Best Automatic And ADAS Featured Compact SUVs Under 15 Lakh: మొదటిసారి మంచి కారు కొనాలనుకుంటున్నవారికి ఇప్పుడు మార్కెట్లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ బెస్ట్ చాయిస్‌గా మారింది. రోడ్డుపై డ్రైవింగ్ కంఫర్ట్, సౌకర్యవంతమైన సిట్టింగ్ పొజిషన్, అలాగే సేఫ్టీ ఫీచర్లతో కాంపాక్ట్ SUVలు యూత్‌కి ఆకర్షణగా మారాయి. రూ. 15 లక్షల బడ్జెట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ & ADAS ఫీచర్లతో ఉన్న కొన్ని మోడల్స్ ఫస్ట్ టైమ్ బయ్యర్స్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్స్‌గా ఉన్నాయి.
Kia Sonet - స్టైల్ & టెక్నాలజీ కలయిక Kia Sonet ఇప్పటికే యువతలో పాపులర్. దీని ఇంటీరియర్ క్వాలిటీ, ఇంజిన్ స్మూత్‌నెస్ & ఫీచర్స్ ఈ క్లాస్‌లో బెస్ట్. బ్లాక్ కలర్ డాష్‌బోర్డ్, 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్, వెంట్‌లేటెడ్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు లగ్జరీ ఫీల్ ఇస్తాయి. ఆటోమేటిక్ వెర్షన్ల ఎక్స్-షోరూమ్ ధర హైదరాబాద్ & విజయవాడలో రూ. 11.59 లక్షల నుంచి (Kia Sonet Automatic ex-showroom price, Hyderabad Vijayawada) మొదలవుతుంది. రిజిస్ట్రేషన్, బీమా, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుని ఆన్-రోడ్ ధర రూ. 14.38 లక్షల నుంచి (Kia Sonet Automatic on-road price, Hyderabad Vijayawada) ప్రారంభమవుతుంది, స్పెసిఫేకన్లను బట్టి రేటు మారుతుంది.
ఈ కారులోని ADAS ఫీచర్లు - ఫార్వర్డ్ కాలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్టు, డ్రైవర్ అటెన్షన్ మానిటర్, ఇంకా మరికొన్ని అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఆప్షన్స్ ఉన్నాయి. వీటివల్ల లాంగ్ డ్రైవ్‌లో కూడా మీరు సురక్షితంగా గమ్యం చేరగలరన్న నమ్మకం కలుగుతుంది.
Hyundai Venue - వెయిట్ చేయదగ్గ SUV Hyundai Venue కొత్త వెర్షన్ మరికొన్ని వారాల్లో లాంచ్ అవ్వబోతోంది. ఇందులో కొత్త డిజైన్‌తో పాటు మెరుగైన ADAS ప్యాకేజ్ కూడా అందించనున్నారని అంచనా. హ్యుందాయ్ ఇంజిన్లు ఎప్పుడూ స్మూత్‌గా, నాయిస్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ టైమ్ యూజర్లకి కంఫర్ట్‌గా ఉంటుంది. కొత్త Venue లో 1.0 టర్బో పెట్రోల్ & 1.2 లీటర్ ఇంజిన్ ఆప్షన్స్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ ఆప్షన్స్ కూడా పరిశీలించవచ్చు కియా సోనెట్ & హ్యుందాయ్ వెన్యూ కాకుండా Maruti Fronx, Tata Nexon AMT, Mahindra XUV300 వంటి SUVలు కూడా ఈ బడ్జెట్‌లో కంఫర్ట్ & సేఫ్టీ కలిపిన ఆప్షన్స్‌గా ఉన్నాయి. ముఖ్యంగా Nexonలో 6 ఎయిర్ బ్యాగ్స్, ESP వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఫస్ట్‌టైమ్ కార్ కొనుగోలు చేస్తున్న వాళ్లు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్న SUV ఎంచుకోవడం చాలా స్మార్ట్ ఆప్షన్. డ్రైవింగ్ సులభంగా ఉండటంతో పాటు ADAS ఫీచర్లు అదనపు సేఫ్టీని ఇస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో Kia Sonet పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ కారు. అయితే, మరికొన్ని వారాల్లో రాబోయే Hyundai Venue కూడా స్మార్ట్ బయ్యర్స్ వెయిట్ చేయదగ్గ SUVగా చెప్పవచ్చు.