Best Upcoming Cars in 2024: కొత్త కారును కొనుగోలు చేయడానికి వేచి ఉన్న వినియోగదారుల కోసం వచ్చే ఏడాది అనేక ఆప్షన్లు తీసుకురానున్నారు. ఇందులో కొత్త ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి అనేక ముఖ్యమైన లాంచ్‌లు కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి ఐదు కొత్త కార్ల గురించి తెలుసుకుందాం.


కొత్త హ్యుందాయ్ క్రెటా (New Hyundai Creta)
కొత్త క్రెటా ఇతర మార్కెట్‌ల్లో ఉండే క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాగా కనిపించదు. ఎందుకంటే భారతదేశంలో ఇది మన అభిరుచికి అనుగుణంగా విభిన్న స్టైలింగ్‌తో విభిన్న వేరియంట్‌ల్లో లభిస్తుంది. కొత్త క్రెటా కొత్త డిజైన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది పెద్ద గ్లోబల్ హ్యుందాయ్ ఎస్‌యూవీలాగా ఉంటుంది. దాని కొత్త ఇంజిన్, ఇంటీరియర్ గురించి ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్, 18 అంగుళాల వీల్స్ వంటి ఫీచర్లు కొత్త క్రెటాలో కనిపిస్తాయని భావిస్తున్నారు. కొత్త క్రెటా ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్‌తో పాటు మరింత శక్తివంతమైన 1.5 లీటర్ టర్బో పెట్రోల్‌ను పొందుతుంది.


కొత్త మారుతి స్విఫ్ట్ (New Maruti Swift)
త్వరలో రానున్న స్విఫ్ట్ కొత్త ఫీచర్లు, కొత్త ఇంజిన్‌పై దృష్టి సారించి దాని స్టైలింగ్‌ను మార్చుకుంటూ జనరేషన్ ఛేంజ్‌కు రెడీ అయింది. ఇది మునుపటి కంటే అత్యాధునిక క్యాబిన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని స్టైల్ మరింత ప్రీమియంగా మారనుంది. ఇది కాకుండా కొత్త 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు అలాగే ఉంటాయి.


టాటా కర్వ్ (Tata Curvv)
భారతదేశంలో కర్వ్ ఈవీ రూపంలో లాంచ్ అయింది. ఇది 400 నుంచి 500 కిలోమీటర్ల మధ్య మంచి రేంజ్‌ని పొందుతుంది. కర్వ్ అనేది ఒక పెద్ద ఎస్‌యూవీ కూపే. ఇది నెక్సాన్ కంటే పైన ఉండనుంది. ఈ రకమైన మొదటి ఎస్‌యూవీ కూపే ఇది. ఇంటీరియర్ పూర్తి టాప్ ఎండ్ ఫీచర్లతో ఉంటుంది. ఇది నెక్సాన్ ఈవీ కంటే పవర్‌ఫుల్‌గా ఉంటుంది.


మహీంద్రా థార్ 5 డోర్ (Mahindra Thar 5-door)
ఐదు డోర్ల థార్ ఎట్టకేలకు 2024లో వస్తుంది. అయితే ఇది అదనపు డోర్లతో మాత్రమే రాదు. ఇది మరింత విలాసవంతంగా ఉంటుంది. ప్రస్తుత థార్ కంటే ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో విభిన్న స్టైలింగ్ థీమ్‌ను కలిగి ఉంటుంది. ఇంజిన్ ఆప్షన్లు కూడా అలాగే ఉంటాయి. అయితే 3 డోర్ వేరియంట్‌ ధర కూడా భారీగా పెరగవచ్చని భావిస్తున్నారు.


సిట్రోయెన్ సీ3ఎక్స్ సెడాన్ (Citroen C3X sedan)
సిట్రోయెన్ సీ3ఎక్స్ సెడాన్‌తో భారతదేశంలో కంపెనీ ఒక ఇంట్రస్టింగ్ ప్రొడక్ట్‌ను లాంచ్ చేయనుంది. ఇది సెడాన్ షేప్‌లో ఉండే ఒక క్రాస్‌ఓవర్. ఇందులో రాడికల్ స్టైలింగ్ థీమ్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది కన్వెన్షనల్ ఎస్‌యూవీ లాగా మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా పొందుతుంది. ఇంజన్ ఆప్షన్ సీ3 ఎయిర్‌క్రాస్ లాగానే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సిట్రోయెన్ కార్ల కంటే ఇంటీరియర్ ఇంకా ఎక్కువ ప్రీమియంగా ఉంటుందని భావిస్తున్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!