Best Mileage Cars Under Rs 10 Lakhs In India 2025: ఇంధన ఖర్చులు నానాటికీ పెరిగిపోతుండటంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయగల కార్లకు డిమాండ్ వేగంగా పెరిగింది. రూ. 10 లక్షల లోపు ధర కలిగిన పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్ల కోసం మధ్యతరగతి ప్రజలు సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం, మార్కెట్‌లో అందుబాటులో ఉండి & మంచి మైలేజ్ ఇస్తున్న టాప్ 10 కార్ల జాబితా ఇది. మైలేజ్ మాత్రమే కాకుండా... ఇంజిన్ కెపాసిటీ, ఇంటీరియర్ స్పేస్, ఫీచర్లు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ లిస్ట్ తయారైంది.
రూ.10 లక్షల్లో బెస్ట్ మైలేజ్ పెట్రోల్ కార్లు:
1. Maruti Suzuki Celerio
ఇంజిన్: 1.0 లీటర్
ARAI సర్టిఫైడ్ మైలేజ్: 25.24 kmpl
ధర: ₹5.84 – ₹7.13 లక్షలు
ఫీచర్లు: స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
2. Maruti Suzuki Swift 2025
ఇంజిన్: 1.2 లీటర్
ARAI సర్టిఫైడ్ మైలేజ్: 24.8 kmpl (MT), 25.75 kmpl (AMT)
ధర: ₹6.5 – ₹9.5 లక్షలు
ఫీచర్లు: కొత్త HEARTECT ప్లాట్‌ఫాం, టచ్‌స్క్రీన్, క్రూజ్ కంట్రోల్
3. Tata Tiago
ఇంజిన్: 1.2 లీటర్
ARAI సర్టిఫైడ్ మైలేజ్: 20.1 kmpl
ధర: ₹5.65 – ₹8.90 లక్షలు
ఇంటీరియర్: స్పోర్టీ డ్యాష్‌బోర్డ్, 7 అంగుళాల టచ్‌స్క్రీన్
రూ.10 లక్షల్లో బెస్ట్ మైలేజ్ డీజిల్ కార్లు:(డీజిల్ కార్ల ఎంపికలు ప్రస్తుతం తగ్గుతున్నా, కొన్ని మోడల్స్ ఇంకా లభ్యమవుతున్నాయి.)
4. Hyundai Aura Diesel (పూర్తిగా డీజిల్)
ఇంజిన్: 1.2 లీటర్
ARAI సర్టిఫైడ్ మైలేజ్: 25.4 kmpl
ధర: ₹8.2 – ₹9.8 లక్షలు
ఇంటీరియర్: డ్యూయల్ టోన్ డిజైన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
రూ.10 లక్షల్లో బెస్ట్ మైలేజ్ CNG కార్లు:
5. Maruti WagonR CNG
ఇంజిన్: 1.0 లీటర్
ARAI సర్టిఫైడ్ మైలేజ్: 34.05 km/kg
ధర: ₹6.50 – ₹7.30 లక్షలు
ఫీచర్లు: డ్యూయల్-టోన్ బాడీ, కనెక్టెడ్ కారు ఫీచర్లు
6. Tata Punch CNG
ఇంజిన్: 1.2 లీటర్
ARAI సర్టిఫైడ్ మైలేజ్: 26.99 km/kg
ధర: ₹7.1 – ₹8.5 లక్షలు
ప్రత్యేకత: డ్యుయల్ సిలిండర్ టెక్నాలజీ, బూట్ స్పేస్‌తో CNG
7. Maruti Baleno CNG
ఇంజిన్: 1.2 లీటర్
ARAI సర్టిఫైడ్ మైలేజ్: 30.61 km/kg
ధర: ₹8.30 – ₹9.60 లక్షలు
ఇంటీరియర్: HUD డిస్‌ప్లే, 9 అంగుళాల టచ్‌స్క్రీన్
హైబ్రిడ్ కార్లు (Petrol + Electric):
8. Toyota Glanza Smart Hybrid
ఇంజిన్: 1.2 లీటర్ + మైల్డ్ హైబ్రిడ్
ARAI సర్టిఫైడ్ మైలేజ్: 23.87 kmpl
ధర: ₹9.30 లక్షల లోపు
ఫీచర్లు: Idle Start-Stop, Regenerative Braking
మరో రెండు బడ్జెట్ మైలేజ్ మాస్టర్స్:
9. Maruti Alto K10
ఇంజిన్: 1.0 లీటర్
ARAI సర్టిఫైడ్ మైలేజ్: 24.9 kmpl
ధర: ₹4.5 – ₹6.0 లక్షలు
ఇంటీరియర్: సింపుల్, ప్రాక్టికల్
10. Hyundai Exter CNG
ఇంజిన్: 1.2 లీటర్
ARAI సర్టిఫైడ్ మైలేజ్: 27.1 km/kg
ధర: ₹8.24 – ₹8.97 లక్షలు
ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగ్స్, డాష్‌క్యామ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
2025లో.. పెట్రోల్, డీజిల్, లేదా CNG కార్లలో ₹10 లక్షల బడ్జెట్‌లో మైలేజ్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారులకు ఈ కార్లు బెస్ట్ ఆప్షన్స్. మీ అవసరాన్ని బట్టి ఎలాంటి ఇంధన రకాన్ని ఎంచుకోవాలో తెలుసుకుని కొనుగోలు చేయడం ఉత్తమం.