Best Automatic Cars Under 5 Lakh India: నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా మాన్యువల్ గేర్లు మార్చడం వాహనదారులకు పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా బడ్జెట్ పరిమితులు ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆటోమేటిక్ కారు అనేది ఒకప్పుడు కలగా ఉండేది. కానీ నేడు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో తక్కువ ధరలోనే క్లచ్‌లేని ప్రయాణం సాధ్యమవుతోంది. ప్రస్తుతం భారత్లో ఐదు లక్షల రూపాయల లోపు ప్రారంభ ధరతో ఆరు ఆటోమేటిక్ కార్లు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. ఇవన్నీ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు కావడం వల్ల నగరాల్లోని ఇరుకైన వీధుల్లో నడపడానికి, పార్కింగ్ చేయడానికి ఎంతో అనువుగా ఉంటాయి.
మారుతి సుజుకి హవా
ప్రస్తుతం ఈ బడ్జెట్ విభాగంలో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అందుబాటులో ఉన్న ఆరు మోడళ్లలో నాలుగు కేవలం మారుతి సంస్థ నుంచే ఉన్నాయి. ఇవి పెట్రోల్, సీఎన్జీ ఇంధన ఆప్షన్స్‌తో వస్తున్నాయి.
మారుతి సుజుకి ప్రెసో
అత్యంత చౌకైన ఆప్షన్. దీని ధర మూడున్నర లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ విభాగంలో టాప్ ఎండ ర 5.25 లక్షలే. ఇది లీటర్‌కు 21. 4 నుంచి 32. 7 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది.
మారుతి సుజుకి ఆల్టో కే 10
ఇది మధ్యతరగతి ప్రజలకు అతి చేరువైన కారు. దీని ధర 3.70 నుంచి 5.45 లక్షల మధ్య ఉంది. భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే వారి కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేశారు. ఇది లీటరకు గరిష్టంగా 33.9 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
రెనాల్ట్ క్విడ్
స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఈ కారు మంచి ఆప్షన్ దీని ధర 4.30 లక్షల నుంచి 5.85 లక్షల వరకు ఉంది. మారుతి కార్లకు గట్టి పోటీ ఇచ్చే ఈ కారు కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ విభాగంలో రివర్స్ కెమెరా ఫీచర్ ఉన్న ఏకైక కారు.
టాటా టియాగో
ఇది కూడా 4.57 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాటా నుంచి వచ్చిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 19.8 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ వేరియంట్‌లలో లభిస్తుంది.
మారుతి సుజుకి సెలెరియో
మైలేజీలో రారాజుగా దీన్ని పిలుస్తారు. లీటర్‌కు 34. 4 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ విభాగంలో టాప్‌లో ఉన్న కారు. దీనికి 3 స్టార్ రేటింగ్ లభిస్తుంది. ఆరు ఎయిర్ బ్యాగ్లు, ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
విశాలమైన కారు. దీని ధర 4.99 లక్షల నుంచి 6.84 లక్షల వరకు లభిస్తుంది. ఇది ఆరు ఎయిర్ బ్యాగ్‌లతోపాటు 33.5కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.
ఈ బడ్జెట్ కార్లు కేవలం తక్కువ ధరకే పరిమితం కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ కూడా కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. భద్రత కోసం ఏబీఎస్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్‌లు అన్ని మోడల్స్‌లో లభిస్తున్నాయి. ఈ కార్లు సాధారణంగా వెయ్యి సీసీ లోపు సామర్థ్యం గల ఇంజన్లతో వస్తాయి. నగర ప్రయాణాలకు సరిపోతాయి.
నగరాల్లో ట్రాఫిక్ కారణంగా నిరంతరం క్లచ్ వాడటం వల్ల డ్రైవర్లకు మోకాళ్ల నొప్పులు, అలసట రావడం సహజం. ఆటోమేటిక్ కార్లు ఈ ఇబ్బందిని తొలగిస్తాయి. కేవలం ఐదు లక్షల ప్రారంభ బడ్జెట్‌తోనే లగ్జరీ కార్ల వంటి టూ పెడల్ డ్రైవింగ్ అనుభూతిని పొందడం ఈ విభాగానికి ఉన్న అతి పెద్ద బలం.
మీరు తక్కువ ధర లో కారు కావాలనుకుంటే ఎస్ ప్రెస్సో, అత్యధిక మైలేజీ కావాలనుకుంటే సెలెరియో, స్టైలిష్ డిజైన్‌తో పాటు రివర్స్ కెమెరా వంటి ఫీచర్లు కావాలనుకుంటే క్విడ్ సరైన ఆప్షన్. ప్రయాణం సౌకర్యవంతంగా ఎక్కువ స్థలం కావాలనుకుంటే వ్యాగన్ ఆర్ వైపు మొగ్గు చూపవచ్చు.
