Best Mahindra Cars Under 10 Lakh: భారత్‌లో ఎస్‌యూవీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు మహీంద్రా. ఒకప్పుడు కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ వాహనాలు, నేడు అత్యాధునిక హంగులో సిటీ యువతను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సామాన్యుడి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని పది లక్షల రూపాయల లోపు ధరలో మహీంద్రా ప్రస్తుతం ఐదు రకాల శక్తివంతమైన ఎస్‌యూవీలను అందిస్తోంది. భద్రతలో, టెక్నాలజీలో, మైలేజీలో ఈ వాహనాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ బడ్దెట్‌లో విద్యుత్ వాహనాలు మాత్రం తీసుకురాలేదు మిగతా వేరియంట్లు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

Continues below advertisement

పది లక్షలకు లభించే మహీంద్రా మోడల్స్ ఇవే

ప్రస్తుతం పది లక్షల లోపు లభిస్తున్న కీలక మోడళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ విభాగంలో అత్యంత ఆధునికమైన ఎస్‌యూవీ మహీంద్రా XUV 3XO. దీని ధర 7.54 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో, ఆటోమేటిక్‌, మాన్యువల్‌ గేర్‌ ఆప్షన్లతో లభిస్తుంది. లీటర్‌ 18 నుంచి 21.2 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. 

థార్‌ ఖరీదు ఎంత అంటే?

ఆఫ్‌ రోడింగ్ ప్రియులకు బాగా ఇష్టమైన కారు థార్. ఇది 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు మైలేజీ కూడా 15.2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఏళ్ల నుంచి రోడ్లపై రాజాలా తిరుగుతున్న కారు బొలెరో. ఇది 8 నుంచి 9.90 లక్షల వరకు ఉంటుంది. ఇది ప్రధానంగా డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. 7  సీటర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో మరో వేరియంట్ ఉంటుంది. ఇది బొలెరో నియో. దీని ధర 8.85 నుంచి 10.49 లక్షల వరకు ఉంటుంది. ఇది లీటర్‌ 18 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. 

Continues below advertisement

భద్రత రేటింగ్‌లో తగ్గేదేలే అంటున్న మహీంద్రా

మహీంద్ర తన వాహనాల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ బడెజ్ట్ విభాగంలో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO వంటి మోడళ్లు అత్యున్నతమైన ఫైవ్‌ స్టార్ రేటింగ్ కలిగి ఉన్నాయి.  ధరలో రియర్ వీల్ డ్రైవ్, ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లు అందిస్తున్న ఏకైక కంపెనీ మహీంద్రా. కఠినమైన రహదారులపై కూడా సులభంగా ప్రయాణించేలా వీటి నిర్మాణం ఉంటుంది. ఏబీఎస్‌ సిస్టమ్‌, సెంట్రల్‌ లాకింగ్, వైర‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఇప్పుడు బడ్జెట్‌ ఎస్‌యూవీలో కూడా లభిస్తున్నాయి. 

కొత్తగా వస్తున్న మోడల్ ఇదే 

ప్రస్తుతం ఉన్న మోడల్స్‌తోపాటు త్వరలోనే 10 లక్షల బడ్జెట్‌లో కొత్త మోడల్స్ తీసుకొచ్చేందుకు మహీంద్రా కంపెనీ ప్రయత్నిస్తోంది. 2027లో మహీంద్రా విజన్ అనే కొత్త మోడల్‌ లాంచ్ చేయనుంది. ఇది 7.50 లక్షల నుంచి 13 లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఇది పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిన్‌తో వస్తుందని భావిస్తున్నారు.  ప్యామిలీతోపాటు సెక్యూర్డ్ వెహికల్ కావాలనుకుంటే మాత్రం మీరు ఎస్‌యూవీ 3XO మంచి ఎంపిక అవుతుంది. అడ్వంచర్స్‌, ఆఫ్‌రోడింగ్ ఇష్టమైతే మహీంద్రా థార్ బేస్ వేరియంట్‌ను ట్రై చేయవచ్చు. ఎక్కువ మంది ప్రయాణానికి వీలుగా  కమర్షియల్, రూరల్‌లో తిప్పేందుకు అయితే బొలెరో సిరీస్‌ వైపు మొగ్గు చూపవచ్చు.