Maruti Baleno Facelift 2026 | మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడయ్యే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలేనోను కొత్త లుక్‌లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం, మారుతి కంపెనీ ఈ ఏడాది చివరినాటికి కొత్త బలేనో ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. బలేనో కారు టెస్టింగ్ సమయంలో కనిపించింది.
ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌లో కూడా పెద్ద మార్పులు ఉంటాయని కస్టమర్లు ఆశిస్తున్నారు. ప్రత్యేకమైన విషయమేమిటంటే, కొత్త బలేనోలో మొదటిసారిగా హైబ్రిడ్ టెక్నాలజీతో రానుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల దీని మైలేజ్ గతంలో కంటే మెరుగ్గా మారవచ్చు.
బలేనో ఫేస్‌లిఫ్ట్ ప్రోటోటైప్ ఇటీవల కనిపించింది. దీనితో ఈ సంవత్సరం దీని లాంచింగ్ ఆశలు మరోసారి పెరిగాయి. బలేనో ఫేస్‌లిఫ్ట్ వాహనం టెస్ట్ మ్యూల్‌ను కవర్‌తో కప్పి ఉంచారు. ఈ వాహనం డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ అన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పాత వెహికల్ కంటే మరింత కొత్తగా బలేనో ఫేస్‌లిఫ్ట్
మారుతి కొత్త బలేనో ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్‌లో పలు మార్పులు కనిపించవచ్చు. కారు ముందు భాగాన్ని గతంలో కంటే మరింత స్పోర్టీగా, మోడ్రన్‌గా మార్చవచ్చు. ఇందులో కొత్త గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త LED DRLలు, అప్‌డేటెడ్ LED హెడ్‌ల్యాంప్స్, కొత్త డిజైన్ అలాయ్ వీల్స్ లభించే అవకాశం ఉంది. రియర్ ప్రొఫైల్‌లో కొత్త LED టైల్‌ల్యాంప్స్, మారిన బంపర్ ఇస్తారని ఆశిస్తున్నారు. కారు ఓవర్‌ఆల్ సైజ్ మునుపటిలాగే ఉండే అవకాశం ఉంది.
Also Read: : ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
కారు ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. మారుతి కంపెనీ బలేనో కొత్త క్యాబిన్ థీమ్, మెరుగైన క్వాలిటీ సీట్ అప్‌హోల్స్టరీ, ప్రీమియం ఫినిష్ ఇవ్వవచ్చు. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లను చేర్చవచ్చు. దీనివల్ల కొత్త బలేనో ఫేస్‌లిఫ్ట్ మరింత ప్రీమియంగా అనిపిస్తుంది.
సేఫ్టీ విషయంలో కంపెనీ పెద్ద అప్‌డేట్ ఇవ్వవచ్చు. కొత్త బలేనోలో ADAS వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు రావొచ్చు. దీనితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా ఇవ్వవచ్చు. అలా జరిగితే తన సెగ్మెంట్‌లో అత్యంత అడ్వాన్స్‌డ్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో బలేనో ఫేస్‌లిఫ్ట్ చేరవచ్చు.
అత్యంత పెద్ద మార్పు ఏమిటీ..
కొత్త బలేనో ఫేస్‌లిఫ్ట్ అత్యంత పెద్ద మార్పు దీని ఇంజిన్‌లో చూపవచ్చు. కంపెనీ ఇందులో కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఇవ్వొచ్చు. ఈ సిస్టమ్ పెట్రోల్ ఇంజిన్‌తో కలిసి పనిచేస్తూ ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల కారు మైలేజ్ ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే చాలా మెరుగవుతుంది. కొన్ని నివేదికలలో కొత్త Z-సిరీస్ 3 సిలిండర్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ సిస్టమ్ వస్తుందని భావిస్తున్నారు.
బలేనోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, CNG ఆప్షన్ లభిస్తాయి. కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో కొన్ని వేరియంట్లలో ఈ ఆప్షన్లు కొనసాగించవచ్చు. అయితే హైబ్రిడ్ వేరియంట్‌ను కొత్త ప్రత్యామ్నాయంగా తీసుకురావచ్చు.
వాహనం ధర ఎంత
ధర విషయానికి వస్తే, కొత్త బలేనో ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే ఎక్కువగా ఉండనుంది. దీనికి కారణం కొత్త ఫీచర్లు, మెరుగైన సేఫ్టీ, హైబ్రిడ్ టెక్నాలజీ. లాంచ్ అయిన తర్వాత హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాంజా వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోటీ పడుతుంది.
కొత్త మారుతి బలేనో ఫేస్‌లిఫ్ట్ కేవలం ఒక డిజైన్ అప్‌డేట్ మాత్రమే కాదని, లుక్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్ విషయంలో పాత మోడల్ కంటే అడ్వాన్స్‌డ్ మోడల్‌గా రానుంది. దీనివల్ల ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది.
