Automobile Sector After GST 2.0 Reforms: సెప్టెంబర్‌ 22 నుంచి, భారత ఆటోమొబైల్‌ రంగం పెద్ద ఎత్తున మార్పులు చూడబోతుంది. ఆ రోజు నుంచే కొత్త జీఎస్‌టీ సంస్కరణలు (GST Reforms 2.0) అమలులోకి వస్తాయి. కొత్త GST హేతుబద్ధీకరణతో వాహన ధరలు తగ్గడం, పాత వాహనాలను కొత్త వాటితో రీప్లేస్‌ చేసే ప్రణాళికలు, ఈ రంగంలో పని చేస్తున్న 3.5 కోట్ల మందికి మద్దతు వంటి అంశాలు ఆటో ఇండస్ట్రీకి కొత్త వేగాన్ని అందిస్తాయి.

Continues below advertisement

భారత ప్రభుత్వం ప్రకటించిన GST 2.0 రూల్స్‌ ఆటో రంగానికి & దాని సంబంధిత అన్ని పరిశ్రమలకు గేమ్-ఛేంజర్ అవుతుంది. కొత్త GST నిర్మాణం కింద, టూవీలర్లు, చిన్న కార్లు, ట్రాక్టర్లు, బస్సులు & వాణిజ్య వాహనాలపై పన్నులు తగ్గుతాయి. ఇది వాహన ధరలు తగ్గిస్తుంది, డిమాండ్‌ పెంచుతుంది & కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఈ సంస్కరణ మేక్ ఇన్ ఇండియా, PM గతి శక్తి & క్లీన్ మొబిలిటీ వంటి కార్యక్రమాలను కూడా సపోర్ట్‌ చేస్తుంది.

సామాన్యుడి కార్లు 10% వరకు చౌకనిజానికి, GST రేట్ల తగ్గింపు వల్ల వచ్చే మొదటి & అతి పెద్ద ప్రభావం కామన్‌ మ్యాన్‌పైనే ఉంటుంది. ద్విచక్ర వాహనాలు & చిన్న కార్లు 10% వరకు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. GST స్లాబ్‌ల తగ్గింపుతో పాటు కంపెనీలు అదనంగా డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఈ చర్యల ఫలితంగా గ్రామీణ & పట్టణ ప్రాంతాలలోనూ ఆటోమొబైల్ రంగానికి డిమాండ్‌ పెరుగుతుంది. ఇది లాజిస్టిక్స్ & సేవా రంగాలలో కూడా వృద్ధికి దారితీస్తుంది. ఇంకా, బ్యాంకులు, NBFCలు & ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా లోన్‌ తీసుకుని వెహికల్స్‌ కొనుగోలు చేయడం సులభం అవుతుంది, EMI భారం తగ్గుతుంది.

Continues below advertisement

3.5 కోట్ల ఉద్యోగాలకు మద్దతుGST సంస్కరణల లక్ష్యం కేవలం వాహనాల ధరలను తగ్గించడం మాత్రమే కాదు, ఇది ఉపాధిపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. నివేదికల ప్రకారం, GST 2.0 ఆటో & సంబంధిత పరిశ్రమలలో 35 మిలియన్లకు (3.5 కోట్లు) పైగా ఉద్యోగాలకు మద్దతు ఇస్తుంది. టైర్లు, బ్యాటరీలు, ఉక్కు, ప్లాస్టిక్‌, గాజు & ఎలక్ట్రానిక్స్ వంటి చిన్న పరిశ్రమలను బలోపేతం చేస్తుంది. డ్రైవర్లు, మెకానిక్‌లు, గిగ్ వర్కర్లు & సేవా రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

పాత వాహనాలకు గుడ్‌బై - కొత్త వాహనాలకు వెల్‌కమ్‌!GST సంస్కరణ వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే, ప్రజలు ఇప్పుడు తమ పాత & కాలుష్య కారకాల వాహనాల నుంచి కొత్త, ఇంధన-సమర్థవంతమైన, EV-ఆధారిత వాహనాలకు మారతారు. ఇది రోడ్డు కాలుష్యం & ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సాయపడుతుంది. బస్సులు వంటి ప్రజా రవాణా వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు, భారత ప్రభుత్వం వాహనాల స్క్రాప్‌ పాలసీని మరింత బలోపేతం చేస్తోంది. రోడ్లపై నడుస్తున్న పాత, కాలుష్య కారక వాహనాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సాహకాలు ఇస్తోంది. 

GST హేతుబద్ధీకరణ - రెండు ప్రధాన రేట్లు మాత్రమేఇప్పుడు GST నాలుగు స్లాబ్‌లుగా ఉంది అవి - 5%, 12%, 18% & 28%. సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి నాలుగు కాస్తా రెండు అవుతాయి. అంటే, రెండు ప్రధాన GST రేట్లు (5% & 18%) మాత్రమే అమలవుతాయి. దీని వల్ల ఆటోమొబైల్‌ రంగంలో పన్నుల భారం తగ్గి, వినియోగదారులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. లగ్జరీ & సిన్‌ గూడ్స్‌ మీద మాత్రం ప్రత్యేకంగా 40% పన్ను విధిస్తారు. ప్రభుత్వం దీనిని తదుపరి తరం GST హేతుబద్ధీకరణ అని చెబుతోంది.

వాహన రంగానికి భవిష్యత్ దశ &దిశఈ మార్పులన్నీ కలిసి ఆటోమొబైల్‌ రంగానికి ఒక కొత్త దశను &దిశను నిర్దేశిస్తాయి. వాహన విక్రయాలు పెరగడం, ఉత్పత్తి వృద్ధి, కొత్త టెక్నాలజీలకు ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ - అన్నీ కలిసి పరిశ్రమను బలోపేతం చేస్తాయి. మొత్తంగా చూస్తే, సెప్టెంబర్‌ 22 తర్వాత ఆటోమొబైల్‌ రంగం ఇటు సామాన్య ప్రజలకు, అటు పరిశ్రమకు అందరికీ లాభదాయకంగా మారబోతోంది.