Hero VIDA Vx2 Specifications: హీరో మోటోకార్ప్ అనుబంధ VIDA బ్రాండ్ నుంచి వచ్చిన VX2 స్కూటర్ తాజాగా మార్కెట్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంటోంది. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని దీనిని డిజైన్ చేయడంతో, యూత్‌కు తెగ నచ్చుతోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ ధర కేవలం ₹44,990 (ఎక్స్-షోరూమ్) నుంచే ప్రారంభమవుతోంది. అంతేకాదు, దీనికి బ్యాటరీ 'రెంట్ మోడల్'లో ఉండటం వల్ల ప్రారంభ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
VIDA బ్రాండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?ఈ ఏడాది జులైలో, VIDA, దేశవ్యాప్తంగా 11,022 యూనిట్లను డీలర్లకు పంపించింది. రవాణా చేసిన వాహనాల్లో 10,489 యూనిట్లు వాహన రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఫలితంగా VIDA EV మార్కెట్ వాటా గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అయి 10.2% కు చేరుకుంది. ఇది ఈ కంపెనీకి ఇప్పటి వరకు వచ్చిన అత్యధిక మార్కెట్ వాటా.
డిజైన్ & ఫీచర్లు – యువతకు నచ్చేలాVIDA VX2 స్కూటర్‌ను, 2023లో EICMA షోలో ప్రదర్శించిన VIDA Z కాన్సెప్ట్ ఆధారంగా డిజైన్ చేశారు. V2 మోడల్‌తో పోలిస్తే VX2ను మరింత అర్థవంతమైన ధరతో, ఆకర్షణీయమైన డిజైన్‌తో అందుబాటులోకి తెచ్చారు.
ఫీచర్ల విషయానికి వస్తే:
- కలర్ TFT డిస్‌ప్లే
- LED లైటింగ్
- క్లీన్‌గా ఉన్న బాడీ డిజైన్ కటింగ్
- కాంపాక్ట్ డైమెన్షన్లు
- అద్భుతమైన యాక్సెలరేషన్
- OTA (ఓవర్ టు ఎయిర్) అప్‌డేట్స్‌తో చాలా ఫంక్షనాలిటీలు
బ్యాటరీ రెంటల్ ప్లాన్ – ఈ-స్కూటర్‌కి కొత్త మలుపుVIDA VX2 స్కూటర్ బ్యాటరీకి అద్దె ఆప్షన్ ఉన్నందువల్ల, కొనుగోలుదారులు స్కూటర్‌ను చాలా తక్కువ ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. VX2ను ₹44,990కి కొనుగోలు చేసిన తర్వాత, మీరు బ్యాటరీని అద్దెకు తీసుకోవాలి. కిలోమీటరుకు కేవలం ₹1.25 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా రోజూ తక్కువ దూరాలు ప్రయాణించే వాళ్లకు చాలా మంచి ఎంపిక.
రేంజ్, వేగం & వేరియంట్లు
VIDA VX2 స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది, అవి - VX2 Go & VX2 Plus.
| వేరియంట్ | బ్యాటరీ కెపాసిటీ | IDC రేంజ్ | టాప్ స్పీడ్ |
| VX2 Go | 2.2 kWh | 92 km | 70 km/h |
| VX2 Plus | 3.4 kWh | 142 km | 80 km/h |
ఇవన్నీ IDC (Indian Driving Conditions) డేటా ప్రకారం ఉన్న అంచనాలు. రియల్-టైమ్ వినియోగం ఆధారంగా ఈ పరిధిలో కాస్త వ్యత్యాసం ఉండవచ్చు.
VX2లో ఇంకా ప్రత్యేకతలు ఏంటి?
- VX2లో తీసి, పెట్టగలిగిన (రిమూవబుల్) బ్యాటరీ ఉంది. అంటే, మీరు ఈ బ్యాటరీని ఇంట్లోనే చార్జ్ చేయవచ్చు.
- డ్యూయల్ రైడింగ్ మోడ్స్ (Eco, Power)
- USB ఛార్జింగ్ పోర్ట్
- OTA అప్‌డేట్స్‌కు సపోర్ట్
- VIDA యాప్ సపోర్ట్‌తో స్కూటర్‌ను మొబైల్ నుంచే మానిటర్ చేయవచ్చు
మొదటిసారి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునేవారికి, బ్యాటరీ రెంట్ మోడల్ ద్వారా అందుబాటులో ఉన్న VIDA VX2 మంచి ఆప్షన్. స్మార్ట్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, విశ్వసనీయ బ్రాండ్ బ్యాకప్ - ఇవన్నీ కలగలిసి ఇది మార్కెట్లో వేగంగా అమ్ముడవుతోంది. మీ అవసరాలకు అనుగుణంగా పరిధి, బ్యాటరీ రకం ఎంపిక చేసుకోగల స్వేచ్ఛ ఈ బండిని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.