Best Motorcycle For Tall Riders: కొందరి ఎత్తు 6 అడుగులకి పైగా ఉండి, వయసు 30+ అయితే, బాడీ స్ట్రక్చర్ కూడా బలంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఆఫీస్ లేదా ఇతర పనుల కోసం రోజూ హైదరాబాద్/ విజయవాడ వంటి ట్రాఫిక్ నగరాల్లో సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ, వీకెండ్స్‌లో సరదా రైడ్ ఇచ్చే బైక్ కోసం చూస్తుంటే... మోటార్ సైకిల్ ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి అవసరాలకు సరైన బైక్ ఎంపిక చేయడం అంత సులువు కాదు. కంటికి నచ్చిన బైక్ కొనేస్తే రైడింగ్ సమయంలో వెన్నెముక, భుజాల నొప్పులు వస్తాయి.
ఆరు అడుగుల ఆజానుబాహులకు కావాల్సింది ట్రాక్ మీద దూసుకెళ్లే అగ్రెసివ్ మెషిన్ కాదు. అలాగే చిన్నగా కనిపించే బైక్ కూడా కాదు. స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్, ప్లష్ సస్పెన్షన్, కంఫర్ట్ రైడింగ్ పొజిషన్ – ఇవన్నీ ఉండాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల పరిస్థితి చూస్తే, బాడ్ రోడ్స్‌ను ఈజీగా హ్యాండిల్ చేసే బైక్ తప్పనిసరి.
అడ్వెంచర్ బైక్‌లు (ADV సెగ్మెంట్)
ADV సెగ్మెంట్ మీ అవసరాలకు బాగా సరిపోతుంది. పొడవైన సీట్ హైట్, స్ట్రైట్ రైడింగ్ పొజిషన్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వల్ల బ్యాడ్ రోడ్లపై కూడా శరీరానికి అలసట తక్కువగా ఉంటుంది.
TVS Apache RTX 300టీవీఎస్ నుంచి వచ్చిన ఈ కొత్త అడ్వెంచర్ బైక్ రోజువారీ సిటీ రైడింగ్‌కు కూడా సూట్ అవుతుంది. సస్పెన్షన్ సెటప్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. రోడ్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది.
Royal Enfield Himalayan 450పొడవైన రైడర్లకు ఇది దాదాపు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సీట్ పొజిషన్, హ్యాండిల్‌బార్ ప్లేస్‌మెంట్, సస్పెన్షన్ వంటివన్నీ లాంగ్ రైడ్స్‌కే కాదు, సిటీ కమ్యూట్‌కూ సౌకర్యంగా ఉంటాయి.
KTM 250 Adventure / 390 Adventureపవర్ ఎక్కువగా కావాలంటే KTM 390, కొంచెం బ్యాలెన్స్ కావాలంటే KTM 250. ఈ రెండూ కూడా గుంతల రోడ్లను ఆత్మవిశ్వాసంతో హ్యాండిల్ చేస్తాయి.
నియో-రెట్రో బైక్‌లు
స్టైల్ కూడా ముఖ్యం అనుకుంటే, ఈ సెగ్మెంట్‌ను చూడొచ్చు.
Royal Enfield Classic 350 / Bullet 350భారీగా కనిపించే డిజైన్, సౌకర్యమైన రైడింగ్ పొజిషన్ వీటికి పెద్ద ప్లస్. రోజూ ఆఫీస్‌కు, వీకెండ్ రైడ్స్‌కు బాగా సెట్ అవుతాయి.
Honda CB350 సిరీస్‌ఇంజిన్ స్మూత్‌గా ఉంటుంది. కంఫర్ట్ విషయంలో కూడా మంచి పేరు ఉంది. పొడవైన రైడర్లకు సీట్ ఎర్గోనామిక్స్ సరిపోతాయి.
Royal Enfield Interceptor 650కొంచెం పెద్ద బైక్ కావాలంటే ఇది మంచి ఎంపిక. అయితే బాడ్ రోడ్లపై సస్పెన్షన్ పరంగా అడ్వెంచర్ బైక్‌లా ఫీల్ ఇవ్వదు.
స్పోర్టీ నేకడ్ బైక్‌లు
అడ్వెంచర్ లుక్ లేకపోయినా పవర్, ప్రెజెన్స్ కావాలంటే ఇవి చూడొచ్చు.
Royal Enfield Guerrilla 450నేకడ్ స్టైల్‌లో ఉన్నా, రైడింగ్ పొజిషన్ కంఫర్ట్‌గా ఉంటుంది. సిటీ, హైవే రెండింటికీ సరిపోతుంది.
Husqvarna Svartpilen 401డిజైన్ యూనిక్‌గా ఉంటుంది. రైడింగ్ అనుభవం సరదాగా ఉంటుంది. అయితే రోడ్ల పరిస్థితి ఎక్కువగా చెడుగా ఉంటే సస్పెన్షన్ విషయంలో ఒకసారి ఆలోచించాలి.
చివరి మాట
మొదట చెప్పుకున్న అవసరాలను బట్టి, ఆరు అడుగులకు పైగా ఎత్తున్న రైడర్లకు అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్ బెస్ట్ సూట్ అవుతుంది. అయితే, పేపర్‌పై చదివిన దాని కంటే టెస్ట్ రైడ్ చాలా ముఖ్యం. మీరు షార్ట్‌లిస్ట్ చేసిన ప్రతి బైక్‌ను సిటీ ట్రాఫిక్‌లో, బ్యాడ్ రోడ్లపై నడిపి చూసిన తర్వాతే ఫైనల్ నిర్ణయం తీసుకుంటే, తర్వాత ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.