Best Automatic Cars Under Rs 9 Lakhs: ఫస్ట్ టైమ్ కారు కొనుగోలు అనేది జీవితంలో ఒక ప్రత్యేక అనుభవం. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తర్వాత కారు కొనాలనుకునే వారు కంఫర్ట్, సేఫ్టీ, స్మూత్ డ్రైవింగ్‌ను ప్రధానంగా చూస్తారు. 50 ప్లస్ ఏజ్‌లో ఉన్నవాళ్లకు, ₹9 లక్షల నుంచి ₹11 లక్షల మధ్య బడ్జెట్‌లో, ప్రధానంగా సిటీ డ్రైవ్ & ఎప్పుడైనా ఒకసారి హైవే ట్రిప్ కోసం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 4-సిలిండర్ ఇంజిన్ కావాలంటే - ఇప్పుడు మార్కెట్లో కొన్ని అద్భుతమైన ఆప్షన్లు ఉన్నాయి.
1. మారుతి సుజుకీ బాలెనో (Maruti Suzuki Baleno)
50 ఏళ్లు దాటిన ఫస్ట్ టైమ్ కార్ బయ్యర్ కోసం మొదటగా చెప్పుకోవాల్సింది బాలెనో గురించి. ఇది ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. 1.2 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్‌లో AMT గేర్‌బాక్స్ ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపవచ్చు.
సేఫ్టీ పరంగా బాలెనోలో 6 ఎయిర్ బ్యాగ్స్, ESP, ABS & 4-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ ఉన్నాయి. కంఫర్ట్ సీటింగ్, విస్తృతమైన లెగ్‌రూమ్, స్మూత్ డ్రైవ్ అనుభవం ఈ కార్ ప్రత్యేకతలు. హైదరాబాద్ & విజయవాడలో ఈ కారు ఆటోమేటిక్ వేరియంట్ ధరలు ₹7.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.
2. మారుతి సుజుకీ ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
SUV తరహాలో ఉండే కాంపాక్ట్ కారు కావాలంటే ఫ్రాంక్స్ మంచి ఎంపిక. ఇది కూడా బాలెనోలో ఉన్న అదే 1.2 లీటర్ 4-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్‌లో గేర్ షిఫ్ట్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఫ్రాంక్స్‌లో హై సీట్ పొజిషన్, పెద్ద బూట్ స్పేస్, రివర్స్ కెమెరా, హిల్-హోల్డ్ అసిస్టు, ESP వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇది సిటీ డ్రైవింగ్‌కి, అలాగే అప్పుడప్పుడు హైవేలపై లాంగ్ డ్రైవ్‌లకు కూడా సరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫోర్‌వీలర్ ఆటోమేటిక్ వేరియంట్ ధరలు ₹8.15 లక్షల (ఎక్స్-షోరూమ్) దగ్గర నుంచి స్టార్ అవుతాయి.
3. టయోటా గ్లాంజా (Toyota Glanza) & టయోటా టైసర్ (Toyota Taisor)
మీకు టయోటా బ్రాండ్ అంటే ఇష్టం అయితే - బాలెనోకు సమానమైన గ్లాంజా, అలాగే ఫ్రాంక్స్‌కు సమానమైన టైసర్‌ను పరిశీలించొచ్చు. ఇవి కూడా అదే 4-సిలిండర్ ఇంజిన్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. టయోటా వారంటీ & ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ చాలా విశ్వసనీయంగా ఉంటుంది, అందుకే మెయింటెనెన్స్ పరంగా కూడా నమ్మకంగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో టయోటా గ్లాంజా ఆటోమేటిక్ వేరియంట్ ధరలు ₹7.74 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి & టయోటా టైసర్ ఆటోమేటిక్ వేరియంట్ ధరలు ₹8.53 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ అవుతాయి.
సేఫ్టీ & కంఫర్ట్ ప్రధానంగా చూడాలి
50+ వయస్సు, కారును ఉపయోగించే విధానం దృష్ట్యా సురక్షితమైన, సులభంగా నడిపే కారు ఉత్తమం. 4-సిలిండర్ ఇంజిన్ స్మూత్‌గా పని చేస్తుంది, గేర్ షిఫ్ట్ మృదువుగా ఉంటుంది. కాబట్టి, ₹9 లక్షల బడ్జెట్‌లో సురక్షితమైన, ఆటోమేటిక్, స్మూత్ డ్రైవింగ్ కోరుకునే ఫస్ట్‌టైమ్ బయ్యర్లకు Maruti Baleno లేదా Maruti Fronx (లేదా వాటి టయోటా వెర్షన్లు Glanza, Taisor) ఉత్తమ ఎంపికలు. ఇవి సిటీ డ్రైవింగ్‌కి సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా, అప్పుడప్పుడు చేసే లాంగ్ ట్రిప్‌లకు కూడా సరిపోతాయి.
సిటీ డ్రైవింగ్ & మైలేజ్ ప్రధానంగా చూస్తే - Maruti Baleno / Toyota Glanza
SUV లుక్ & కంఫర్ట్ కావాలంటే - Maruti Fronx / Toyota Taisor
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.