Projector Headlight Bikes Under Rs 1.5 Lakhs: భారత బైక్‌ మార్కెట్లో ప్రోజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌ ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారాయి. ఒకప్పుడు ఈ ఫీచర్‌ కేవలం లగ్జరీ బైక్‌లలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు రూ.1.5 లక్షల బడ్జెట్‌లోనే ప్రోజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌తో మంచి లుక్‌, బెస్ట్‌ నైట్‌ విజిబిలిటీ ఇచ్చే బైక్‌లు ఎన్ని వచ్చేస్తున్నాయి. తెలుగువారికి ప్రస్తుతం మార్కెట్లో దొరికే బెస్ట్‌ 7 ఆప్షన్‌లు ఇవి.

Continues below advertisement

7. TVS Apache RTR 160 4V

ధర: రూ.1.16 లక్షలు - రూ.1.36 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

Continues below advertisement

TVS అపాచీ 20 ఏళ్ల సెలబ్రేషన్‌లో కంపెనీ RTR 160 4Vకి కొత్త మోనో-ప్రోజెక్టర్‌ LED హెడ్‌ల్యాంప్స్‌ ఇచ్చింది. కింద వైపు డ్యూయల్‌ DRLs‌తో కలిపి వచ్చే ఈ హెడ్‌ల్యాంప్‌ సెటప్‌, ఇప్పుడు రాబోయే అన్ని అపాచీలకు సిగ్నేచర్‌ లుక్‌ అవుతుందని TVS చెబుతోంది. లుక్‌, పనితీరు కలయిక కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌.

6. Bajaj Pulsar N250

ధర: రూ.1.33 లక్షలు

ఈ లిస్టులో ఉన్న ఏకైక 250cc బైక్‌ N250. దీంట్లో మోనో LED ప్రోజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌ ఉంటే, DRLs మాత్రం హెడ్‌ల్యాంప్‌ పైన ఉంటాయి. ఈ డిజైన్‌ యమహా MT-15ను కొంచెం గుర్తు చేస్తుంది. పవర్‌, స్టైల్‌ కావాలనుకునే యువత ఎక్కువగా చూసే బైక్‌ ఇదే.

5. Yamaha FZ-X

ధర: రూ.1.19 లక్షలు -  రూ.1.30 లక్షలు

యమహా FZ లైనప్‌లో స్టైలింగ్‌ విషయంలో పూర్తి భిన్నంగా కనిపించే మోడల్‌ FZ-X. ముందున్న రౌండ్‌ LED మోనో-ప్రోజెక్టర్‌ లుక్కే దీని అట్రాక్షన్‌ పాయింట్‌. DRL పూర్తిగా ప్రోజెక్టర్‌ను చుట్టేసి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇటీవల వచ్చిన హైబ్రిడ్‌ వెర్షన్‌లో ISG టెక్నాలజీ కూడా ఉంటుంది, ఇది ఐడిల్‌ సమయంలో ఇంజిన్‌ను ఆఫ్‌ చేసి, మళ్లీ క్లచ్‌ నొక్కగానే రీస్టార్ట్‌ అవుతుంది.

4. Bajaj Pulsar 220F

ధర: రూ.1.27 లక్షలు

పల్సర్‌ 220F భారత మార్కెట్లో మొదటి ప్రోజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌ బైక్‌లలో ఒకటి. దీని వయస్సు ఎక్కువైనా, ఫ్యాన్స్‌ బేస్‌ మాత్రం భారీగా ఉంటుంది. ఈ లిస్టులో హాలోజన్‌ ప్రోజెక్టర్‌ ఉన్న ఏకైక మోడల్‌ ఇదే. నైట్‌ రైడింగ్‌లో దీనికి ప్రత్యేకమైన విజిబిలిటీ ఉంటుంది.

3. Yamaha FZ Rave

ధర: రూ.1.17 లక్షలు

ఇటీవల వచ్చిన FZ Rave లైనప్‌లో కొత్త మెంబర్‌. 149cc ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో 12.4hp పవర్‌, 13.3Nm టార్క్‌ ఇస్తుంది. కొత్త LED హెడ్‌ల్యాంప్‌ డిజైన్‌, ఎరుపు కలర్‌ వీల్స్‌, రెండు కొత్త కలర్స్‌ (బ్లాక్‌, మ్యాట్‌ గ్రీన్‌) వంటివన్నీ యువతను ఆకట్టుకుంటాయి.

2. Bajaj Pulsar N160

ధర: రూ.1.13 లక్షలు - రూ.1.26 లక్షలు

బజాజ్‌ లైనప్‌లో LED ప్రోజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌ వచ్చే చిన్న బైక్‌ ఇదే. దీని ఫ్రంట్‌ డిజైన్‌ N250తో పూర్తిగా ఒకేలా ఉంటుంది. ఇటీవల దీంట్లో USD ఫోర్క్‌ కూడా జోడించడం దీన్ని మరింత అట్రాక్టివ్‌గా మార్చింది.

1. Hero Xtreme 125R

ధర: రూ.89,000 - రూ.1.04 లక్షలు

ఈ లిస్టులో కేవలం రూ.89,000 నుంచే లభించే అత్యంత చవక బైక్‌ Xtreme 125R. ఇందులో రెండు ప్రోజెక్టర్‌ యూనిట్స్‌ లో-బీమ్‌లో పని చేస్తాయి. హై-బీమ్‌ కోసం రెండు LED రిఫ్లెక్టర్స్‌ వేరుగా ఉన్నాయి. ఇటీవల డ్యూయల్‌ ఛానెల్‌ ABSతో కొత్త వెర్షన్‌ కూడా వచ్చింది.

ప్రోజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌ ఇప్పుడు కేవలం స్టైల్‌ కోసం కాదు, నైట్‌ రైడ్‌లో నిజంగా ఉపయోగపడే ఫీచర్‌. బడ్జెట్‌లో మంచి విజిబిలిటీ, మంచి లుక్‌, మంచి పనితీరు అన్నీ ఉన్న బైక్‌ కావాలంటే ఈ 7 మోడల్స్‌ మీకు సరైన ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.