Hatchback Cars: భారత్‌లో ఒక కారు కొనాలనుకునే సగటు వినియోగదారుడు మొదట చూసేది బడెజ్ట్‌, మైలేజీ. 15 లక్ష రూపాయల ధరలోపు ప్రస్తుతం మార్కెట్‌లో దాదాపు 20 రకాల రకాల హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం పెట్రోల్‌ మాత్రమే కాకుండా, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా ఈ కార్లు లభిస్తున్నాయి. 

Continues below advertisement

మార్కెట్‌లో టాప్ మోడల్స్ ఇవే 

ప్రస్తుతం 15 లక్షల లోపు బడ్జెట్‌లో అమ్ముడవుతున్న కొన్ని మోడల్స్ గురించి ఇక్కడ చూద్దాం. 

మారుతి సుజుకీ స్విఫ్ట్

దీని ధర 5.79 లక్షల నుంచి ప్రారంభమై 8.65 లక్షల వరకు ఉంటుంది. ఇది లీటరుకు గరిష్టంగా 32.9 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ వినియోగదారుల ఫేవరెట్‌గా నిలుస్తుంది. 

Continues below advertisement

టాటా ఆల్ట్రోజ్‌ 

భద్రతకు పెద్ద పీట వేసే వారు ఆల్ట్రోజ్‌ను ఎంచుకుంటున్నారు. దీని ధర 6.30 లక్షల నుంచి 10.51 లక్షళ వరకు ఉంది. ఇది పెట్రోల్, సీఎన్జీ, డీజిల్ వేరియంట్లలో లభించడం దీని ప్రత్యేకత. 

హ్యూందాయ్‌ ఐ 20 

ప్రీమియం ఫీచర్ల కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. 5.99 లక్షల నుంచి 11.53 లక్షల ధరలో 17 వేరియంట్‌లలో ఇది అందుబాటులో ఉంది. 

టయోటా గ్లాంజా 

రూ. 6.46 లక్షల నుంచి 9.44 లక్షల ధఱతో లభిస్తున్న ఈ కారు 22.4 నుంచి 30.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 

ఎలక్ట్రిక్ విప్లవం

పర్యావరణంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లవైపు జనం మొగ్గుతున్నారు. టాటా టియాగో ఈవీ 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 223 నుంచి 293 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అలాగే ఎంజీ కామెట్‌ సిట్రోయెన్ ఈసీ3 కూడా ఈ బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. 

హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎందుకు ఎంచుకోవాలి?

మారుతి సెలెరియో వంటి కార్లు లీటర్‌కు 34.4 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తున్నాయి. చమురు ధరల పెరుగుతున్న తరుణంలో ఇది సామాన్యుడికి పెద్ద ఊరట. నేటి హ్యాచ్ బ్యాక్‌ కార్లు కేవలం బడ్జెట్‌కే పరిమితం కాకుండా 360 డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్ ఆరు ఎయిర్‌బ్యాక్‌లు వంటి ఆధునిక ఫీచర్లతో వస్తున్నాయి. గ్లోబల్‌ ఎన్‌క్యాప్ రేటింగ్‌లలో ఫైవ్‌ స్టార్ రేటింగ్ సాధఇంచిన కార్లు కూడా ఈ విభాగంలో ఉన్నాయి. ఇవి ప్రయాణికుల భద్రతకు హామీ ఇస్తున్నాయి. 

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడల్స్ కాకుండా, భవిష్యత్‌లో మరిన్ని కొత్త కార్లు రాబోతున్నాయి. లీప్‌మోటర్‌ టీ03 2027లో, టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ 2026 చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది. మీరు మరింత ఆధునిక సాంకేతికత కోసం వేచి చూడాలనుకుంటే మంచి ఆప్షన్లు. 

భారత్‌లో పట్టణీకరణ వేగంగా జరుగుతుంది. ఇరుకైన ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ స్థలం కోరత కారణంగా ఎస్‌యూవీల వహా నడుస్తున్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ కార్ల ప్రాధాన్యత తగ్గలేదు. ముఖ్యంగా మొదటిసారి కారు కొనేవారికి, చిన్న కుటుంబాలకు ఇవి ఆర్థికంగా కూడా భారంగా ఉండవు.