Best Bikes For Beginner Riders: మనం బైక్ నేర్చుకునే దశలో ఉపయోగించే బైక్‌లు మనపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. తర్వాతి కాలంలో మన బైక్ నడిపే సామర్థ్యాన్ని అవే నిర్దేశిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్షన్లన్నీ పరిగణనలోకి తీసుకుని మీ మోటార్ సైక్లింగ్ స్కిల్స్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే బైక్‌లు కొన్ని లిస్ట్ చేశాం. ఇందులో హీరో మోటోకార్ప్, కేటీయం, టీవీఎస్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ల బైకులు కూడా ఉన్నాయి.


కేటీయం 200 డ్యూక్
ఈ బైక్ లాంచ్ అయిన దగ్గర నుంచి మనదేశంలో యూత్‌కు మంచి ఆప్షన్‌గా ఉంది. మిమ్మల్ని మోటార్ సైక్లింగ్ ఆల్‌రౌండర్‌గా మార్చే సామర్థ్యం దీనికి ఉంది. రోడ్డు ఎలా ఉన్నా కూడా దీని మీద సాఫీగా ప్రయాణం చేయవచ్చు. ఈ బైక్ మిమ్మల్ని డైనమిక్ మోటార్ సైక్లిస్ట్‌గా మార్చగలదు.


హీరో ఎక్స్‌పల్స్ 200
హీరో లైనప్‌లో ఎక్కువ మంది మోటార్ సైక్లిస్ట్‌లు ఉపయోగించే బైక్ ఎక్స్‌పల్స్ 200నే. దీని బరువు కూడా తక్కువే కాబట్టి మట్టిలో కూడా సులభంగా డ్రైవ్ చేయవచ్చు. ఆఫ్ రోడింగ్, అడ్వంచరస్ మోటార్ సైక్లింగ్‌కి ఇది పర్‌ఫెక్ట్‌గా ఉపయోగపడుతుంది.


కేటీయం ఆర్సీ390
ఈ బైక్‌ను ఎంత పెద్ద ట్రాక్‌ల మీద అయినా సులభంగా నడవపచ్చు. కాబట్టి ఆర్సీ200, ఆర్సీ125 వంటి బైకులను సైతం వెనక్కి నెట్టి ఈ లిస్టులో కేటీయం ఆర్సీ390 చోటు దక్కించుకుంది. మలుపు ఎంత షార్ప్‌గా ఉన్నా దీంతో సులభంగా టర్న్ చేయవచ్చు. స్ట్రీట్‌ అయినా, ట్రాక్ అయినా ఆర్సీ390తో సులభంగా డ్రైవ్ చేయవచ్చు.


రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్
మీరు అడ్వంచర్, టూరింగ్ ఎక్కువగా చేసేటట్లయితే మీకు ఇది పర్ఫెక్ట్ బైక్. లాంగ్ డిస్టెన్స్ టూరింగ్, ఆఫ్ రోడింగ్ వంటి వాటికి ఇది సరిగ్గా సరిపోతుంది. అయితే దీని బరువు కూడా కొంచెం ఎక్కువే. కానీ హైవేస్, అడ్వంచర్ రైడింగ్, సిటీ రైడింగ్ మొత్తానికి ఇది సరిపోతుంది.


యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వీ4
ప్రస్తుతం మనదేశ మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ మోటార్ బైక్స్‌లో యమహా ఆర్15 కూడా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలు యమహా దీన్ని బెటర్ చేస్తూనే ఉంది. టైమ్‌కు తగ్గట్లు అప్‌డేట్ చేస్తూనే ఉంది. కేటీయం ఆర్సీ390 ఖరీదు ఎక్కువ అనుకునేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది.


దేశీయ మార్కెట్లో 100 సీసీ సెగ్మెంట్ బైక్‌లు అత్యధికంగా అమ్ముడు అవుతున్నాయి. హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా ఈ సెగ్మెంట్‌లో ముందంజలో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే బైక్‌లు ఇవే. కాబట్టి ఈ విభాగంలో హోండా షైన్, స్ప్లెండర్, బజాజ్ ప్లాటినాకు గట్టి పోటీనిస్తుంది. ఇప్పుడు హోండా షైన్‌లో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. హోండా తన కొత్త బైక్‌లో 768 ఎంఎం సీటు, సైడ్ స్టాండ్‌తో ఇన్హిబిటర్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన ఈక్వలైజర్, పీజీఎమ్-ఎఫ్‌ఐ టెక్నాలజీతో 168 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లను అందించనుంది. కంపెనీ హోండా షైన్ 100 సీసీ బైక్‌ను రూ.64,900 ఎక్స్-షోరూమ్ ధరతో పరిచయం చేసింది.