Discount Offer On Bajaj Freedom 125 CNG Bike: బజాబ్ ఆటో యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ "ఫ్రీడమ్ 125" మోటార్ సైకిల్ మీద రూ. 5,000 డిస్కౌంట్ ప్రకటించింది బజాజ్ ఆటో. ఈ రాయితీ తర్వాత, న్యూ రేంజ్ ఎక్స్-షోరూమ్ ధర (Bajaj Freedom 125 CNG ex-showroom price) రూ. 85,976 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ తగ్గింపు బేస్ వేరియంట్ మీద (NGO4 డ్రమ్ వేరియంట్) అందుబాటులో ఉంది, ఇది పరిమిత కాలం ఉండే ఆఫర్. బజాజ్ ఆటో, తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఆఫర్ ప్రకటించింది.
బజాజ్ ఫ్రీడమ్ బైక్‌కు పవర్ అందించేందుకు శక్తిమంతమైన 125cc ఇంజిన్ బిగించారు. ఇది బండికి, రైడర్‌కు బ్రహ్మాండమైన శక్తిని & అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దాని మిడ్-స్పెక్ 'NG04 డ్రమ్' LED & టాప్ ఆఫ్ ది లైన్ 'NG04 డిస్క్ బ్రేక్'లో ఎటువంటి మార్పులు చేయలేదు.
యూత్‌ని, ఫ్యామిలీని మెప్పించే డిజైన్‌బజాజ్ ఫ్రీడమ్ 125 డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, యువతకు చాలా బాగా నచ్చింది. ఇంకా, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే ఫ్యామిలీ మ్యాన్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ టూవీలర్‌ను డిజైన్ చేశారు. అంటే.. ఇది యూత్ ఓరియంటెడ్ + ఫ్యామిలీ ఓరియెంటెడ్ బైక్. ఈ టూవీలర్‌లో డిజిటల్ డిస్‌ప్లే, LED లైట్లు & కంఫర్టబుల్ సీటింగ్ ఇచ్చారు. లాంగ్ రైడ్స్‌తో పాటు ఫ్యామిలీతో కలిసి జర్నీ చేయడానికి ఈ సీట్ సౌకర్యంగా ఉంటుంది. ఈ బండి మీద కూర్చున్నాక, మిడిల్ ఏజ్డ్ పర్సన్ కూడా కుర్రవాడిలా కనిపించేలా బైక్ డిజైన్ ఉంటుంది.
బజాజ్ ఫ్రీడమ్ బైక్ మైలేజ్ (Bajaj Freedom 125 CNG Bike Mileage)బజాజ్ ఫ్రీడమ్ బైక్ లీటరు పెట్రోలుకు 60-65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, రైడర్ డబ్బు ఆదా అవుతుందని కంపెనీ వెల్లడించింది.
CNG మైలేజ్: బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ CNG ట్యాంక్ కెపాసిటీ 2 కిలోలు. ఒక కిలో CNGకి 102 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే, 2 కిలోల సీఎన్‌జీతో 204 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
పెట్రోల్ మైలేజ్: ఈ బండికి 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది, లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ లెక్కన, ట్యాంక్ ఫుల్ చేస్తే 130 కిలోమీటర్ల రేంజ్ చూడవచ్చు.
కంబైన్డ్ రేంజ్: ఈ రెండు ఇంధన వనరులను (పెట్రోల్ + CNG) కలిపితే, బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ మీద దాదాపు 330 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. తద్వారా, తక్కువ ఇంధన వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
అట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లు, మెరుగైన మైలేజ్ కారణంగా ఈ బైక్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇది బడ్జెట్ బండి కావడం వల్ల కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇప్పుడు, రూ. 5000 డిస్కౌంట్ ఇచ్చి మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలన్నది బజాజ్ ఆటో ప్లాన్.