Bajaj Platina 125 Price, Mileage And Features In Telugu: బజాజ్ ఆటో, కొత్త ప్లాటినా 125 ను భారతదేశానికి పరిచయం చేసింది. పెరిగిన ఇంధన ధరలు రోజువారీ ప్రయాణికులకు భారంగా మారిన నేపథ్యంలో, బజాజ్‌ ఈ బైక్‌ను ఆవిష్కరించింది. విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు & డెలివరీ బాయ్స్‌ వంటి వర్గాలకు అనువుగా దీనిని డిజైన్‌ చేశారు. నగర ట్రాఫిక్‌లో & సెమీ-అర్బన్ రోడ్లపై సులభంగా నడిపేలా రూపొందించారు. స్మూత్‌ ఇంజిన్, ఆధునిక ఫీచర్లు & తక్కువ ధరను మేళవించి, ఈ 125cc బైక్‌ను బజాజ్‌ తీసుకొస్తోంది.

రోజువారీ రైడింగ్ కోసం...కొత్త ప్లాటినా 125 మోటార్‌ సైకిల్‌కు శక్తినివ్వడానికి 124.6cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది 8.5 BHP & 10 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో మెరుగైన పనితీరు & ఇంధన సామర్థ్యాన్ని అందించడానికి ఈ సెటప్ ఉపయోగపడుతుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ కారణంగా సున్నితమైన గేర్ షిఫ్టింగ్ అనుభవం కలుగుతుంది, రైడింగ్‌లో నాణ్యత పెరుగుతుంది. భారీగా ట్రాఫిక్ ఉన్న రోడ్లకు మాత్రమే కాకుండా & హైవేకి కూడా ఈ బైక్‌ అనుకూలంగా ఉంటుంది, గంటకు 95 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. అంటే, దేశంలోని విభిన్న రహదారి పరిస్థితులతో ప్రయాణించగలిగేలా కొత్త ప్లాటినా 125 డిజైన్‌ ఉంది.

సౌకర్యం & భద్రతకొత్త ప్లాటినా 125 బోర్డులో చాలా అనుకూలమైన అప్‌డేట్స్‌ ఉన్నాయి. ప్రకాశవంతమైన LED డేటైమ్ రన్నింగ్ లైట్లు పగటి పూట & స్లీకర్ హెడ్‌ల్యాంప్ రాత్రి సమయంలో విజిబులిటీని పెంచుతాయి. రైడ్‌ చేస్తున్నప్పుడు, ఒక్క చూపులోనే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అర్ధం చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన భద్రతా లక్షణం సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ఇది ప్రమాదాలను తగ్గిస్తుంది. చక్కటి, విశాలమైన, కుషన్డ్ సీటు వల్ల లాంగ్ రైడ్స్‌ సౌకర్యంగా ఉంటాయి. ముఖ్యంగా డెలివరీ రైడర్లకు బాగా ఉపయోగపడుతుంది.

డబ్బును ఆదా చేసే అత్యుత్తమ మైలేజ్ప్లాటినా 125 హైలైట్స్‌లో ఇంధన సామర్థ్యం ఒకటి. అనువైన పరిస్థితులలో, ఈ మోటార్‌ సైకిల్‌ లీటరుకు 100 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్పింది. వాస్తవ వినియోగం లీటరుకు 70-80 కి.మీ. మధ్య ఉండవచ్చు. 

ఫ్లెక్సిబుల్ ఫైనాన్సింగ్‌ ఆప్షన్‌ ₹78,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే ధర కారణంగా, కొత్త ప్లాటినా 125 బడ్జెట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఆప్షన్‌ అవుతుంది. నెలకు ₹2,500 కంటే తక్కువ EMI & కేవలం ₹5,000 డౌన్ పేమెంట్‌కు ఫైనాన్సింగ్ ప్లాన్‌లను బజాజ్‌ అందుబాటులోకి తెచ్చింది. దీనికి తోడు, తక్కువ రన్నింగ్ ఖర్చులు ఉండటం వల్ల, ఈ బైక్‌ పొదుపు కూడా చేస్తుంది.

ఛాలెంజింగ్ రోడ్లను తట్టుకునేలా నిర్మాణంభారతదేశంలోని అత్యంత ఛాలెంజింగ్ రోడ్లను - గుంతలు పడిన వీధులు, బంపర్-టు-బంపర్ ట్రాఫిక్ వంటి వాటిని సమర్ధంవంతంగా తట్టుకునేలా ప్లాటినా 125 ని తయారు చేశారు. మన్నికైన నిర్మాణం & నమ్మకమైన ఇంజిన్ భాగాలు రోజువారీ ప్రయాణంలో ఇబ్బంది పెట్టవు. 

బజాజ్ ప్లాటినా 125 అనేది సామర్థ్యం, సౌకర్యం & సరసమైన ధరలో అత్యుత్తమమైన కమ్యూటర్ బైక్. నగరంలో రోజూ తిరగడానికి, డెలివరీ పనులకు, అప్పుడప్పుడు హైవే రైడ్స్‌ కోసం ఇది నమ్మదగిన ప్రయాణ సాధనం అని కంపెనీ చెబుతోంది.