Best CNG Cars for City Driving in India: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు జేబులను గుల్ల చేస్తున్న నేపధ్యంలో.. నగరాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్‌ ఎక్కువగా ఇచ్చే వాహనాలను ప్రజలు ఎక్కువగా కొంటున్నారు. ఈ సమయంలో, CNG వేరియంట్లు అత్యంత పాపులర్‌ అయ్యాయి. CNG వాహనాలు ఫ్యూయల్‌ ఎఫిషియంట్‌ మాత్రమే కాకుండా, నిర్వహణ ఖర్చూ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా, డైలీ కమ్యూట్‌ చేసే 'సిటీ'జన్లకు ఇవి సరైన ఎంపిక. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్‌ CNG కార్లపై పూర్తి వివరాలు:

1. Maruti Suzuki WagonR CNG

  • వాగన్‌ఆర్‌ CNG సిటీ కోసం తయారైనట్లే ఉంటుంది. ఎత్తైన బాడీతో నగరాల్లో ట్రాఫిక్‌ మధ్య సులభంగా నడిపించవచ్చు.
  • ఇంజిన్‌: 1.0 లీటర్‌ K10C
  • పవర్‌: 56 bhp (CNG మోడ్‌లో)
  • మైలేజ్‌: 34.05 km/kg (ARAI ప్రకారం)
  • బూట్‌ స్పేస్‌: సుమారు 341 లీటర్ల వరకు
  • సేఫ్టీ ఫీచర్లు: డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ABS, EBD
  • సర్వీస్‌ ఖర్చు: సుమారుగా రూ. 4,000 – 5,000 ఏటా

2. Maruti Alto K10 CNG

  • ఫస్ట్‌ టైం కొనుగోలుదారులకు ఇది ఆర్ధికంగా అద్భుత ఎంపిక.
  • ఇంజిన్‌: 1.0 లీటర్‌ డ్యూయల్‌జెట్‌
  • పవర్‌: 56.6 bhp
  • మైలేజ్‌: 33.85 km/kg
  • బూట్‌ స్పేస్‌: CNG వేరియంట్‌లో తక్కువ – సుమారు 177 లీటర్లలోపు
  • సేఫ్టీ: డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, రివర్స్ పార్కింగ్‌ సెన్సర్లు
  • ఫీచర్లు: స్మార్ట్‌ప్లే ఇన్‌ఫోటైన్‌మెంట్‌ లేదు, కానీ డిజైన్‌ ఆధునికంగా ఉంది

3. Tata Tiago iCNG

  • బిల్డ్‌ క్వాలిటీ మెరుగ్గా ఉండే ఈ మోడల్‌లో చాలా భద్రత లక్షణాలు కూడా ఉన్నాయి.
  • ఇంజిన్‌: 1.2 లీటర్‌ Revotron
  • పవర్‌: 73.4 bhp (CNG మోడ్‌లో)
  • మైలేజ్‌: 26.49 km/kg
  • బూట్‌ స్పేస్‌: సుమారు 210 లీటర్లు
  • సేఫ్టీ: డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, కోలాప్స్‌బుల్‌ స్టీరింగ్‌
  • ఫీచర్లు: టచ్‌స్క్రీన్‌, Android Auto, Apple CarPlay
  • వాస్తవ మైలేజ్: సిటీ లో 22–23 km/kg వరకు రావచ్చు

4. Hyundai Grand i10 Nios CNG

  • క్లాస్‌ లుక్‌, కంఫర్ట్‌ కోరేవారికి హ్యూందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ సీఎన్‌జీ ఎప్పటికీ ప్రిఫర్డ్‌ మోడల్‌.
  • ఇంజిన్‌: 1.2 లీటర్‌
  • పవర్‌: 68 bhp
  • మైలేజ్‌: 27.3 km/kg
  • ఇంటీరియర్‌: డ్యూయల్‌ టోన్‌, అల్లాయ్ వీల్స్‌, LED DRLs
  • బూట్‌ స్పేస్‌: సుమారుగా 260 లీటర్లు
  • ఫీచర్లు: 8-inch టచ్‌స్క్రీన్‌, రివర్స్‌ కేమెరా
  • సేఫ్టీ: 4 స్టార్‌ గ్లోబల్‌ ఎన్‌కాప్‌ (పెట్రోల్ వేరియంట్)

5. Maruti Suzuki Celerio CNG

  • మారుతి నుంచి వచ్చిన హై మైలేజ్ మోడల్. సిటీ డ్రైవింగ్‌ కోసం పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
  • ఇంజిన్‌: 1.0 లీటర్‌ డ్యూయల్‌జెట్
  • పవర్‌: 56.7 bhp
  • మైలేజ్‌: 35.6 km/kg (భారతదేశంలో అత్యధిక సర్టిఫైడ్‌ CNG మైలేజ్‌)
  • బూట్‌ స్పేస్‌: సుమారు 235 లీటర్లు
  • ఫీచర్లు: ఐడియల్‌ స్టార్ట్‌ స్టాప్‌, స్మార్ట్‌ప్లే స్టుడియో, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్‌
  • వాస్తవ మైలేజ్‌: సిటీలో 30+ km/kg కూడా రిపోర్ట్‌ అయ్యింది

సరైన ఎంపికతో సిటీ డ్రైవింగ్‌ను స్మార్ట్‌గా మార్చుకోండిCNG వాహనాలు పెట్రోల్‌ వాహనాలకంటే 60-70% తక్కువ రన్నింగ్‌ ఖర్చుతో నడుస్తాయి. కానీ, CNG స్టేషన్ల లభ్యత, బూట్‌ స్పేస్‌ పరిమితి వంటి అంశాలను తప్పక పరిగణించాలి. రోజూ 40–50 కి.మీ ప్రయాణించే వారు CNG వాహనాల వైపు మొగ్గు చూపవచ్చు.