Bajaj pulsar 150 Price, Down Payment, Loan and EMI Details: మన దగ్గర Bajaj Pulsar 150 కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్, స్టైల్ & మైలేజ్ కలబోతగా వచ్చిన ఈ బైక్ ఎంతోమంది కుర్రాళ్ళ కలల బండి. మీరు కూడా 2026 మోడల్ బజాజ్ పల్సర్ 150 ని ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈజీ ఫైనాన్స్ ఆప్షన్లు ఉన్నాయి.

Continues below advertisement

 ఎక్స్-షోరూమ్ & ఆన్-రోడ్ ధరల వివరాలు

ప్రస్తుతం మార్కెట్‌లో Bajaj Pulsar 150 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1,15,233. RTO రిజిస్ట్రేషన్ & ఇన్సూరెన్స్ ఛార్జీలు కలిపితే, వివిధ వేరియంట్లను బట్టి ఆన్-రోడ్ ధర సుమారు రూ. 1,29,000 నుంచి రూ. 1,38,000 వరకు ఉంటుంది.

Continues below advertisement

 కనీస డౌన్‌పేమెంట్ ఎంత?

వివిధ ఫైనాన్స్ కంపెనీలు & బ్యాంకులు ఆఫర్ చేస్తున్న స్కీమ్‌ల ప్రకారం, మీరు Bajaj Pulsar 150 ని సొంతం చేసుకోవడానికి కనీసం 10% నుంచి 15% వరకు డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

 కనీస డౌన్‌పేమెంట్: రూ. 11,523 నుంచి రూ. 12,994 వరకుపండుగ సీజన్ లేదా స్పెషల్ ఆఫర్ల సమయంలో రూ.3,999 నుంచి మొదలయ్యే లో-డౌన్‌పేమెంట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇది కూడా చదవండి: హ్యాచ్‌బ్యాక్ నుంచి 7 సీటర్ వరకు.. రూ.10 లక్షల్లోనే వచ్చే బెస్ట్ CNG కార్లు ఇవే!

 చెల్లుబాటు అయ్యే EMI ఆప్షన్లు & క్యాలిక్యులేషన్

మీరు ఎంచుకునే లోన్ వ్యవధి (Tenure) & వడ్డీ రేటును బట్టి ప్రతి నెల చెల్లించాల్సిన EMI మారుతుంది. బ్యాంకులు సగటున 9.7% నుంచి 12% వరకు వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి.

36 నెలల టెన్యూర్ (3 Years): మీరు రూ. 11,523 డౌన్‌పేమెంట్ చేసి, 9.7% వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే, నెలకు EMI సుమారు రూ. 3,346 నుంచి రూ. 3,655 వరకు ఉంటుంది.24 నెలల టెన్యూర్ (2 Years): మూడేళ్లు వద్దు, ఇంకో ఏడాది ముందుగానే లోన్ క్లియర్ చేయాలనుకుంటే, నెలకు EMI సుమారు రూ. 4,800 దాకా ఉంటుంది.60 నెలల టెన్యూర్ (5 Years): EMI మొత్తాన్ని తగ్గించుకోవడానికి కాస్త ఎక్కువ టెన్యూర్‌ ఎంచుకుంటే, నెలకు కేవలం రూ. 2,204 నుంచి రూ. 2,333 వరకు పడుతుంది.

 ఫైనాన్స్ & లోన్ అర్హతలు

బ్యాంకులు లోన్ మంజూరు చేయడానికి ప్రాథమికంగా మీ సిబిల్‌ స్కోర్‌ (CIBIL Score) పరిశీలిస్తాయి. మీ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటుకే బైక్‌ లోన్ లభించే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్‌మెంట్ & ఇన్‌కమ్ ప్రూఫ్ డాక్యుమెంట్లు సమర్పిస్తే ప్రాసెసింగ్ సులభంగా పూర్తవుతుంది.

ఇది కూడా చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs ట్రయంఫ్ స్పీడ్ 400: మీకు సరిగ్గా సరిపోయే బైక్ ఏది?

 బైక్ కీ-స్పెసిఫికేషన్స్ & ఆఫర్ల పట్టిక

షోరూమ్ లేదా బ్యాంక్‌ను ఎంచుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజు, హిడెన్ ఛార్జీలు & ఆన్-రోడ్ ఇన్సూరెన్స్ ధరలను సరిగ్గా చెక్ చేసుకోండి. వివిధ బ్యాంకుల EMI ఆఫర్లను పోల్చి చూసి, మీ బడ్జెట్‌కు సరిపోయే బెస్ట్‌ ప్లాన్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.