Affordable Budget Cars Under 5 Lakhs: మీ బడ్జెట్ దాదాపు రూ. 5 లక్షలు ఉండి, రోజూ అప్‌&డౌన్‌ చేయడానికి కొత్త కారు కొనాలనుకుంటే, మీకో గుడ్‌న్యూస్‌. తెలుగు రాష్ట్రాల్లోకి ఖరీదైన కార్లు వస్తున్నప్పటికీ, ఇప్పటికీ చాలా చిన్న కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి, తక్కువ ధరకే మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్లు & నమ్మకమైన పనితీరును అందిస్తాయి. ముఖ్యంగా, మధ్య తరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్లను ప్రత్యేకంగా రూపొందించారు.

రోజూ ఆఫీసుకి వెళ్ళడానికి 5 బడ్జెట్‌ ఫ్రెండ్లీ కార్లు

మారుతి సుజుకి ఆల్టో K10Maruti Suzuki Alto K10 దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన & అన్ని కాలాలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.23 లక్షలు. దేశంలో అత్యంత చౌకైన కార్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఈ కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఉంది, ఇది మంచి పికప్‌ను అందించడమే కాకుండా మైలేజ్ పరంగా కూడా బాగా పని చేస్తుంది. 

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోసైజ్‌లో చిన్నగా ఉన్నప్పటికీ మినీ SUV లాగా కనిపించే కారు కోసం చూస్తున్నట్లయితే, Maruti Suzuki S-Presso మీకు బెటర్‌ ఆప్షన్‌ అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ఈ కారు ప్రారంభ ధర రూ. 4.26 లక్షలు. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ముఖ్యంగా, కాంపాక్ట్ సైజుతో అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కోరుకునే వారికి ఈ కారు బాగా వర్కవుట్‌ అవుతుంది.

రెనాల్ట్ క్విడ్భారతదేశంలో స్టైలిష్ & బడ్జెట్ కార్ల మధ్య అంతరాన్ని పూరించిన హ్యాచ్‌బ్యాక్ Renault Kwid. హైదరాబాద్‌ & విజయవాడలో రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షలు. ఆకర్షణీయమైన బాహ్య రూపంతో పాటు, కారు లోపల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్ & 8-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి మోడ్రన్‌ ఫీచర్లు ఈ కారు సొగసైన కారు సొంతం. ఇది కూడా 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది, ఇది మంచి పవర్ & మైలేజీని ఇస్తుంది. తక్కువ బడ్జెట్‌లోనే ఫీచర్-లోడెడ్ కారు కోసం చూస్తున్న వారికి క్విడ్ మంచి ఎంపిక.

మారుతి సుజుకి సెలెరియోతెలుగు నగరాల్లో Maruti Suzuki Celerio ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 5 లక్షల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే, దీని అద్భుతమైన మైలేజ్ & CNG ఆప్షన్‌ కారణంగా సెలెరియో ఇప్పటికీ అత్యంత చవక ఎంపికలలో ఒకటిగా నిలుస్తుంది. రోజులో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి & ఇంధన ఖర్చుల్లో పొదుపు చేయాలనుకునే వారికి ఈ కారు చక్కగా సహకరిస్తుంది. ఈ కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది. దీనితో పాటు CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది అద్భుతమైన మైలేజీని ఇస్తుంది.

టాటా టియాగోఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో Tata Tiago ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షలు. ఈ బడ్జెట్‌లో, 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న ఏకైక కారు ఇదే. Tiago లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఇచ్చారు. దీని నిర్మాణ నాణ్యత, డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్‌లు, ABS వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ విభాగంలో దీనిని విభిన్నంగా నిలబెట్టాయి.