Best 125cc Office Bikes 2025: తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడవుతున్న బైకుల్లో మెజారిటీ వాటా 125cc బైకులదే. అటు యూత్‌కు & ఇటు ఫ్యామిలీ మ్యాన్ అవసరాలకు ఇవి సరిగ్గా సరిపోతున్నాయి, హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అందుబాటు ధర, తక్కువ నిర్వహణ ఖర్చులు & బెస్ట్ పెర్ఫార్మెన్స్ కారణంగా 125cc బైకుల కోసం జనం ఎగబడుతున్నారు.
Honda Shine 125ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో, 125cc విభాగంలో హోండా షైన్ ఒక మోస్ట్ పాపులర్ బైక్. దీని డ్రమ్ వేరియంట్ ధరలు రూ. 78,777 & డిస్క్ వేరియంట్ ధరలు రూ. 83,136 నుంచి (Honda Shine 125 Price) ప్రారంభమవుతాయి. ఈ బైక్ 123.94 సీసీ ఇంజిన్.. 10.59 bhp & 11 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. హోండా షైన్ మైలేజ్ లీటరుకు సుమారు 55-65 km, కాబట్టి ఇది ఇంధన-సమర్థవంతమైన బైక్‌గా నిలుస్తుంది.
Bajaj Pulsar 125 బజాజ్ పల్సర్ 125 స్టైలిష్‌గా ఉండడమే కాకుండా బడ్జెట్-ఫ్రెండ్లీ కూడా. ఇది 124.4 సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 11.8 PS గరిష్ట శక్తిని & 10.8 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. తెలుగు నగరాల్లో ఈ బైక్ ధర రూ. 85,285 (Bajaj Pulsar 125 Price) నుంచి స్టార్ట్ అవుతుంది.
Hero Glamour X125 హీరో గ్లామర్ X125 కూడా చాలా గ్లామరస్ & శక్తిమంతమైన 125 సీసీ కమ్యూటర్ బైక్. ఈ బైక్ 124.7 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 11.5 bhp పవర్ & 10.4 Nm టార్క్‌ను ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో, హీరో గ్లామర్ X125 డ్రమ్ వేరియంట్ ధరలు రూ. 89,999 & డిస్క్ వేరియంట్ ధర రూ. 99,999 నుంచి (Hero Glamour X125 Price) ప్రారంభమవుతాయి.
Honda SP 125హోండా SP125 బైక్ స్టైలిష్‌గా & మోడ్రన్ ఫీచర్లతో తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో, ఈ బైక్ ధర డ్రమ్ వేరియంట్‌కు రూ. 85,962 & డిస్క్ వేరియంట్‌కు రూ. 93,585 (Honda SP 125 Price). దీని 123.94 సీసీ ఇంజిన్ 10.72 bhp పవర్ & 10.9 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
TVS Raider 125ఈ లిస్ట్‌లో ఐదో బైక్ టీవీఎస్ రైడర్. ఆధునిక ఫీచర్లతో పాటు స్పోర్టీ డిజైన్‌ను ఇష్టపడే వారి కోసం వచ్చింది ఈ మోటర్ సైకిల్. తెలుగు ప్రజల కోసం టీవీఎస్ రైడర్ ధరలు డ్రమ్ వేరియంట్‌కు రూ. 83,400 & డిస్క్ వేరియంట్‌కు రూ. 86,300 (TVS Raider 125 Price) నుంచి మొదలవుతాయి. ఈ బైక్ 124.8 సీసీ, 3-వాల్వ్, ఎయిర్- కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది.
ఈ బెస్ట్-5 లిస్ట్ నుంచి, మీ అవసరం & బడ్జెట్‌కు తగిన ఒక బైక్‌ను ఎంచుకోవచ్చు.