Best Affordable Automatic SUVs 2025: భారతదేశంలో ఇప్పుడు SUV ట్రెండ్‌ నడుస్తోంది. కారు కొనేవాళ్లు మొదట SUV గురించే ఆలోచిస్తున్నారు, వాటిలోనూ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా, సులభంగా డ్రైవ్‌ చేయడానికి ఆటోమేటిక్ కార్లు చక్కగా ఉపయోగపడుతున్నాయి. మీ బడ్జెట్ రూ. 10 లక్షల వరకు ఉంటే, మీరు రోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, ఫీచర్లు & పనితీరులో కూడా మెరుగ్గా ఉండే SUV మోడళ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Nissan Magniteనిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో అత్యంత చవకైన ఆటోమేటిక్ SUV. తెలుగు రాష్ట్రాల్లో దీని ఆటోమేటిక్ వేరియంట్‌ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.75 లక్షలు. Visia AMT వేరియంట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, 72 bhp శక్తిని & 96 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఇది 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో అనుసంధానమై ఉంటుంది. మాగ్నైట్ డిజైన్‌ స్టైలిష్‌గా ఉంటుంది & ప్రాక్టికల్ క్యాబిన్‌తో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సంపాదించింది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, రివర్స్ పార్కింగ్ కెమెరా & పుష్-బటన్ స్టార్ట్ వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. కంపెనీ, నిస్సాన్ మాగ్నైట్‌ను ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అందిస్తోంది.

Renault Kigerరెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ ప్లాట్‌ఫామ్‌ మీదే తయారైంది & దీని ఆటోమేటిక్ వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 7.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). Emotion AMT వేరియంట్‌లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 72 bhp పవర్ & 96 Nm టార్క్ ఇస్తుంది. దీనికి 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఉంది. కిగర్ డిజైన్ బోల్డ్‌గా & మోడ్రన్‌గా ఉంటుంది. LED హెడ్‌ల్యాంప్‌లు, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లతో కూడిన కారును కోరుకునే వారికి ఈ SUV సరైనది.

Tata Punchటాటా పంచ్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.77 లక్షలు. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడి ఉంది, ఇది 86 bhp పవర్ & 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో స్మూత్‌గా పని చేస్తుంది. పంచ్ డిజైన్ రగ్డ్‌ & స్పోర్టీగా ఉంటుంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ & రఫ్-టఫ్ లుక్స్‌లో కనిపిస్తుంది. దీని టాప్ వేరియంట్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్ & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, దీనికి రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉన్నాయి, ఇది భద్రత పరంగా కొంచెం తక్కువ.

Hyundai Exterమైక్రో SUV విభాగంలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక పాపులర్‌ వెహికల్‌. దీని AMT వేరియంట్ ధర రూ. 8.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది, ఇది 83 bhp పవర్‌ & 114 Nm టార్క్‌ ఇస్తుంది. ఎక్స్‌టర్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగులు, LED హెడ్‌ల్యాంప్‌లు & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని మైలేజ్ లీటరుకు దాదాపు 19.2 కిలోమీటర్లు.

Maruti Suzuki Fronxమారుతి సుజుకి ఫ్రాంక్స్ ఒక స్టైలిష్ క్రాస్ఓవర్ SUV. దీని AMT వేరియంట్ ధర రూ. 8.95 లక్షల నుంచి మొదవుతుంది. ఇది కూడా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఈ ఇంజిన్‌ 90 bhp శక్తిని & 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & LED లైటింగ్ వంటి మోడ్రన్‌ ఫీచర్లు దీని సొంతం. ఇది టయోటా అర్బన్ క్రూయిజర్ టేజర్ కంటే దాదాపు రూ. 40,000 చవకగా వస్తుంది.