిటీలో ఉంటే స్కూటీ బెస్ట్ ఛాయిస్ కావచ్చు. ఒకవేళ దూరం ఎక్కువైనా లేదా  రోడ్లు ఖాళీగా ఉన్నా బైక్ బెస్ట్ అనిపించవచ్చు. మీకు ఛార్జింగ్ సౌకర్యం ఉంటే ఎలక్ట్రిక్ టూ-వీలర్ మీ నెలవారీ రవాణా ఖర్చు చాలా వరకు తగ్గిస్తుంది.

సిటీ ట్రాఫిక్‌లో స్కూటర్ ఎందుకు బెస్ట్

Continues below advertisement

మీ ఆఫీస్ ఇంటి నుంచి దాదాపు 5 నుంచి 20 కిలోమీటర్ల దూరం అయి, భారీ ట్రాఫిక్ ఉంటే, పెట్రోల్ స్కూటర్ సరైన ఎంపిక కావచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండటం వల్ల పదే పదే క్లచ్, గేర్లు మార్చాల్సిన పని ఉండదు. అండర్ సీట్ స్టోరేజ్‌లో ఆఫీస్ బ్యాగ్ లేదా చిన్న చిన్న వస్తువులను పెట్టుకోవచ్చు. హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ జూపిటర్ 125 వంటి స్కూటర్లు రోజువారీ వాడకానికి కస్టమర్లకు సరైన ఎంపికలు. స్కూటర్ వల్ల మరో ప్రయోజనం ఏంటంటే, దీనిని ఈజీగా నడపడం, పార్కింగ్ సైతం చాలా సులభం. మీ రోజువారీ మార్గంలో గుంతల రోడ్లు లేదా పొడవైన హైవేలు ఉంటే, బైక్ బెస్ట్ అని చెప్పవచ్చు.

ఎక్కువ దూరం జర్నీకి బైకా లేదా ఈవీనా?

మీరు ఎక్కువ దూరం వెళ్లాల్సి రావడం, దారిలో ఖాళీ రోడ్లు లేదా హైవే లాంటివి వస్తే, 125-160cc కమ్యూటర్ బైక్ సరిపోతుంది. హోండా షైన్ 125, టీవీఎస్ రైడర్, హీరో సూపర్ స్ప్లెండర్  వంటి మోడల్స్ రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించారు. మరోవైపు, ఎలక్ట్రిక్ టూ వీలర్ సిటీ లోపల ప్రయాణానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో గేర్, క్లచ్ ఉండవు కనుక.. ఇల్లు లేదా ఆఫీస్‌లో ఛార్జింగ్ సదుపాయం ఉంటే ఈవీ తీసుకోవాలి. ఈవీ (EV) రన్నింగ్ కాస్ట్ పెట్రోల్ స్కూటర్, బైక్ కంటే చాలా తక్కువ. అయితే విద్యుత్ ఛార్జీలు, ఛార్జింగ్ సౌకర్యం, మీ రోజువారీ ప్రయాణ దూరంపై ఆధారపడి ఉంటుంది. కొనుగోలు చేయడానికి ముందు ఛార్జింగ్ సదుపాయాన్ని చూసుకోవడం ముఖ్యం.

ఎవరికి ఏ టూ-వీలర్ సెట్ అవుతుంది

మీ ఆఫీస్ దగ్గరగా ఉండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్లయితే పెట్రోల్ స్కూటీ బెస్ట్. ఒకవేళ రోజూ 30-50 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం వెళ్లడం, దారిలో హైవే లేదా ఖాళీ రోడ్డు కూడా వస్తే పెట్రోల్ బైక్ మంచి ఎంపిక కావచ్చు. మీ వాడకం ఎక్కువగా సిటీలోనే ఉండి, ఇల్లు లేదా ఆఫీస్‌లో ఛార్జింగ్ సౌకర్యం ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి. కానీ ఈవీ కొనేముందు ఛార్జింగ్ సమయం, సర్వీస్ నెట్‌వర్క్, బ్యాటరీ వివరాలు చెక్ చేసుకోవాలి.