Best City Cars For Hyderabad Vijayawada: నగరాల్లో, ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్ అంటే వేరే లెవల్‌ పని. ట్రాఫిక్‌ జామ్‌లు, చిన్న రోడ్లు, టైట్‌ పార్కింగ్‌ వంటివన్నీ ఎదుర్కోవాలంటే కారు కాంపాక్ట్‌గా ఉండాలి. అదే సమయంలో మైలేజ్‌ బాగుండాలి, కంఫర్ట్‌ మిస్‌ కాకూడదు. ఇలాంటి సిటీలైఫ్‌కి సరిపడే కార్లలో కొన్ని ప్రత్యేకంగా నిలుస్తాయి. వాటిలో మారుతి సుజుకి ఇగ్నిస్, టాటా పంచ్, హ్యుందాయ్ i20 N, మారుతి వాగన్‌ R మోడల్స్‌ నిజంగా బాగున్నాయి. వీటిలో ప్రతి కారు తనదైన స్టైల్‌, ఫీచర్లు, ధరతో నగర రోడ్లపై డ్రైవ్‌కి బాగా పనికొస్తుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్బడ్జెట్‌ రేటులో వచ్చే, కాంపాక్ట్ & స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తుంటే, Maruti Suzuki Ignis మీకు సరైన ఎంపిక కావచ్చు. ప్రత్యేకంగా నగరాల కోసమే ఈ కారును డిజైన్‌ చేశారు. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది SUVలా శక్తిమంతమైనది కాకపోవచ్చు, కానీ తక్కువ బరువు & కాంపాక్ట్ డిజైన్ కారణంగా సిటీ ట్రాఫిక్‌లో చాలా సులభంగా నడపవచ్చు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది, ఈ కారణంగా గుంతల రోడ్లు & స్పీడ్‌ బ్రేకర్ల దగ్గర కూడా సౌకర్యవంతంగా నడుస్తుంది. ఆంధ్ర & తెలంగాణలో ఇగ్నిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.85 లక్షల నుంచి ప్రారంభమై రూ. 8.12 లక్షల వరకు ఉంటుంది.

హ్యుందాయ్ i20 N లైన్సిటీ డ్రైవింగ్‌ కార్‌లోనే స్పోర్టీ అప్పీల్‌ కోరుకుంటే, హ్యుందాయ్ i20 N లైన్ మీకు ఆలోచనలకు సరిపోయే ఎంపిక. స్టాండర్డ్ i20 తో పోలిస్తే ఈ కారు చాలా భిన్నంగా ఉంటుంది. దీనిలో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. DCT వేరియంట్‌లో స్పోర్టీ సస్పెన్షన్, డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్ & ప్యాడిల్ షిఫ్టర్స్‌ వంటి ఫీచర్లు వస్తాయి. దీని డ్రైవింగ్ అనుభవం, ముఖ్యంగా స్పోర్టీ లుక్స్ & స్పీడ్‌ కార్లను ఇష్టపడే వారికి నచ్చుతుంది. హైదరాబాద్‌/ విజయవాడలో హ్యుందాయ్ i20 N లైన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 12.56 లక్షల వరకు ఉంటుంది.

స్కోడా కైలాక్‌Skoda ఇటీవలే Kylaq భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV. 1.0-లీటర్ TSI ఇంజిన్‌తో దాదాపు 108 bhp పవర్‌ & 178 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ కారు మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఈ కారు విషయంలో గొప్పగా చెప్పాల్సిన విషయం దాని 5-స్టార్ భారత్ NCAP భద్రతా రేటింగ్. ఈ రేటింగ్‌ ఈ కారును కుటుంబానికి సురక్షితమైన ఎంపికగా నిలబెట్టింది. దీంతో పాటు స్మూత్‌ హ్యాండ్లింగ్‌ & మెరుగైన రిఫైన్‌మెంట్‌కు హామీ ఇస్తుంది. స్కోడా కైలాక్ ధర రూ. 8.25 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

మారుతి డిజైర్ సిటీ రోడ్లపై డ్రైవ్‌ చేయడానికి Maruti Dzire కూడా మంచి ఎంపిక. ఈ కారు కాంపాక్ట్ సైజులో ఉంది. దీనివల్ల తక్కువ స్థలంలో పార్క్‌ చేయడం & ట్రాఫిక్‌లో నడపడం సులువుగా ఉంటుంది. డిజైర్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది మృదువైన డ్రైవింగ్ & మంచి మైలేజీని ఇస్తుంది. సెడాన్‌ కావాలి, కానీ ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే వారికి ఇది సరైన ఎంపిక. మారుతి డిజైర్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.51 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.39 లక్షల  (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.