Cars Under Rs 20 Lakh: భారతదేశంలో బడ్జెట్ కార్లు కొనుగోలు చేయాలని చూసేవారు ప్రస్తుతం తమ బడ్జెట్లను పెంచుతున్నారు. రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ధరలు బేసిక్ కారు కంటే మెరుగైన కారును కొనుగోలు చేయడమే కాకుండా లగ్జరీ కారు అనే అనుభూతిని కలిగిస్తాయి. మీ బడ్జెట్‌లో రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్యలో భారతీయ మార్కెట్‌లో బాగా అమ్ముడవుతున్న కొన్ని బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.


హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
హ్యుందాయ్ క్రెటా దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ విక్రయిస్తున్న బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటి. హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి ఎక్కువగా అమ్ముడవుతున్న కొన్ని హ్యుందాయ్ ఎస్‌యూవీలను దాటేయడం ద్వారా ఇది అత్యధికంగా అమ్ముడైన కారుగా మారింది. గత నెలలో కంపెనీ 15,000 కంటే ఎక్కువ క్రెటా వాహనాలను విక్రయించింది. వాహనం కొత్త మోడల్ ప్రీమియం ఎస్‌యూవీలాగా ఉంటుంది. ఇది స్పోర్టినెస్ అనుభూతిని ఇస్తుంది. అలాగే భారతదేశంలో ప్రారంభించిన కొత్త మోడల్‌లో, క్రెటా శక్తివంతమైన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఏడీఏఎస్‌తో వస్తుంది.


మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)
మారుతి గ్రాండ్ విటారా అనేది మారుతి కంపెనీకి చెందిన ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ కారు. గ్రాండ్ విటారాను ప్రారంభించిన తక్కువ సమయంలోనే కంపెనీ భారీ విక్రయాలను సాధించింది. ఈ కారు మైల్డ్ హైబ్రిడ్, పూర్తి హైబ్రిడ్ ఆటోమేటిక్ ఆప్షన్లతో వస్తుంది. కంపెనీ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లను కూడా విక్రయిస్తుంది. పోటీ పరంగా గ్రాండ్ విటారా ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన హైబ్రిడ్ వాహనంగా ఎదుగుతోంది.


మహీంద్రా స్కార్పియో (స్కార్పియో ఎన్) (Mahindra Scorpio N)
స్కార్పియో పేరు ఎవరికి తెలియదు? ఇది మహీంద్రా కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఇటీవల విడుదలైన స్కార్పియో ఎన్ ఇప్పటికే ఉన్న బ్రాండ్‌ను కొత్త లెవల్‌కు తీసుకెళ్లింది. మునుపటి మహీంద్రా స్కార్పియో ఆకర్షణ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, కొత్త స్కార్పియో ఎస్‌యూవీని కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. స్కార్పియో ఎన్ ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 2 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌లతో వస్తుంది.


టయోటా ఇన్నోవా (Toyota Innova Crysta)
టొయోటా ఇన్నోవా... స్కార్పియో అంత పాపులర్. ఇది లాంచ్ అయిన మొదటి రోజు నుంచి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీల్లో ఒకటి. ఇంతకుముందు క్రిస్టా వేరియంట్‌లో వచ్చిన ఇన్నోవా, కంపెనీ అత్యధికంగా విక్రయించిన వాహనాల్లో ఒకటి. అయితే ఇన్నోవా కొత్త హైక్రాస్ మోడల్ కంపెనీని విద్యుదీకరణ దిశలో తీసుకువెళుతుంది. టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన ఉత్తమ ఎంపీవీల్లో ఒకటిగా మిగిలిపోయింది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?